Home/News/'భలే ఉన్నాడే' ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది. కథ, మ్యూజిక్, ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా వుంటాయి. డెఫినెట్ గా సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు: ప్రీరిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి
'భలే ఉన్నాడే' ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది. కథ, మ్యూజిక్, ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా వుంటాయి. డెఫినెట్ గా సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు: ప్రీరిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి
యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ 'భలే ఉన్నాడే'. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ అభిరామి కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. 'భలే ఉన్నాడే' తో టీమ్ అంతా ఏడాదిన్నరగా జర్నీ అవుతున్నారు. ఈ సినిమాతో అందరికీ ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఎక్సైట్ మెంట్ తో అందరూ వర్క్ చేశారు. ఈ సినిమాతో ఒక కొత్త టీం స్క్రీన్ మీదకు రావడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గా శివ సాయి, హీరోయిన్ గా మనీషా, ప్రొడ్యూసర్ గా కిరణ్, ఇలా కొత్త టీం పరిచయం అవుతున్నారు. డెఫినెట్ గా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు. ఎప్పుడో వచ్చిన ఒక థాట్ ని సాయికి చెప్తే దాన్ని చాలా అద్భుతంగా మలిచి ఈ సినిమాని చేశాడు. ఇలాంటి పాయింట్ ని ఫ్యామిలీ అంతా చూసే విధంగా మలిచాడు. నేను సలహాలు ఇవ్వడం వరకే గాని నిజానికి కష్టపడిందంతా టీమే. నిర్మాతలు చాలా ఇష్టంతో ఈ సినిమా చేశారు. చాలా మంచి టీం ఇది. వీళ్ళ కష్టానికి తగిన ఫలితం మంచి హిట్ ద్వారా వస్తుందని బలంగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో కథ మాటలు సాంగ్స్ డైలాగ్స్ ఎమోషన్స్ అన్ని పక్కాగా కుదిరాయి. మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్ లో ఈ ప్రాబ్లం ఉంది. దీన్ని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసే విధంగా డైరెక్టర్ సాయి చాలా అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. ఆడియోస్ అందరికీ థాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండ. మీరు ఎంకరేజ్ చేస్తేనే ఒక కొత్త టీం కి ఉత్సాహంగా ఉంటుంది. నేను ఈ రోజుల్లో సినిమాతో ఎలా అయితే వచ్చానో ఈ టీం కూడా అలా ముందుకు రావాలని కోరుకుంటున్నా ను. ఈ ఈవెంట్ కు వచ్చిన అందరికీ పేరుపేరునా థాంక్స్. ఈ సినిమా చూడండి. ప్రీమియర్స్ కూడా ఉంటాయి. 13వ తేదీన సినిమా రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీస్ తో వెళ్లి చూడండి. రాజ్ తరుణ్ సినిమాని చాలా కష్టపడి చేశాడు. ఈ టీమ్ అందరినీ ఎంకరేజ్ చేయండి. అందరికీ థాంక్యు సో మచ్' అన్నారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఉయ్యాల జంపాల తర్వాత నేను కలిసిన ఫస్ట్ సెలబ్రెటీ మారుతి గారు. అప్పట్నుంచి ఆయన నాతో ఒక సినిమా చేయాలని చెబుతుండేవారు. ఆ సినిమా భలే ఉన్నాడే కావడం నా అదృష్టం. మారుతి గారికి థాంక్యూ వెరీ మచ్. మా నిర్మాత కిరణ్ గారు