శ్రీ గణేష్ దేవి మువీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో, శ్రీమతి కదిరి శిరీష సమర్పణలో, చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో, కదిరి రమాదేవి రెడ్డి నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కాశీనగర్ -1947. ఫిలించాంబర్‌లో టీజర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, సుప్రీంకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ సీనియర్ న్యాయవాది యన్.రామచంద్ర రావు మాట్లాడుతూ... “సినిమా పాటలు చూశాను. సినిమా కొత్తగా వుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. భక్తిరసాచిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం దర్శకనిర్మాతలు మీకు నచ్చేవిధంగా తీర్చిదిద్దారు. అందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలి” అని అన్నారు. అందరూ చూడాల్సిన సినిమా.
రిటైర్డ్ డిజిపి డా! సి.యన్. గోపీనాథ్ రెడ్డి, ఐపిఎస్ మాట్లాడుతూ... “ఈరోజుల్లో సినిమా తీయడం చాలా తేలిక.. సినిమా నిలబెట్టుకోవడం చాలా కష్టం. సినిమాలో పాటలు బాగున్నాయి. ప్రపంచంలో తెలుగు వారందరికీ నచ్చే సినిమా ఇది. అందరూ ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలు మీ ముందుకువస్తాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలి” అని అన్నారు.
తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్. మాట్లాడుతూ... “కాశీనగర్ 1947” భక్తిరస చిత్రం అందరికీ నచ్చుతుంది. అందరూ ఫ్యామిలీతో కలిసి సినిమా చూడండి. సినిమా రిలీజ్ సమయంలో తెలంగాణ ఫిలిం చాంబర్ తరపున హెల్ప్ చేయడానికి మేం రెడీగా వున్నాం. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాత కదిరి రమాదేవిరెడ్డిగారికి డబ్బులు వచ్చి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
దర్శకనిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ... “కదిరి రమాదేవి రెడ్డి మంచి ఫ్యాషన్ వున్న నిర్మాత. ఇలాంటి నిర్మాతలు ఇండస్ర్టీకి కావాలి. దర్శకులు చిత్తజల్లు ప్రసాద్ గారు కూడా మంచి అనుభవం వున్న దర్శకులు.. సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
చిత్ర దర్శకులు చిత్తజల్లు ప్రసాద్ బి.ఎ. మాట్లాడుతూ.. “సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మా నిర్మాతగారు కూడా ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారు. సినిమాలోని నటీనటులందరూ చాలా అద్భుతంగా నటించారు. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. అందరూ ఫ్యామిలీతో సినిమా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.
చిత్ర నిర్మాత కదిరి రమాదేవి రెడ్డి మాట్లాడుతూ.. “మా సినిమాకు సపోర్ట్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా ఈశ్వరుడి సంకల్పం వల్లే తీయగలిగాను.. ఆయన సంకల్పం లేనిదే ఈ సినిమా తీయలేను.. ఆయన ఆశీర్వాదం వల్లే సినిమా తీసి మీ
ముందుకు తీసుకువచ్చాను. ఈ సినిమాను మీరు చూసి ఆయన సంకల్పాన్ని మీరు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఒక పాత్రలో నటించాను. నటీనటులందరూ చాలా బాగా వారి పాత్రల్లో ఇమిడిపోయారు. తెలుగు క్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో వున్నాం. మా దర్శకులు ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు” అని అన్నారు.
తాడిపత్రి జనసేన ఇన్‌చార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... “కదిరి రమాదేవిరెడ్డి గారు బడ్జెట్‌కి ఎక్కడా వెనకడుగు వేయకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించి హిట్ చేయాలి” అని అన్నారు.
హైకోర్టు లాయర్, నటులు కె.వి. ఎల్. నరసింహా రావు మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నాకు ముఖ్య పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకులు ప్రసాద్ గారికి, మా నిర్మాత రమాదేవి రెడ్డి గారికి కృతజ్ఞతలు. సినిమా చాలా బాగా తీశారు. తెలుగు వాళ్ళంతా ఆదరించి హిట్ చేయాలి” అని అన్నారు.
సంగీత దర్శకులు కె.లక్ష్మణసాయి మాట్లాడుతూ... “సినిమా పాటలు వింటుంటూ వినసొంపుగా వున్నాయి. ఇలాంటి భక్తిరస చిత్రానికి సంగీతం కూడా వినసొంపుగా.. అద్భుతంగా అవుట్‌పుట్ వచ్చింది. మీరు కూడా పాటలు వినండి.. సినిమా చూసి ఆదరించండి. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు” అని అన్నారు.
లిరిక్ రైటర్ గడ్డ సీతారామచౌదరి మాట్లాడుతూ.. “ఈ సినిమాలో పాటలు రాయడానికి అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. పాటలు చాలా బాగా వచ్చాయి. సంగీత దర్శకులు లక్ష్మణసాయి గారు సంగీతం చాలా బాగా అందించారు. భక్తిరస చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి
No comments