రానా దగ్గుబాటి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ - నివేతా థామస్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ "35-చిన్న కథ కాదు" నుంచి ఫ్రెండ్షిప్ అంథమ్ సయ్యారే సయ్యా రిలీజ్
నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్."35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజు మేకర్స్ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ సయ్యారే సయ్యా పాటని రిలీజ్ చేశారు.ఫ్రెండ్షిప్ ని సెలబ్రేట్ చేసుకునే ఈ పాటని వివేక్ సాగర్ చాలా లైవ్లీగా కంపోజ్ చేశారు. వినగానే మనసుని హత్తుకునే ఈ ట్యూన్ డిలైట్ ఫుల్ గా వుంది.
కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్ చిన్ననాటి జ్ఞాపకాలను, స్నేహాలని గుర్తుకు తెస్తోంది. సింగర్ కార్తీక్ ఈ సాంగ్ జాయ్ ఫుల్ గా పాడారు. ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యే ఈ సాంగ్ ఫ్రెండ్ షిప్ డే పెర్ఫెక్ట్ ట్రీట్.
స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా రెడీ అవుతోంది.
ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. విజువల్ అప్పీల్ ని యాడ్ చేస్తూ ప్రొడక్షన్ డిజైన్‌ను లతా నాయుడు నిర్వహిస్తున్నారు. టి సి ప్రసన్న ఎడిటర్.
"35-చిన్న కథ కాదు" ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
నటీనటులు: నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: నంద కిషోర్ ఈమాని
నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: నికేత్ బొమ్మి
ఎడిటర్: టి సి ప్రసన్న
డైలాగ్స్: నంద కిషోర్ ఈమాని, ప్రశాంత్ విఘ్నేష్ అమరావతి
ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు
పబ్లిసిటీ డిజైనర్: శక్తి గ్రాఫిస్ట్, అనీష్ పెంటి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్ సౌమిత్రి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శివాని దోభాల్
లిరిక్స్: కిట్టు విస్సాప్రగడ, భరద్వాజ్ గాలి
కాస్ట్యూమ్ డిజైనర్: ప్రిన్సి వైద్
లైన్ ప్రొడ్యూసర్: విన్సెంట్ ప్రవీణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా
No comments