మమ్మల్ని బలంగా నమ్మారు. చాలా పాజిటివ్ పర్సన్. శేఖర్ చంద్ర తో ఇది నా మూడో సినిమా. మరో 30 సినిమాలు మా ఇద్దరం కలిసి చేయాలనీ కోరుకుంటున్నాం. నగేష్ గ్రేట్ సినిమాటోగ్రాఫర్. తనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. మా డైరెక్టర్ శివ సాయి మా సినిమాకి అతి ముఖ్యమైన వ్యక్తి. మారుతి గారు పాయింట్ చెప్పిన దగ్గర నుంచి సినిమా తప్పితే మరో ఆలోచన లేదు. సాయి పని రాక్షసుడు. చాలా గ్రేట్ కన్వెన్షన్ ఉన్న డైరెక్టర్ తను. చాలా అందంగా తీశాడు. ఆయనలో ఉన్న సంస్కారం సినిమాలో కనిపిస్తుంది. నన్ను అంత కొత్తగా చూపించినందుకు డైరెక్టర్ సాయికి థాంక్యూ వెరీ మచ్. అభిరామి గారితో కలిసి పని చేయడం చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఈ సినిమా చేసినందుకు అభిరామ్ గారికి థాంక్యూ. మనిషా చాలా హార్డ్ వర్క్ చేసింది. తెలుగు రానప్పటికీ కష్టపడి నేర్చుకుని డబ్బింగ్ చెప్పింది. తను అమేజింగ్ కోస్టర్. సింగీతం గారితో కలిసి పనిచేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. సెప్టెంబర్ 13న మా సినిమా రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది. అందరూ థియేటర్లోనే సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థాంక్యూ' అన్నారు.
హీరోయిన్ మనీషా కంద్కూర్ మాట్లాడుతూ.. నన్ను బిలివ్ చేసి ఈ అవకాశం చేసిన మారుతి గారికి థాంక్ యూ. శివసాయి చాలా ఫ్యాషనేట్ డైరెక్టర్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. రాజ్ తరుణ్ మూవీ అంత చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఆయనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. మా కెమిస్ట్రీ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. డిఓపి ప్రతి షాట్, సీన్ అదరగొట్టారు. శేఖర్ గారు అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. చాలా కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమా ఇది. నా క్యారెక్టర్ చాలా బబ్లీగా ఉంటుంది. ఇందులో చేసిన కృష్ణ క్యారెక్టర్ నాకు అప్పటికీ గుర్తుండిపోతుంది. డెఫినెట్ గా సినిమా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.
ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. మారుతి గారికి ధన్యవాదాలు. మారుతి గారు ప్రభాస్ గారి చేస్తున్నప్పటికీ ఎక్కువ సమయం మా కోసం కేటాయించారు. అది మాకు హ్యాపీగా వుంది. మా సినిమాకి చాలా ఎఫర్ట్ పెట్టారు. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. రాజ్ తరుణ్ గారికి, మనిషా, అభిరామి గారికి ఈ సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాలో ఫుల్ పాజిటివ్ గా వున్నాం. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది' అన్నారు.
