లారీ - చాప్టర్ 1: రివ్యూ & రేటింగ్


▪️ చిత్రం: లారీ - చాప్టర్ 1  
▪️ విడుద‌ల‌: ఆగ‌స్టు 2, 2024
▪️ ద‌ర్శ‌క‌త్వం, నిర్మాత, హీరో, సంగీత దర్శకుడు, ఎడిటర్, స్టంట్ మాస్టర్: శ్రీకాంత్ రెడ్డి ఆసం  
▪️ హీరోయిన్: చంద్రశిఖ శ్రీవాస్  
▪️ ప్రధాన పాత్ర: రాకీ సింగ్  
▪️ కెమెరా: తాడిపత్రి నాగార్జున  
▪️ బ్యానర్: కింగ్ మేకర్ పిక్చర్స్  
▪️ నిర్మాత‌: అసం వెంకట లక్ష్మి  

సోషల్ మీడియా స్టార్ శ్రీకాంత్ రెడ్డి ఆసం @SreekanthReddy_Asam హీరోగా నటిస్తూ కథ, స్టంట్స్, సంగీతం, దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘లారి చాప్టర్-1’ @lorrychapter-1Movie. చెన్నై లొయోల కాలేజీ‌లో డైరెక్షన్ కోర్స్ చేసి హైదరాబాద్ వచ్చి పలు చిత్రాల్లో వివిధ శాఖలలో పని చేసి ప్రావీణ్యం సంపాదించిన తర్వాత యూట్యూబ్‌లో తన వీడియోలతో మంచి పాపులారిటీ సంపాదించిన శ్రీకాంత్ రెడ్డి.. ఇప్పుడు ‘లారి చాప్టర్-1’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చంద్రశిఖ @Chandrashikha , రాఖీ సింగ్ (Rakhi Singh) ప్రధాన పాత్రలో నటించారు.

తాజాగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాళీ భాషల్లో విడుదలైంది. యూట్యూబ్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ రెడ్డి తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించగలిగాడా? ఇవాల్టీ రివ్యూలో తెలుసుకుందాం

కథ:

చిత్తూరు జిల్లాలోని రంగపట్నంలో వీధి రౌడీ హర్షవర్ధన్ ఆలియ‌స్ హంట‌ర్ (శ్రీకాంత్ రెడ్డి ఆసం) తన కుటుంబాన్ని పోషించడానికి చిన్న చిన్న గొడవల్లో పడిపోతూ ఉంటాడు. ఈ క్ర‌మంలో ఓ గొడవలో జైలుకి వెళ్లి తిరిగి వచ్చి ఒక అమ్మాయితో ప్రేమలో పడుతాడు. గొడ‌వలు మానేసి మెకానిక్ షాప్ పెట్టి పని చేస్తూ ఉంటాడు. ఇదే క్ర‌మంలో మైనింగ్ అధిపతి ప్రతాప్ ముఖ్యమంత్రి అవ్వాలని, దానికి కావాల్సిన డబ్బు కోసం ఇల్లీగల్ మైనింగ్ దంత చేస్తూ ఉంటాడు. తాను మైనింగ్ లో కనుగొన్న యురేనియంని ముంబైకి సంబంధించిన ఒక పెద్ద విలన్ కి అమ్మటం కోసం 3000 కోట్ల యురేనియం సరుకును డెలివరీ చేయటం కోసం ప్రతాప్ హంట‌ర్‌ని క‌లుస్తాడు. హీరో తన చెల్లి పెళ్ళికి చేయ‌డానికి డ‌బ్బులు అవ‌స‌ర‌మ‌వ్వ‌డంతో డ‌బ్బుల కోసం లారీని డెలివరీ చేస్తాన‌ని వెళ‌తాడు. లారీని డ్రైవింగ్ చేస్తూ డెలివరీ చేసే క్ర‌మంలో వేర్వేరు రాష్ట్రాల విలన్స్ లారీ డెలివరీని ఎలా ఆపారు? చివరికి డెలివర్ చేశాడా? లేదా?విలన్స్ అందరు రాష్ట్రాలకి సంబందించి ఎందుకు హీరో వెంట పడ్డారు? అనేది తెలుసుకోవాలంటే లారి చాప్టర్ - 1 సినిమాని థియేట‌ర్‌ల‌లో చూడాల్సిందే.

