‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేటర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడలా ఎంజాయ్ చేస్తున్నారు - నిర్మాత బన్నీ వాస్
నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా వచ్చిన చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాస్ మీడియాతో మాట్లాడుతూ ‘ఆయ్’ సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియజేశారు..
- అనీల్ రావిపూడిగారి డైరెక్షన్ టీమ్‌లో డైరెక్టర్ అంజిగారు చాలా సినిమాలకు వర్క్ చేశారు. మా కో ప్రొడ్యూసర్స్ రియాజ్, భాను ఈ స్క్రిప్ట్‌ను నా దగ్గరకు తీసుకొచ్చారు. అమలాపురం కుర్రాడు కథ వినాలని కో ప్రొడ్యూసర్స్ చెప్పారు. వాళ్లేమో నాకు మంచి మిత్రులు కావటంతో సరే విందామని కూర్చున్నాను. రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా నవ్వాను. కూకట్ పల్లిలో విశ్వనాథ్‌లో సినిమా రిలీజ్ తర్వాత ఆడియెన్స్‌తో కలిసి చూస్తున్నప్పుడు నా ఎదురు సీట్‌లో ఉన్న వ్యక్తి నవ్వలేక లేచి నిలుచున్నాడు. అప్పుడర్థమైంది. నేను కథ విన్నప్పుడు నేను ఏదైతే ఫీలయ్యానో అది నిజమైందనిపించింది. నేను కథ విన్నప్పుడు ఎలాగైతే ఎంజాయ్ చేశానో దాన్ని స్క్రీన్ పై చూసి ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే గట్టిగా కొట్టేశామనిపించింది. ఫస్టాఫ్ చివరి అర్థగంట థియేటర్స్‌లో ఒకటే నవ్వులు.
- సినిమాలో పాత్రలనంతా డిజైన్ చేసింది అంజిగారే. తనది అమలాపురం దగ్గరలోని చిన్న పల్లెటూరు. అందువల్ల అక్కడి పాత్రలను సహజంగా ఉండేలా రాసుకున్నారు. నేను కూడా అదే ప్రాంతంలో పుట్టి పెరగటం వల్ల ఆయన చెప్పగానే కనెక్ట్ అయ్యాను. సాధారణంగా మనం సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు మలయాళం వాళ్లు చాలా నేచురల్‌గా చేస్తారని అంటుంటాం. అలాంటి సినిమా మనం ఎందుకు చేయకూడదనుకున్నాను. అందుకనే అంజి ఈ కథను ఫిబ్రవరిలో చెబితే ఎండాకాలంలో షూట్ చేస్తే ఎండ ఎక్కువగా ఉంటుందని, వర్షాలు పడే వరకు.. ఆగాను. ఆగస్ట్‌లో షూటింగ్ స్టార్ట్ చేశాం. సినిమాలో ఎండ ఉంటే అది సినిమాకు కరెక్ట్ కాదని షూటింగ్‌ను ఆపేసిన రోజులు కూడా ఉన్నాయి. చాలా ఎఫర్ట్ పెట్టి చేశాం.
- సినిమా పక్కా ఎంటర్‌టైనర్. కథ కన్నా ఎంటర్‌టైన్మెంట్, గుడ్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఈరోజున్న ట్రెండ్‌కి అవి మాత్రమే సరిపోవు. అమలాపురం వంటి ఏరియాలో సినిమాను చేసేటప్పుడు చిన్న క్లాస్ టచ్ ఉండాలని అందరం అనుకున్నాం. అందుకోసం వర్షం ఉంటే బావుంటుందని నిర్ణయించుకున్నాం. దాన్ని ఒక సబ్జెక్ట్‌గా యాడ్ చేసుకుంటూ వచ్చాం. దీని షూటింగ్‌కు కాస్త ఎక్కువ రోజులు పట్టింది. మబ్బులో షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉంటే షూటింగ్‌ను వాయిదా వేసుకుంటూ వచ్చాం.
- వినోద్ కుమార్‌గారు పాత్రకు ముందుగా చాలా మందిని అనుకున్నాం. అయితే ఎవరినీ తీసుకున్నా ఓ ఎక్స్‌పెక్టేషన్ వస్తుంది. కొత్తవాళ్లను తీసుకొస్తే చివరలో కనెక్ట్ కాదు. క్యారెక్టర్ కనెక్ట్ కావాలి.. ఎవరూ ఊహించకూడదు కాబట్టే వినోద్ కుమార్‌గారైతే బావుంటుందనిపించి ఓకే చేశాం.