మూవీ డైరెక్టర్ జె శివసాయి వర్ధన్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి ఆధ్యుడు మారుతి గారు. నా 15 ఏళ్ల కల భలే ఉన్నాడే. ఆ కలని నిజంచేసిన మారుతి గారికి ధన్యవాదాలు. నిర్మాత కిరణ్ గారు చాలా ఎంకరేజ్ చేశారు. ఈ సినిమాకి రాజ్ తరుణ్ గారినే అనుకున్నాం. ఆయనతోనే చేశాం. మేము హీరోని బట్టే టైటిల్ వేసుకున్నాం. పోస్టర్లో రాజ్ తరుణ్ లుక్ భలే ఉన్నాడే అనిపిస్తుంది. ఈ లుక్ మీద వర్క్ చేసిన శ్వేతా కి థాంక్స్ చెప్పాలి. నగేష్ వండర్ఫుల్ విజువల్స్ ఇచ్చారు. శేఖర్ చంద్ర బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. శ్రీకాంత్ నాకు ఒక రైట్ హ్యాండ్ లో ఉన్నారు . మనిషా చాలా అద్భుతంగా నటించింది. తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పింది. చాలా హార్డ్ వర్క్ చేసింది. మా డైరెక్షన్ టీమ్ అందరికీ థాంక్యు. రాజ్ తరుణ్ నేను ఊహించిన దాని కంటే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇందులో గౌరీ పాత్రలో కనిపిస్తున్న అభిరామ్ గారికి థాంక్యూ. పోతురాజు సినిమా చూసినప్పటి నుంచి ఆవిడంటే చాలా ఇష్టం. మదర్ క్యారెక్టర్ కి అభిరామి గారు అయితేనే పర్ఫెక్ట్ అని భావించాం. సంగీతం శ్రీనివాసరావు గారితో చేసిన ఫోర్ డేస్ వర్క్ షాప్ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. ఆయన అనుభవాలన్నీ మాకు చెప్పారు. నా మొదటి సినిమాలో సంగీతం శ్రీనివాసరావు గారి యాక్షన్ చెప్పడం ప్రౌడ్ మూమెంట్. ఈటీవీ గణేష్ గారు సెకండ్ హాఫ్ అంతా కుమ్మేశారు. సెకండ్ హాఫ్ క్రెడిట్ హైపర్ ఆది గారికి ఇవ్వాలి. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా చేశాం. ఒక నవ్వు నవ్వుకుని థియేటర్ నుంచి బయటికి వస్తారు. అందరికీ థాంక్యు వెరీ మచ్' అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. ఈ సినిమా మ్యూజిక్ గురించి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ విషయంలో ముందుగా మారుతి గారికి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. శివ సాయి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా వండర్ఫుల్ గా ఉంది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా మ్యూజిక్ టీంకు థాంక్యూ. రాజ్ తరుణ్ తో ఇది నా మూడో సినిమా. మా కాంబినేషన్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్స్ అన్ని అద్భుతంగా ఉంటాయి. నిర్మాత కిరణ్ గారికి థాంక్యూ. అందరూ థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలి' అన్నారు.
యాక్ట్రెస్ అభిరామి మాట్లాడుతూ..ఇది తెలుగులో నా రీఎంట్రీ సినిమా. మారుతి గారు ఈ సినిమా గురించి చెప్పి ఇందులో క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుందని అన్నారు. డైరెక్టర్ సాయి గారు ఈ కథ చెప్పిన తర్వాత కచ్చితంగా చేస్తానని అన్నాను. ఈమధ్య నేను చేసిన ఓ సినిమా రిలీజ్ అయినప్పటికీ ఇది నా రీలాంచ్ సినిమాగా కన్సిడర్ చేస్తున్నాను. చాలా వండర్ ఫుల్ మూవ. చాలా మంచి క్యారెక్టర్ చేశాను. మారుతి గారు సినిమాల్లో కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను. శేఖర్ చంద్ర అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సింగీతం గారు ఇందులో చాలా మంచి రోల్ చేస్తున్నారు. మనిషా, రాజ్ తరుణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనిషా చాలా హార్డ్ వర్క్ చేసింది. తను తెలుగులో బిగ్ స్టార్ అవుతుంది. రాజ్ తరుణ్ చాలా నేచురల్ యాక్టర్. ఎమోషనల్ సీన్స్ ని చాలా అద్భుతంగా చేశారు. గౌరీ లాంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ సాయి గారికి థాంక్యూ. అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం.
