బ్లాక్‌బస్టర్ 'మగధీర'తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో ఆకట్టుకున్న దేవ్ గిల్ ప్రస్తుతం 'అహో! విక్రమార్క' అంటూ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నారు. రాజమౌళి వద్ద కో డైరెక్టర్‌గా పని చేసిన పేట త్రికోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దేవ్ గిల్ ప్రొడక్షన్స్ మీద నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రదర్శకుడు త్రికోటి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..
- నేను మగధీరకు కో డైరెక్టర్‌గా పని చేశాను. ఆ టైంలోనే దేవ్ గిల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ టైంలో నేనే అతనికి డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించేవాడ్ని. అప్పటి నుంచి మా మధ్య మంచి బంధం ఉంది. హీరోగా ఓ సినిమా చేయాలని దేవ్ గిల్ ఎప్పుడూ అంటూ ఉండేవాడు. కానీ నేను అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఆర్ఆర్ఆర్ కోసం పని చేస్తున్న టైంలో దేవ్ గిల్ సినిమా ప్రపోజల్ తీసుకొచ్చాడు. పూణెలో ఓ ఆఫీస్ కూడా ఓపెన్ చేసేశాడు.
- దేవ్ గిల్‌కు విలన్ ఇమేజ్ ఉంది. అలాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తిని హీరోగా తెరపైకి తీసుకు రావాలంటే ఎలాంటి జానర్ చేయాలని చాలా అనుకున్నాం. ఫ్యామిలీ, ఎమోషన్ ఇలా ఏది చేసినా అంత కుదరదని అనుకున్నాం. చివరకు ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రతో కథను నడిపిస్తే బాగుంటుందని ఈ కథను అనుకున్నాం. విజయేంద్ర ప్రసాద్ వద్ద పని చేసిన వర్మ ఈ కథను అద్భుతంగా రాశారు. దేవ్ గిల్ తన ఇన్ పుట్స్ కూడా ఇస్తుండేవాడు.
- ఇందులోని పోలీస్ ఆఫీసర్ ఆంధ్రా నుంచి పుణెకు ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అలా ఈ కథను అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. హిందీ, మరాఠీ, తెలుగు ఇలా అన్ని భాషల ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది.
- ఇందులో హీరోయిన్‌కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. లెక్చరర్ పాత్రలో హీరోయిన్ కనిపిస్తారు. ఓ తెలుగమ్మాయి అయితే బాగుంటుందని చిత్రా శుక్లాని తీసుకున్నాం. ఆమె చక్కగా నటించారు.
- ఈ కథ కమర్షియల్‌గా దేవ్ గిల్‌కు ఎలా సెట్ అవుద్దో అలా మలిచాను. నేను చేసిన దిక్కులు చూడకు రామయ్య బాగా ఆడింది. జువ్వా అంతగా ఆకట్టుకోలేదు. ఇది నాకు మూడో సినిమా. దీంతో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
- ఈ సినిమాకు మ్యూజిక్ కోసం ముందుగా చాలా మందిని అనుకున్నాను. బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి ఇలా అనుకున్నాం. ఒక దశలో కీరవాణి గారిని అడగాలా? వద్దా? అని అనుకున్నాను. కానీ దేవ్ గిల్ తనకున్న పరిచయంతో రవి బస్రూర్‌ను తీసుకొచ్చారు. ఆయన ఈ కథ విని, సినిమా చూసి మంచి కమర్షియల్‌గా ఉందని అన్నారు. కానీ టైం కావాలని అన్నారు. ఆయన అద్భుతమైన మ్యూజిక్, ఆర్ఆర్ ఇచ్చారు.
- ఓ విలన్ హీరోగా మారితే ఎలా ఉంటుంది అనేది కథ. ఇందులో కాస్త మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా వచ్చాయి. రియల్ సతీష్ గారు ఫైట్స్ బాగా కంపోజ్ చేశారు. మంచి అవుట్ పుట్ ఇచ్చారు.
'అహో! విక్రమార్క' అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.. దర్శకుడు పేట త్రికోటి
Reviewed by firstshowz
on
2:18 pm
Rating: 5
No comments