పిఠాపురంలో ప్రముఖ నిర్మాణ సంస్థ GA2 పిక్చర్స్, బన్నీవాస్, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్, అంజి కె.మణిపుత్ర కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ ట్రైలర్ విడుదల


ప్రెస్టీజియ‌స్ బ్యాన‌ర్ GA2 పిక్చర్స్. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తోన్న ఫన్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆయ్’. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 15న ‘ఆయ్’ చిత్రం విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను ప‌వ‌ర్‌ఫుల్ లొకేష‌న్ పిఠాపురంలో విడుద‌ల చేశారు. 

డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ‘ఆయ్’ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. సోష‌ల్ మీడియాలో రీల్స్‌, షార్ట్స్ రూపంలో తెగ వైర‌ల్ అయ్యాయి. దీంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేలా మేక‌ర్స్ పిఠాపురంలో ట్రైలర్‌ను విడుద‌ల చేస్తున్నారు. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ముగ్గురు స్నేహితుల మ‌ధ్య న‌డిచే క‌థతో ఆయ్ చిత్రం తెర‌కెక్కిందని అర్థ‌మ‌వుతుంది. 

కార్తీక్ (నార్నే నితిన్‌), రాజ్‌కుమార్ (కసి రెడ్డి), హ‌రి (అంకిత్ కొయ్య‌).. అనే ముగ్గురు స్నేహితులు మ‌ధ్య ఫ‌న్నీ ఇన్సిడెంట్‌తో ట్రైల‌ర్ మొద‌లైంది. వీరు ముగ్గురు బేవ‌ర్స్ గ్యాంగ్ పేరుతో పిచ్చి పిచ్చి ప‌నులు చేస్తున్న‌ట్లు ట్రైల‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు స‌ర‌దాగా సాగే స‌న్నివేశాల‌తో బ‌ల‌మైన స్నేహాన్ని ఇందులో ఎలివేట్ చేశారు. ఆద్యంతం ఈ ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉంది. అంద‌రూ మ‌న‌స్ఫూర్తిగా న‌వ్వుకునేలా సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. 

అలాగే కార్తీక్‌, ఫంక్ ప‌ల్ల‌వి (న‌య‌న్ సారిక‌)తో ప్రేమ‌లో ప‌డ‌తారు. ప‌ల్ల‌వి ప్ర‌వ‌ర్త‌న కార్తీక్ అత‌ని స్నేహితుల‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆ స‌న్నివేశాల‌ను, హీరో హీరోయిన్‌ మ‌ధ్య చ‌క్క‌టి కెమిస్ట్రీని మ‌నం చూడొచ్చు. అలాగే సినిమాలోని ఓ ట్విస్ట్‌ను కూడా చెప్పే ప్ర‌యత్నం చేశారు. ప‌ల్ల‌వితో కార్తీక్ ప్రేమ‌లో ప‌డిన త‌ర్వాత ముగ్గురి స్నేహితులు జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిరుగుతాయి?. ప్రేమ కోసం కార్తీక్ ఏం చేస్తాడు? అనే విష‌యాలు తెలియాలంటే ఆగ‌స్ట్ 15 వ‌ర‌కు ఆగాల్సిందే. 

మొత్తంగా ట్రైల‌ర్ క‌థ‌లోని కామెడీతో పాటు ఎమోష‌నల్ కంటెంట్‌ను కూడా రివీల్ చేసింది. చ‌క్క‌టి డైలాగ్స్‌, స‌న్నివేశాల‌తో అంద‌రూ క‌లిసి న‌వ్వుకునేలా సినిమా ఉంటుంద‌ని స్నేహం, ప్రేమ‌, కుటుంబంలో ఉండే అనుబంధాల‌ను ట్రైల‌ర్‌లో చూపించారు. సినిమా ఎలా ఉంటుంద‌నే విష‌యాన్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు . ఆగ‌స్ట్ 15న ఈ ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఆక‌ట్టుకోనుంది. 

నార్నే నితిన్‌, అంకిత్ కొయ్య‌, రాజ్ కుమార్ క‌సిరెడ్డి త‌మ‌దైన కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నారు. ఈ చిత్రంతో దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న అంజి కె.మ‌ణిపుత్ర సినిమాను మ‌న‌స్ఫూర్తిగా న‌వ్వుకునే ఎంట‌ర్‌టైన‌ర్‌గా మ‌లుస్తూనే చ‌క్క‌టి ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కించారు. అజ‌య్ అర‌సాడ బ్యాగ్రౌండ్ స్కోర్, స‌మీర్ క‌ళ్యాణ్ గోదావ‌రి అందాల‌ను పిక్చ‌రైజేష‌న్ చేసిన తీరు ఆక‌ట్టుకుంటున్నాయి. కోదాటి ప‌వ‌న్ ఈ చిత్రానికి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. 

గోదావ‌రి బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కిన ఆయ్ చిత్రంతో నార్నే నితిన్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న ఈ మూవీ పెయిడ్ ప్రీమియ‌ర్స్ మేక‌ర్స్ ప్లాన్ చేశారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.  

GA2 పిక్చర్స్:

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి.
 
నటీనటులు:  

నార్నే నితిన్, నయన్ సారిక, అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు
 
సాంకేతిక వర్గం:

బ్యానర్ - GA2 పిక్చర్స్, సమర్పణ - అల్లు అరవింద్, నిర్మాతలు - బన్నీ వాస్, విద్యా కొప్పినీడి, డైరెక్టర్ - అంజి కె.మ‌ణిపుత్ర‌, సహ నిర్మాతలు - భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, సినిమాటోగ్రఫీ - సమీర్ కళ్యాణి, సంగీతం - రామ్ మిర్యాల, ఎడిటర్ - కోదాటి పవన్ కళ్యాణ్, ఆర్ట్ డైరెక్టర్ - కిరణ్ కుమార్ మన్నె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అజయ్ గద్దె, కాస్ట్యూమ్స్ - సుష్మిత, శిల్ప, కో డైరెక్టర్ - రామ నరేష్ నున్న, పి.ఆర్.ఒ - వంశీ కాకా, మార్కెటింగ్ - విష్ణు తేజ్ పుట్ట, పోస్టర్స్ - అనిల్, భాను.

No comments