- ఇప్పటి కథ కాదు కరోనా టైమ్ కంటే ముందే నేను కథలను ఎంపిక చేసుకున్నామనే కారణంతో సినిమాలను కంప్లీట్ చేసేశాం. కానీ అవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేదు. ఆయ్ సినిమా మాత్రం ఆఫ్టర్ కరోనా మూవీ, తప్పకుండా చూడండని చెప్పాను. సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే పాత మెమొరీస్ అన్నీ గుర్తుకు వచ్చాయి. అందుకనే రిలీజ్ తర్వాత కాస్త ఎమోషనల్ కూడా అయ్యాను.
- ఆయ్ సినిమా వంటి ఎంటర్‌టైనర్‌ను చేసినప్పుడు మామూలుగా యూత్‌కు కనెక్ట్ అవుతుంది. ఓ జోనర్ ఆడియెన్స్‌కే కనెక్ట్ అయితే వారమో, రెండు వారాలో ఆడుతుంది. అదే అందరికీ కనెక్ట్ అయ్యేలా గట్టిగా కొట్టాలంటే ఇంకేదో ఉండాలండి అని నేను డైరెక్టర్‌గారికి చెప్పాను. దాంతో ఆయన ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ నుంచి ఆ సన్నివేశాలను ఎమోషనల్‌గా మార్చుకున్నారు. దీంతో సినిమా అందరికీ కనెక్ట్ అయ్యింది. రెండేళ్ల ముందు రాసుకున్న కథ ఇది. సినిమాను సినిమాగానే చూడాలి.
- నాకు కమిటీ కుర్రోళ్ళు కథ తెలియదు. అలాగే నిహారికకు మా సినిమా కథ తెలియదు. రెండు సినిమాల దర్శకులు గోదావరి బ్యాక్ డ్రాప్‌లోనే సినిమాలను చిత్రీకరించారు. యాదృచ్చికంగానే జరిగిన విషయాలవి. రెండు సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు.
- నార్నే నితిన్ పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో. ఈ సినిమా చేయటానికి ముందు మ్యాడ్ రిలీజ్ కాలేదు. హీరోగా తను చేస్తున్నారంటే వాళ్లకు కమర్షియల్‌గా కొన్ని ఆలోచనలుంటాయని అనుకున్నాను. కానీ తనకు ఏ సినిమా వర్కవుట్ అవుతుందనే విషయం బాగా తెలుసు. గ్రౌండెడ్ పర్సన్. జడ్జ్‌మెంట్ బావుంది.
- ఆయ్ సినిమా షోస్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మేం కూడా పెంచుతున్నాం. డిస్కషన్స్ జరుగుతున్నాయి.
- నా లైఫ్‌లో గ్రేట్ రిలేషన్స్ ఉన్నాయంటే ఫ్రెండ్ షిప్. నేను ఈ స్టేజ్‌లో ఉన్నానంటే నా స్నేహితులే కారణం. బన్నీగారనే కాదు. చాలా మంది స్నేహితులు ఎస్.కె.ఎన్, మారుతి వంటి వారున్నారు. అలాంటి నాకు ఫ్రెండ్ షిప్ కథ వచ్చిప్పుడు నేను కనెక్ట్ కాకుండా ఎందుకుంటాను.
- చిన్న సినిమా తీసి పెద్ద సక్సెస్ కొట్టినప్పుడు ఆ కిక్ వేరే ఉంటుంది.
- కథ, జోనర్‌ను బట్టి సినిమా చేయాలి.. సినిమా పెద్దదైనా, చిన్నదైనా రెంటింటికి పడే కష్టమొకటే.
- తండేల్ సినిమా షూటింగ్ జరుగుతుంది. డిసెంబర్‌లో రిలీజ్ అనుకున్నాం. అయితే అదే నెలలో పుష్ప 2 వస్తుంది. గేమ్ చేంజర్ రిలీజ్‌ను కూడా అనుకుంటున్నారు. తండేల్ సినిమాకు సంబంధించి సీజీ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంది. అవన్నీ చూసుకునే దసరా తర్వాతే తండేల్ రిలీజ్ డేట్ మీద క్లారిటీ వస్తుందనుకుంటున్నాను.
No comments