న‌టీన‌టుల ప్ర‌తిభ‌:

ఈ సినిమాకు త‌న ప్ర‌తిభ‌ను, త‌న క‌ష్టాన్ని న‌మ్ముకుని హర్షవర్ధన్ ఆలియ‌స్ హంట‌ర్ పాత్ర‌లో న‌టించిన శ్రీకాంత్ రెడ్డి ఆసం ఆక్సిజ‌న్ అని చెప్పొచ్చు. యూట్యూబ్ స్టార్‌గా తన అనుభవంతో ఈ సినిమాను మ‌న ముందు ప‌ర్‌ఫెక్టుగా నిల‌బెట్ట‌డంలో విజ‌యం సాధించాడ‌నే చెప్పాలి. న‌టించ‌డంతో పాటు సినిమా నిర్మాణం చేయడంలో అనుభవం చూపించారు. దర్శకత్వం, నటన, సంగీతం, ఎడిటింగ్, స్టంట్‌లన్నీ తనే నిర్వహించి మ‌ల్టీటాలెంట్ చూపించాడు. హీరోగానూ శ్రీకాంత్ రెడ్డి న‌ట‌న‌, డైలాగ్స్ బాగున్నాయి, ఫైట్స్ ఇర‌గ‌దీశాడు. యాక్ష‌న్ సీన్ల‌లో అద‌ర‌గొట్టాడు. తొలి సినిమాతో త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకుని టాలీవుడ్‌కు బెస్ట్ హీరో దొరికాడ‌ని నిరూపించుకున్నాడు. హీరోయిన్ చంద్రశిఖ క్యూట్‌గా క‌నిపించింది. ల‌వ్ ఆండ్ రొమాన్స్ సీన్ల‌లో యూత్‌ను ఎట్రాక్ట్ చేసింది. ఇక‌ రాకీ సింగ్, చంద్రశిఖ శ్రీవాస్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. 

విశేషాలు:

మల్టీ టాలెంటెడ్ స్టార్: శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం, నిర్మాణం, నటన, సంగీతం, ఎడిటింగ్, స్టంట్స్ అన్నీ తానే చేయడం ఈ చిత్రం ప్రత్యేకత.

యాక్షన్ ఎంటర్టైనర్: చిత్రం ప్రధానంగా యాక్షన్ ఎంటర్టైనర్. శ్రీకాంత్ రెడ్డి చేసిన స్టంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

తొలి సినిమాకు మంచి ప్రతిస్పందన: తన తొలి సినిమాతోనే శ్రీకాంత్ రెడ్డి హిట్ టాక్ అందుకున్నాడు. 
భాష‌లు: తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, బెంగాళీ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది.

సాంకేతిక విభాగం:

సినిమాటోగ్ర‌ఫీ అందించిన‌ తాడిపత్రి నాగార్జున ప‌నితీరు బాగుంది. మ్యూజిక్ ట్రాక్ సినిమాను మ‌రో మెట్టు ఎక్కించింది, లిరికల్ వీడియోస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ వర్క్ బాగుంది. 3 గంట‌ల ర‌న్ అవ‌ర్ ఉన్నా కూడా టెంపో కొన‌సాగింపు ప్ర‌తి సెక‌న్ మ‌జా వ‌చ్చేలా ఉంది. టెంప్లేట్ పాతగా అనిపించినా, కథలో కొత్తదనం ఉంది. ద‌ర్శ‌క‌త్వం కొత్తగా క‌నిపిస్తుంది. స్క్రీన్‌ప్లే కూడా స‌రికొత్త‌గా ఉంది. 

విశ్లేష‌ణ‌:

సోష‌ల్ మీడియాలో కోట్లాది మంది ఫాలోవ‌ర్స్ సొంతం చేసుకున్న యూట్యూబ‌ర్ శ్రీకాంత్ రెడ్డికి ఇది తొలి సినిమా అయిన‌ప్ప‌టికీ ప్ర‌తి పార్టులో ఎంతో ప‌రిణ‌తి, అనుభ‌వం చూపించాడు. 'లారీ - చాప్టర్ 1' యాక్షన్, డ్రామా, సస్పెన్స్‌తో నిండి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ల‌వ్ ఆండ్ రొమాన్స్ సీన్లు యూత్‌ను తెగ ఆక‌ట్టుకుంటాయి. ఇక తండ్రి-కొడుకు సెంటిమెంట్, అన్నా-చెల్లి సెంటిమెంట్ సీన్లు ఈ సినిమాలో బాగా పండాయి. శ్రీకాంత్ రెడ్డి ఆసం ఒక యూట్యూబర్ నుండి సినిమా రంగానికి తన ప్రయాణం ఈ త‌రం వాళ్ల‌కి స్ఫూర్తిదాయకం. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభవం కలిగిస్తుంది. థియేట‌ర్‌కు వెళ్లి చూడాల్సిన సినిమా ఇది.  

ప్రేక్షకుల స్పందన

ప్రేక్షకులు కూడా ఈ చిత్రంపై సానుకూలంగా స్పందిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి కష్టాన్ని, ప్ర‌తిభ‌ను అభినందిస్తున్నారు. యూట్యూబ్ నుండి సినిమా రంగానికి వచ్చిన తన ఇష్టమైన స్టార్‌ను తెరపై చూడటం ఆనందంగా ఉందని కొందరు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

రేటింగ్: 3.75 / 5

No comments