హాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీ అయిన అచ్చ తెలుగు అమ్మాయి అవంతిక వందనపు


అవంతిక వందనపు ఈ సంవత్సరం హాలీవుడ్‌లో "మీన్ గర్ల్స్ " అనే సినిమాతో సంచలన విజయం అందుకున్న మన తెలుగు అమ్మాయి. వరుసగా హాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 

అందులో ఒక చిత్రం "టారట్", ఈ సంవత్సరంలో థియేటర్‌లో విడుదల అయింది. అయితే, క్రిటిక్స్ పరంగా మంచి సినిమా అని పేరు తెచ్చుకుని, జూలై 4న నెట్టఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. హారర్ కథాంశంతో సాగుతున్న ఈ కథలో అవంతిక మంచి పరిణతి చూపించి చాలా బాగా నటించింది. 

సినిమా నుంచి సినిమా కి ఒక కొత్త కథనం తో ఆడియన్స్ ను ఆకర్షిస్తుంది. జూలై 4న విడుదలైన ఈ సినిమాకి ఓటీటీ లో మంచి రెస్పాన్స్ వచ్చింది మన అవంతికకు. ప్రొఫెషన్ పరంగా ఇంకొక హాలీవుడ్ సినిమా షూట్‌లో బిజీగా ఉందని సమాచారం. ఆ చిత్రం తదుపరి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. తెలుగు లో ఎంట్రీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

No comments