“పాగల్ వర్సెస్ కాదల్” రివ్యూ & రేటింగ్


చిత్రం: పాగల్ వర్సెస్ కాదల్
విడుదల తేది: 9-8-2024
నటీనటులు: విజయ్ శంకర్, విషిక, బ్రహ్మాజి, షకలక శంకర్, ప్రశాంత్ కూఛిబొట్ల, అనూహ్య సారిపల్లి, ఆద్విక్ బండారు, తదితరులు
టెక్నికల్ టీమ్: ఎడిటింగ్,
డీఐ: శ్యామ్ కుమార్.పి.,
సినిమాటోగ్రఫీ: నవధీర్,
మ్యూజిక్: ప్రవీణ్ సంగడాల,
బ్యానర్: శివత్రి ఫిలింస్,
నిర్మాత: పడ్డాన మన్మథరావు,
రచన, దర్శకత్వం: రాజేశ్ ముదునూరి

థియేటర్లోకి మరో యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది. “దేవరకొండలో విజయ్ ప్రేమకథ”, “ఫోకస్” వంటి సినిమాలతో ఆడియన్స్కు పరిచయమైన యంగ్ హీరో విజయ్ శంకర్ హీరోగా నటించిన “పాగల్ వర్సెస్ కాదల్” శుక్రవారం (ఆగస్టు 9న) విడుదలైంది. విజయ్ శంకర్కు జంటగా విషిక నటించింది. శివత్రి ఫిలింస్ బ్యానర్పై పడ్డాన మన్మథరావు నిర్మించిన ఈ చిత్రాన్ని రాజేశ్ ముదునూరి దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “పాగల్ వర్సెస్ కాదల్” ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ: 

ఓ వ్యక్తి తాగి న్యూసెన్స్ చేస్తున్నాడనే కంప్లైంట్ రావడంతో పోలీస్ కానిస్టేబుల్ రామ్ ప్రసాద్ (షకలక శంకర్), ఎస్ఐ (బ్రహ్మాజీ) అక్కడికి వెళ్తారు. ఆ తాగిన వ్యక్తి బాధతో తాగుతున్నాను అని అతని ఫ్రెండ్ స్టోరీ చెప్తాడు. సివిల్ ఇంజినీర్ గా పనిచేసే కార్తీక్ (విజయ్ శంకర్) ప్రియ (విషిక) అనే అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు. కానీ ప్రియ శాడిస్ట్ గా బిహేవ్ చేస్తుంటుంది. ప్రియ చేసే పనులన్నీ భరిస్తుంటాడు కార్తీక్. ప్రియ బ్రదర్ మనోజ్ ఒక సైకియాట్రిస్ట్. అతన్ని కార్తీక్ సోదరి అమృత(అనూహ్య) లవ్ చేసినా మనోజ్ యాక్సెప్ట్ చేయడు. అతడు కూడా సైకోగా బిహేవ్ చేస్తాడు. మరి సైకో మైండ్ సెట్స్ ఉన్న మనోజ్, ప్రియలతో ఇన్నోసెంట్ కార్తీక్, అతని సోదరి అమృత ఎలా కలిశారు అన్నది తెరపై చూడాల్సిందే.

నటీనటుల ప్రతిభ: 

ఈ సినిమాలో అంతా కొత్తవాళ్లే నటించిన మంచి అనుభవం ఉన్న నటుల్లా తమ పాత్రలకు శక్తి మేరకు న్యాయం చేసారు. అమాయకమైన అబ్బాయి పాత్రలో ప్రియురాలు ఎన్ని బాధలు పెట్టినా.. భరించే పాత్రలో ఆకట్టుకునేలా నటించాడు విజయ్ శంకర్. ఇతనికి నటుడిగా మంచి భవిష్యత్తు ఉంది. ఇక ప్రియ పాత్రలో నటించిన విషికా నిజంగానే సైకో అనే రీతిలో తన పాత్రలో ఒదిగిపోయింది. శాడిస్ట్ సైక్రియాటిస్ట్ మనోజ్ పాత్రలో ప్రశాంత్ ఒదిగిపోయాడు. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

సాంకేతిక నిపుణులు: 

టెక్నికల్గా ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్. ప్రవీణ్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలైట్. బీజీఎం కూడా అదిరిపోయింది. డైరెక్టర్ రాజేశ్ ముదునూరి అన్ని టెక్నికల్ విభాగాలను సమర్థంవంతంగా ఉపయోగించుకున్నాడు. సినిమా క్వాలిటీ కోసం నిర్మాతలు ఎక్కడ తగ్గలేదని అర్థమవుతుంది. సబ్జెక్టు సరిగ్గా అర్థమయ్యేందుకు నవధీర్ అందించిన సినిమాటోగ్రఫీ బాగా హెల్పియింది. శ్యామ్ కుమార్ ఎడిటింగ్, ప్రవీణ్ సంగడాల మ్యూజిక్ ఆకర్షణ అవుతాయి. కథకు తగినట్లు శివత్రీ ఫిలింస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఆకట్టుకుంటాయి.

విశ్లేషణ: 

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కి ఈ తరం ప్రేక్షకులకు బాగా కనెక్టు అవుతుందని చెప్పవచ్చు. “పాగల్ వర్సెస్ కాదల్” సినిమాలో బ్రహ్మాజీ, షకలక శంకర్ క్యారెక్టర్స్ కీలకం. కథను వాళ్లిద్దరు నెరేట్ చేస్తుంటారు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్రహ్మాజీ, షకలక శంకర్ పాత్రలు మూవీలో కొనసాగుతాయి. ప్రేమ కథల్లో సరికొత్త కోణం ఈ చిత్రం. ఈ తరం ప్రేమికులకు కొత్తగా అనిపించేలా తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రేమకు నమ్మకం ఉండాలి కానీ అనుమానం కాదు అది ఉంటే జీవితం నరకమే అనే పాయింట్ యంగ్ ఆడియన్స్కు బాగా ఎక్కుతుందని చెప్పొచ్చు. ఈ తరం ప్రేమికులంతా “పాగల్ వర్సెస్ కాదల్” కథకు కనెక్ట్ అవుతారు. “పాగల్ వర్సెస్ కాదల్” థియేటర్కు వెళ్లి చూడాల్సిన సినిమా అని నిస్సంహదేహంగా చెప్పొచ్చు.

రేటింగ్: 3 / 5

No comments