ఫ్యాషన్ స్టార్టప్‌లకు అండగా 'టైలర్‌ట్రిక్స్'
▪️ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
▪️ టైలర్‌ట్రిక్స్ (Tailortrix) సంస్థ యాప్ లాంచ్
▪️ బోటిక్ వ్యాపారాలకు అత్యాధునిక ఫ్యాషన్ డిజైనింగ్ సాఫ్ట్‌వేర్
▪️ పెట్టుబడి లేకుండా వ్యాపారం ప్రారంభించండి
▪️ లోన్ అందిస్తూ వ్యాపారానికి సహకరిస్తాం: టైలర్‌ట్రిక్స్
హైదరాబాద్: ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవాళ్లకి, కొత్తగా రావాలనుకుంటున్న వాళ్లకి వ్యాపార పరంగా పూర్తిగా అండగా నిలిచేందుకు 'టైలర్‌ట్రిక్స్' అందుబాటులోకి వచ్చేసింది. టైలర్‌ట్రిక్స్ చైర్మన్ లావణ్య - కిరణ్ ఆధునిక సాంకేతికతతో రూపొందించిన టైలర్‌ట్రిక్స్ (Tailortrix) యాప్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ నగర్‌లో జరిగిన టైలర్‌ట్రిక్స్ యాప్ ప్రారంభోత్సవంలో అతిథులుగా చార్టెడ్ అకౌంటెంట్ శివ సుబ్రహ్మణ్యం, లైఫ్ కోచ్ రమా రావి, వియ్ హబ్ చైర్మన్ రమా దేవి, సోషల్ మీడియా ఇన్‌ప్లూయేన్సెర్ నాగశ్రీ, రెండు వందలకు పైగా బొటిక్ వ్యాపార నిర్వహకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 'టైలర్‌ట్రిక్స్' చైర్మన్ లావణ్య మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన యాప్ గురించి విశేషాలను బొటిక్ వ్యాపారం నిర్వహిస్తున్నవారికి, ఔత్సాహికులకు వివరించారు. ఈ యాప్‌లో దుస్తుల డిజైనింగ్‌ను, వాటి కటింగ్ లైనింగ్‌ను సులువుగా చేసుకోవచ్చు. అవసరమైతే కటింగ్, స్టిచింగ్ వంటి సేవలను కూడా ఈ యాప్ ద్వారా తాము అందిస్తామని తెలిపారు. ఫ్యాషన్ డిజైన్ ప్రక్రియలో ఖర్చు, సమయం తగ్గించుకునేందుకు, నాణ్యమైన సేవలు పొందేందుకు ఒకే ఒక్క పరిష్కారం తమ 'టైలర్‌ట్రిక్స్' యాప్ అందిస్తుందన్నారు. ముందుగా తాము 'టైలర్‌ట్రిక్స్ కోసం సాఫ్టువేర్‌ను డిజైనింగ్ చేసుకున్నామని, ఆ తర్వాత ఎంతోమంది బొటిక్ నిర్వహకులకు ఉపయోగపడాలనే ఆలోచనతో యాప్‌ను రూపొందించామని తెలిపారు. 'టైలర్‌ట్రిక్స్ - ఆన్ వీల్స్' అనే సర్వీసులో వెహికిల్ ద్వారా బొటిక్ నిర్వహుకుల ఇంటికే మెటీరియల్స్‌ను పంపిస్తామన్నారు.
ఆసక్తి ఉన్న గృహిణిలకు కూడా తాము సహకరిస్తామని, పెట్టుబడి లేకుండా చేసుకోవచ్చని, వారికి అవసరమైన లోన్ కూడా తాము అందిస్తామని తెలిపారు.
మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్ శివ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఈ కాన్సెప్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఎంతో మందికి ఉపయోగ పడుతుందన్నారు. అగ్రిగేటర్ సర్వీసులను అందించే ఎన్నో స్టార్టప్‌లు ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయని, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోనూ సేవలు అందించేందుకు ఏర్పాటైన ఈ 'టైలర్‌ట్రిక్స్' ఎన్నో స్టార్టప్‌లకు ఉపయోగకరమైన సమాధానాలు అందిస్తుందన్నారు.
లైఫ్ కోచ్ రమా రావి మాట్లాడుతూ... ఫ్యాషన్ పరిశ్రమలో 'టైలర్‌ట్రిక్స్' వంటి సేవలు ఎంతో మందికి ఉపయోగపడతాయన్నారు. ఈ సేవలను ఇప్పటికే బోటిక్ నడుపుతున్నవారు, కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకుంటున్న వారికి 'టైలర్‌ట్రిక్స్' సహకరించే సేవలు అందించడం అభినందనీయమన్నారు.
వియ్ హబ్ చైర్మన్ రమా దేవి మాట్లాడుతూ... మహిళలు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని, ఈ క్రమంలో బోటిక్ రంగంలో సహకారం అందిస్తున్న 'టైలర్‌ట్రిక్స్' సేవలు అందుకోవాలన్నారు.
సోషల్ మీడియా ఇన్‌ప్లూయేన్సెర్ నాగశ్రీ మాట్లాడుతూ... ఇటీవల ఫ్యాషన్ రంగం ఎంతో ప్రభావితం అవుతుందని, ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా పెరిగిపోతున్నాయని వాటిని అందిపుచ్చుకోవాలన్నారు. 'టైలర్‌ట్రిక్స్' సేవలు మహిళలకు ఎంతో సపోర్టు ఉంటుందన్నారు.
No comments