తిరుపతిలో హరనాథ్ పొలిచెర్ల ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు
హరనాథ్ పోలిచెర్ల ... వైద్యరంగంలో పరిచయం అవసరం లేని పేరు, సినిమారంగానికి సుపరిచితమైన పేరు టీనేజ్ ఆత్మహత్యల మీద తీసిన “హోప్” చిత్రాని కి భారత రాష్ట్రపతి అవార్డు,చంద్రహాస్ చిత్రానికీ జాతీయ సమైక్యత బంగారు నంది అవార్డు మరియు సరోజినీ దేవి అవార్డు కైవసం చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్. చిత్రసీమలో నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా, నటుటుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు హరనాథ్ పోలిచెర్ల ప్రణాలికతో ఆధ్వర్యంలో మూడురోజుల పాటు తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ లో చరిత్రలో నిలిచిపోయేవిధంగా ఆగష్టు 2,3,4 తారీఖుల్లో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఆగష్టు 2 వ తారీఖున యూనిక్ svmc meet 73/74 బ్యాచ్ ర్యాలీ , వేదపండితుల ఆశీర్వచనాలతో ప్రారంభమై బాణాసంచా, పూల వర్షాలతో ముందుకు సాగింది. ఓల్డ్ స్టూడెంట్స్ అస్సోసియేన్ నిర్మించిన బిల్డింగ్ లో అందరూ కొంతసేపు పర్యటించారు. ఈ భవనానికి దర్శక నిర్మాత, సినీ హీరో హరనాథ్ పోలిచెర్ల 25 వేల డాల్లర్లు విరాళంగా ఇచ్చిన విషయాన్నీ అందరూ కొనియాడారు. సరిగమప రన్నర్ అప్ ఆది లైవ్ సాంగ్స్ పాడి అలరించారు.
సినిమా డాన్సర్స్ తో నాన్ స్టాప్ డాన్స్ షో నిర్వహించారు. డాక్టర్ హరనాథ్ పోలిచెర్ల "డిజిటల్ మూవింగ్" సాంకేతికతని ఉపయోగించి మొదటి సారి సినిమాని తలపించే విధంగా శ్రీ కృష్ణ ఏకపాత్రాభినయం చేసారు. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్ధులందరూ కలిసి డాక్టర్ హరనాథ్ పోలిచెర్లని , డాక్టర్ రవీంద్రనాథ్ ని జీవిత సాఫల్యపురస్కారంతో సత్కరించారు. చివరి రోజు డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల ఆధ్వర్యంలో "లివింగ్ హ్యాపీ హెల్తీ" అని సెమినార్ నిర్వహించారు. ఇందులో డాక్టర్ రవీంద్రనాధ్ తదితరులు పాల్గొని తమ స్నేహితులకి సలహాలు అందించారు.
శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ లో గోల్డెన్ జూబ్లీ గ్రాండ్ గా చేసుకున్న బ్యాచ్ గా రికార్డ్ సృష్టించారు. ముగింపు సందర్భంగా వారికీ సహకరించిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అధికారులకు తమ కృతజ్ఞతలు తెలియజేసారు డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ హరనాథ్ పోలిచెర్ల , డాక్టర్ శ్రీనివాసులు ...
No comments