యాక్టర్ వీటీవీ గణేష్ మాట్లాడుతూ.. మారుతి గారు, ప్రభాస్ గారు కలిసి చేస్తున్న సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాను. ఆ సినిమా జరుగుతున్నప్పుడే మారుతి గారు ఈ సినిమా గురించి చెప్పారు. చాలా బ్యూటిఫుల్ లైన్. డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు అమేజింగ్ అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్ సినిమా ఇది. ప్రతి సీన్ ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. రాజ్ తరుణ్ అమేజింగ్ యాక్టర్. సెట్ లో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. డైరెక్టర్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ లెవెల్ సినిమాలు చేస్తారు. మారుతి గారు ప్రతిభని గుర్తించడంలో దిట్ట. టాలెంట్ ని గుర్తించి వారిని ఎంకరేజ్ చేయడం చాలా పెద్ద విషయం. ఈ విషయంలో మారుతి గారికి అభినందనలు. తెలుగు ఆడియన్స్ అందరికీ థాంక్యూ. నేను బీస్ట్ లో చెప్పిన ఒక్క డైలాగ్ నన్ను ఈరోజు ఈ స్టేజ్ లో నిలబెట్టింది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. ఈ సినిమా తప్పకుండా చాలా పెద్ద హిట్ అవుతుంది' అన్నారు
డైరెక్టర్ సుబ్బు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మారుతి గారు అందరిని నవ్వించే టాలెంట్ ఉన్న వ్యక్తి. అంతకంటే మంచి మనిషి. ఆ మంచితనం కచ్చితంగా నిలబడుతుంది. నాతో పాటు సాయి లాంటి మరో టాలెంట్ ని సపోర్ట్ చేశారు. చాలా మంచి కథ ఇది. ఎమోషన్ ని సాయి అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. రాజ్ తరుణ్ గారు చాలా ప్లజెంట్ గా కనిపిస్తున్నారు. సినిమా డెఫినెట్ గా మంచి హిట్ అవుతుంది' అన్నారు.
యాక్టర్ రాజా రవీంద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం మారుతి గారే. ఈ సినిమా పాయింట్ శివ సాయి వర్ధన్ గారికి చెప్పారు. శివ సాయి కథ మాటలు మేకింగ్ చాలా అద్భుతంగా చేశారు. రాజ్ తరుణ్ చాలా ఫ్రెష్ గా ఉన్నారు. ట్రైలర్ చూడగానే చాలా మంచి ఎంటర్టైన్మెంట్ తో సినిమా వస్తుందనే కాన్ఫిడెన్స్ ని ఇస్తుంది. సాయి చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. మారుతి గారు టాలెంట్ ని ఎంకరేజ్ చేసి ఇండస్ట్రీ పచ్చగా ఉండేట్లు చేస్తున్నారు. థాంక్యూ సో మచ్ మారుతి గారు. ఆయన ద్వారా వచ్చిన ఎంతోమంది ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను
యాక్టర్ సప్తగిరి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం ఈరోజు. ఈ ఫంక్షన్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ కొట్టాలి. రాజ్ తరుణ్ కి ఈ సినిమా హిట్ తో కొత్త జీవితం ప్రారంభం కావాలని ఆశిస్తున్నాను. భలే భలే మగాడివో తర్వాత ఈ సినిమాకి 'భలే' అని టైటిల్ పెట్టానని మారుతి గారు చెప్పారు. భలే భలే మగాడివో లానే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. చాలా మంచి కాన్సెప్ట్. సినిమా ప్రొడ్యూసర్ కిరణ్ గారికి పరిశ్రమకు స్వాగతం. డైరెక్టర్ శివ సాయి వర్ధన్ గారికి ఆల్ ది బెస్ట్. సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి' అన్నారు
ఆర్ట్ డైరెక్టర్ సురేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమా చాలా బాగుంటుంది. కొత్తగా ఉంటుంది. రాజ్ తరుణ్ గారు చాలా కొత్తగా కనిపిస్తారు. మారుతి గారితో బేబీ సినిమా చేశాను. అది సూపర్ హిట్ అయింది. మళ్ళీ ఈ సినిమాకు పని చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మారుతి గారికి ధన్యవాదాలు' అన్నారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
'భలే ఉన్నాడే' ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది. కథ, మ్యూజిక్, ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా వుంటాయి. డెఫినెట్ గా సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు: ప్రీరిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి
Reviewed by firstshowz
on
1:57 pm
Rating: 5
No comments