రెబల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి, ప్రెస్టిజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్- #PrabhasHanu అత్యంత ఘనంగా ప్రారంభం
సలార్, కల్కి 2898 AD లాంటి వరుస బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లతో ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ న్యూ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ లార్జర్ దెన్ లైఫ్ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. #PrabhasHanu కోసం ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ మూవీ మేకర్స్ ఫస్ట్ టైం చేతులు కలిపారు. ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #PrabhasHanu హ్యూజ్ కొలాబరేషన్ మునుపెన్నడూ లేని గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమా కోసం1940 బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్, పవర్ ఫుల్ వారియర్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ స్టార్ యాక్టర్స్ మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో ఈ మూవీ తెరకెక్కనుంది.
#PrabhasHanu చిత్రం ఈరోజు మూవీ టీమ్ సమక్షంలో అత్యంత ఘనంగా ప్రారంభమైయింది. ప్రభాస్, ఇమాన్వి హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిమ్రిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. సుదీప్ ఛటర్జీ ఐఎస్‌సి డీవోపీ కాగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. రామకృష్ణ - మోనికా ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.
త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
నటీనటులు: ప్రభాస్, ఇమాన్వి, మిథున్ చక్రవర్తి, జయప్రద తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హను రాఘవపూడి
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
డీవోపీ: సుదీప్ ఛటర్జీ ISC
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ప్రొడక్షన్ డిజైనర్: రామకృష్ణ - మోనిక
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
కాస్ట్యూమ్ డిజైనర్లు: శీతల్ ఇక్బాల్ శర్మ, టి విజయ్ భాస్కర్
VFX: RC కమల కన్నన్
పబ్లిసిటీ డిజైనర్స్: అనిల్-భాను
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
No comments