సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో వర్క్ చేయడం మా అదృష్టం. 'భవనమ్' అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న మంచి హారర్ కామెడీ ఎంటర్ టైనర్. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సప్తగిరి &టీం


అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలని అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలలో బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ 'భవనమ్'. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సప్తగిరి మాట్లాడుతూ... సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ 95 వ సినిమాగా ఇంతమంది కమెడియన్స్ ని పెట్టుకొని తొలిసారి వారి నిర్మాణంలో హారర్ కామెడీ సినిమా చేశారు చేశారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో పని చేయాలనే కోరిక ఈ సినిమాతో నెరవేరింది. మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు బాలాచారి కూరెళ్ల గారికి థాంక్ యు. ఆర్ బి చౌదరి గారు చాలా సపోర్ట్ చేశారు. చరణ్ అర్జున్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాతో గొప్ప విజయం మాకు, సంస్థకు, డైరెక్టర్ గారికి రావాలని కోరుకుంటున్నాను. ఆగస్ట్ 9న సినిమా వస్తోంది. ప్రేక్షకులందతా థియేటర్ లో సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేసి గొప్ప విజయాన్ని ఇవ్వాలని కోరుతున్నాను' అన్నారు.

హీరో షకలక శంకర్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. బాలాచారి కూరెళ్ల అద్భుతంగా తీశారు, ఇందులో కామెడీ యాక్షన్ సాంగ్స్ అన్నీ వున్నాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న హారర్ కామెడీ ఇది. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆగస్ట్ 9న సినిమా వస్తోంది. ప్రేక్షకులంతా తప్పకుండా చూసి సపోర్ట్ చేయాలి.

హీరోయిన్ మాళవిక సతీషన్ మాట్లాడుతూ.. ఇది హారర్ కామెడీ ఫ్యామిలీ డ్రామా వున్న మంచి ఎంటర్ టైనర్. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ. ఆగస్ట్ 9న కలుద్దాం' అన్నారు.  

డైరెక్టర్ బాలాచారి కూరెళ్ల మాట్లాడుతూ.. ఆర్ బి చౌదరి గారు నాకు ఫస్ట్ విద్యార్ధి అనే సినిమా ఇచ్చారు. ఇప్పుడు భవనమ్ సినిమా ఇచ్చారు. వారిని జీవితంలో మర్చిపోలేను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ. నటీనటులు, టెక్నిషియన్స్ చాలా అద్భుతంగా చేశారు. ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్ గారికి ధన్యవాదాలు. సినిమా చాలా బావుంటుంది. అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది' అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. ఆర్ బి చౌదరి గారికి , వాకాడ అప్పారావు గారికి ధన్యవాదాలు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో మ్యూజిక్ చేయడం చాలా ఆనందంగా వుంది. బాలచారి గారు అద్భుతమైన మ్యూజిక్ చేయించుకున్నారు. ఈ పాటలకు చాలా రెస్పాన్స్ వచ్చింది. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది' అన్నారు. సినిమా యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.      

తారాగణం: సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, తాగుబోతు రమేష్, బిత్తిరి సత్తి, అజయ్ , ప్రభాకర్ (బాహుబలి), గెటప్ శీను, మురళీ గౌడ్ , జీవన్ నాయుడు, శ్రవణ్ , నాగ మహేష్ , మాళవిక సతీషన్ , స్నేహ ఉల్లాల్ , స్నిగ్దా, మణిచందన, క్రాంతి, హాన్విక, హారిక

సమర్పణ: సూపర్ గుడ్ ఫిల్మ్స్ PVT LTD
నిర్మాతలు : ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి
రచన, దర్శకత్వం: బాలాచారి కూరెళ్ల
డిఓపి : మురళీమోహన్ రెడ్డి ఎస్
ఎడిటర్: ఎన్టీఆర్
ఆర్ట్: వరతై ఆంటోని
స్టంట్స్ : స్టార్ మల్లి
కొరియోగ్రఫీ: బాలకృష్ణ, శ్యామ్ కుమార్
ఆర్ఆర్: DSR
డైలాగ్స్: బాలాచారి కూరెళ్ల
పీఆర్వో: వంశీ- శేఖర్

No comments