ఘనంగా "చిట్టి పొట్టి" సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్, అక్టోబర్ 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్...
రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "చిట్టి పొట్టి". ఈ చిత్రాన్ని భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "చిట్టి పొట్టి" సినిమా అక్టోబర్ 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
అతిథిగా వచ్చిన డా.కేర్ గ్రూప్ ఛైర్మన్ ఏ.ఎం రెడ్డి మాట్లాడుతూ - "చిట్టి పొట్టి" సినిమాను ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకుని క్వాలిటీగా మూవీని రూపొందించారు భాస్కర్ గారు. మంచి కంటెంట్ తో పాటు పాటలు, నటీనటుల సెలెక్షన్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్ముతున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ మాట్లాడుతూ- "చిట్టి పొట్టి" సినిమా పాటలకు మంచి స్పందన వస్తోంది. మా డైరెక్టర్ భాస్కర్ గారు ఎంతో అభిరుచితో పాటలు చేయించుకున్నారు. మంచి లిరిక్స్ కుదిరాయి. మా మూవీ ఆల్బమ్ ఎంత హిట్ అయ్యిందో సినిమా కూడా అంతే సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ కస్వి మాట్లాడుతూ - మా "చిట్టి పొట్టి" సినిమా ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అక్టోబర్ 3న మా సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమా ఉంటుంది. ఇలాంటి ఫ్యామిలీ మూవీస్ ను మీరంతా తప్పకుండా ఇష్టపడతారని తెలుసు. మా "చిట్టి పొట్టి" సినిమాను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ పవిత్ర మాట్లాడుతూ - "చిట్టి పొట్టి" సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ భాస్కర్ గారికి థ్యాంక్స్. కస్వి, రామ్ తో కలిసి నటించడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. మేమంతా ఫ్యామిలీలా మారిపోయాం. "చిట్టి పొట్టి" సినిమాను మీరంతా తప్పకుండా థియేటర్ లో చూస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి మాట్లాడుతూ- మా "చిట్టి పొట్టి" సినిమా పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ కూడా బాగుందనే ప్రశంసలు దక్కుతున్నాయి. అన్నా చెల్లెలు మధ్య అనుబంధం నేపథ్యంలో మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాను. ప్రతి ఒక్క కుటుంబంలో అన్నా చెల్లి ఉంటారు. వాళ్లందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది. మూడు తరాలలో ఒక ఆడపిల్ల ముందు చెల్లెలిగా, తర్వాత మేనత్తగా, ఆఖరికి బామ్మ గా.. మారే జర్నీ లో ఆమె భావోద్వేగాలు, ప్రేమ, కష్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నాం. అలాగే ఇప్పుడున్న సోషల్ మీడియా ఒక ఆడపిల్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఆ సందర్భంలో అన్న తన చెల్లిని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాడు అనేది మీ అందరికీ నచ్చుతుంది. మా చిన్న సినిమాను మీడియా బాగా సపోర్ట్ చేస్తోంది. అక్టోబర్ 3న "చిట్టి పొట్టి" సినిమాను థియేటర్స్ లో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో రామ్ మిట్టకంటి మాట్లాడుతూ - ఫ్యామిలీ అంతా కలిసి ఉంటే ఎలాంటి అద్భుతాలు సృష్టింవచ్చో దర్శకుడు రాజమౌళి గారి ఫ్యామిలీ నిరూపించింది. "చిట్టి పొట్టి" సినిమాలో నటించిన తర్వాత నాకూ ఒక సోదరి ఉంటే బాగుండును అనిపించింది. ఒక మంచి ప్రయత్నం చేశాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నా సోదరిగా పవిత్ర బాగా నటించింది. మమ్మల్ని స్క్రీన్ మీద చూస్తే నిజంగా అన్నా చెల్లి అనుకుంటారు. "చిట్టి పొట్టి" సినిమా మీ హార్ట్ టచ్ చేస్తుంది. కళ్లు చెమర్చకుండా థియేటర్ నుంచి బయటకు రాలేరు. చివరి 20 నిమిషాలు సినిమా అద్భుతంగా ఉంటుంది. అక్టోబర్ 3న థియేటర్స్ లో మా "చిట్టి పొట్టి" సినిమా చూడండి. అన్నారు.
నటీనటులు - రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి, కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ, తదితరులు
టెక్నికల్ టీమ్
బ్యానర్ - భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా
ఎడిటర్ - బాలకృష్ణ బోయ
మ్యూజిక్ - శ్రీ వెంకట్
సినిమాటోగ్రఫీ - మల్హర్ భట్ జోషి
పీఆర్ఓ - లక్ష్మీ నివాస్
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం - భాస్కర్ యాదవ్ దాసరి
No comments