"నేను - కీర్తన" చిత్రం "కొంచెం కొంచెం గుడుగుడు గుంజమ్" ఐటమ్ సాంగ్ కు అదిరిపోయే స్పందన!!


చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన "నేను కీర్తన" చిత్రం నుంచి విడుదలైన "కొంచెం కొంచెం గుడు గుడు గుంజం" లిరికల్ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ఈ లిరికల్ వీడియోను ప్రముఖ నటులు మురళీమోహన్ ఆవిష్కరించారు. అంచుల నాగేశ్వరరావుతో కలిసి చిమటా రమేష్ బాబు సాహిత్యం అందించిన ఈ పాటను హరి గుంట - లాస్య ప్రియ ఆలపించారు. ఎమ్.ఎల్.రాజా ఈ చిత్రానికి సంగీత సారధి. హీరో రమేష్ బాబు - రేణు ప్రియలపై ఈ ఐటమ్ సాంగ్ చిత్రీకరించారు!!

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన "నేను-కీర్తన" చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు!!

"బేబి' దర్శకుడు సాయి రాజేష్ రిలీజ్ చేసిన సీతా కోకై" లిరికల్ వీడియోతోపాటు... జయభేరి అధినేత మురళీమోహన్ ఆవిష్కరించిన "కొంచెం కొంచెం గుడుగుడు గుంజం" లిరికల్ వీడియోకు కూడా అనూహ్యమైన స్పందన వస్తుండడం ఈ చిత్రం విజయంపై మా నమ్మకాన్ని మరింత పెంచింది" అంటూ ఈ రెండు పాటలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు చిమటా రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. "నేను - కీర్తన" చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని" ఆయన అన్నారు!!

మల్టీ జోనర్ ఫిల్మ్ గా తెరకెక్కి, సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న "నేను కీర్తన" చిత్రానికి బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ ఏర్పడింది. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు... ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది!!

సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, డి.ఐ: భాను ప్రకాష్, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి, పోరాటాలు: నూనె దేవరాజ్, నృత్యాలు: అమిత్ కుమార్ - సి.హెచ్.ఆర్, పాటలు: సి.హెచ్.ఆర్ - అంచుల నాగేశ్వరరావు - శ్రీరాములు, సంగీతం: ఎం.ఎల్.రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ, కూర్పు: వినయ్ రెడ్డి బండారపు, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), నిర్మాత: చిమటా లక్ష్మికుమారి, రచన - దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.)!!

No comments