Home/News/నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతిని పురస్కరించుకుని 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' ఫిల్మ్ ఫెస్టివల్‌ను అనౌన్స్ చేసిన ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతిని పురస్కరించుకుని 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' ఫిల్మ్ ఫెస్టివల్‌ను అనౌన్స్ చేసిన ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్
ఇండియా, 4 సెప్టెంబర్ 2024- ఈ ఏడాది సెప్టెంబర్ 20న నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు100వ జయంతిని పురస్కరించుకుని, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గానైజేషన్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్ ని అనౌన్స్ చేసింది. ఇండియన్ సినీ లెజండ్ కు నివాళులు అర్పిస్తుంది.
ఈ ఫెస్టివల్‌లో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాలతో పాటు వరంగల్, కాకినాడ, తుమకూరు, వడోదర, జలంధర్, రూర్కెలా వంటి స్మాల్ సిటీస్ సహా 25 నగరాల్లో సెప్టెంబర్ 20 - 22, 2024 నుండి 10 రిస్టోర్డ్ ANR క్లాసిక్స్ ప్రదర్శించనున్నారు .
ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో లెజెండ్ ANR యొక్క వెర్సటైల్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లు మరోసారి బిగ్ స్క్రీన్ చూసే ప్రత్యేక అవకాశం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు ఉంటుంది. 'దేవదాసు' (1953), 'మిస్సమ్మ' (1955) 'మాయాబజార్' (1957), 'భార్య భర్తలు' (1961), 'గుండమ్మ కథ' (1962), 'డాక్టర్ చక్రవర్తి' (1964), 'సుడిగుండాలు' (1968), 'ప్రేమ్ నగర్' (1971), 'ప్రేమాభిషేకం' (1981) 'మనం' (2014) సహా ANR ల్యాండ్‌మార్క్ మూవీస్ ప్రదర్శించనున్నారు.
ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం NFDC – నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా, PVR-Inox సహకారంతో దేశవ్యాప్తంగా ఈ ఫెస్టివల్స్ నిర్వహిస్తోంది.
ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ శివేంద్ర సింగ్ దుంగార్‌పూర్ మాట్లాడుతూ.. “అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్ రెట్రోస్పెక్టివ్‌ల భారీ విజయం తర్వాత, తెలుగు సినీ లెజెండ్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం ఈ ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ఫెస్టివల్‌ను ప్రదర్శించడం మాకు చాలా ఆనందంగా ఉంది. 1953 నుండి 2014 వరకు సినిమాల ఎంపికలో ANR బిగ్గెస్ట్ హిట్‌లు ఉన్నాయి, అవి యాక్టర్ గా ANR అద్భుతమైన ప్రదర్శన చూసే అవకాశాన్ని ప్రజలకు అందిస్తాయి . ఈ సినిమాలు దశాబ్దాలుగా ప్రజలతో ప్రతిధ్వని స్తున్నాయి. మన సినిమా వారసత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మేము అన్ని ప్రాంతాల నుండి భారతీయ సినిమా యొక్క విభిన్న వారసత్వాన్ని ప్రదర్శించడానికి కట్టుబడి ఉన్నాము . ఈ రెట్రోస్పెక్టివ్‌లలో మోడరన్ ప్రేక్షకులు క్లాసిక్ చిత్రాలను ఎంతగా ఇష్టపడుతున్నారో మేము చూశాము, అనేక స్క్రీనింగ్స్ హౌస్ ఫుల్ కావడం ఆనందంగా వుంది' అన్నారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, “ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ మా నాన్నగారి 100వ జయంతిని దేశవ్యాప్తంగా ఆయన ల్యాండ్‌మార్క్ సినిమాల ఫెస్టివల్ తో జరుపుకోవడం ఆనందంగా ఉంది. నాన్న గారు అన్ని రకాల పాత్రలతో ప్రజల హృదయాలో నిలిచిపోయారు. అందుకే ఆయన్ని ప్రేక్షకులు నటసామ్రాట్ అని పిలుస్తారు. దేవదాసులో నాన్నగారి నటన సినిమా అన్ని వెర్షన్లలో అత్యుత్తమమైనదిగా గుర్తించబడింది. ప్రేమాభిషేకం, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు వంటి అనేక చిత్రాలు నేటికీ ఎంతగానో ఇష్టపడుతున్నారు. మన రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది వేసి అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించి మార్గదర్శకునిగా నిలిచారు. ఆయన లెగసీని కొనసాగించడం మాకు గర్వంగా వుంది. ఈ పండుగ ద్వారా కేవలం తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకు ఒక ఐకాన్‌ను గుర్తుంచుకుంటారు. ప్రజలు ఆయనను మరో వందేళ్లు గుర్తుంచుకునేలా ఈ వారసత్వాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. ఈ పండుగను సాధ్యం చేయడంలో మాతో భాగస్వామ్యం అయినందుకు అక్కినేని కుటుంబం మొత్తం NFDC-NFAI , PVR-Inoxకి ధన్యవాదాలు తెలుపుతున్నాం'
అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ, “తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మార్గదర్శకుడు, భారతీయ సినిమాకి ఐకాన్ అయిన శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి 100వ జయంతిని పురస్కరించుకుని, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ భారతదేశం అంతటా ఆయన చిత్రాలను విడుదల చేయడం ద్వారా ఆయన లెగేసీని సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది. ఆయన్ని అనేక సందర్భాలలో కలుసుకునే అదృష్టాన్ని కలిగింది. ఆయన వినయం, సింప్లీసిటీకి ఆశ్చర్యపోయాను. తెలుగు సినిమాకి ఈ స్థాయిలో రెట్రోస్పెక్టివ్ చేయడం ఇదే తొలిసారి. భారతీయ సినిమా వారసత్వాన్ని తిరిగి బిగ్ స్క్రీన్ పై తీసుకురావాలనే ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ యొక్క నిబద్ధతకు అనుగుణంగా ఈ పండుగ జరుగుతుంది. ఇది దేవదాసు, సుడిగుండాలు, డాక్టర్ చక్రవర్తి వంటి తెలుగు క్లాసిక్‌లలో అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, బహుముఖ ప్రజ్ఞ, లెజెండరీ నటుడి ప్రెజెన్స్ ని ఎక్స్ పీరియన్స్ చేసే అద్భుతమైన అవకాశాన్ని సమకాలీన ప్రేక్షకులకు అందిస్తుంది' అన్నారు
NFDC-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ (ఫిలిమ్స్), మేనేజింగ్ డైరెక్టర్ పృథుల్ కుమార్ మాట్లాడుతూ, “NFDC-NFAI శ్రీ ANR గారి శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కొలబరేట్ అవ్వడం చాలా గౌరవంగా ఉంది. ఏడు టైం లైస్ క్లాసిక్‌లను అందించడం ద్వారా, ఆర్కైవ్ సేకరణలో ఉన్న ప్రింట్‌లు, ప్రతికూలతల నుండి 4Kలో రిస్టోర్ చేశారు. ఈ కార్యక్రమం ఒక దిగ్గజ నటుడికి నివాళులర్పించడం మాత్రమే కాదు, భారతీయ సినిమా యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రచారం చేయడానికి మా నిబద్ధతకు నిదర్శనం. ఈ కళాఖండాలను తిరిగి బిగ్ స్క్రీన్ పై తీసుకురావడం ద్వారా, ప్రేక్షకులు మన చలనచిత్ర చరిత్ర యొక్క స్వర్ణయుగంతో మళ్లీ కనెక్ట్ అయ్యేలా చీస్తానిఆశిస్తున్నాము. ఈ చిత్రాలను నేషన్ తో పంచుకోవడానికి వేదికను అందించిన PVR-INOXకి, అన్నపూర్ణ స్టూడియోస్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్‌కు నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ కింద ఈ ప్రయత్నానికి ఫండ్స్ సమకూర్చినందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు మా హృదయపూర్వక ధన్యవాదాలు' తెలిపారు.
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 71 సంవత్సరాల కెరీర్ లో 250పైగా సినిమాలలో విభిన్న పాత్రలతో ప్రసిద్ధి చెందారు. నిర్మాతగా అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. మెయిన్ స్ట్రీమ్ సినిమాలు, ఆఫ్‌బీట్ చిత్రాలు, మిథాలజీ, సోషల్ డ్రామాలలో నటించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ANR హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించారు. అది తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కేంద్రంగా ఎదిగింది. ANR జనవరి 22, 2014న మరణించారు. ఆయన కుమారుడు సూపర్ స్టార్ నాగార్జున, మనవళ్లు నాగ చైతన్య, అఖిల్ అక్కినేని ANR వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు.
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతిని పురస్కరించుకుని 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' ఫిల్మ్ ఫెస్టివల్‌ను అనౌన్స్ చేసిన ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్
Reviewed by firstshowz
on
7:16 pm
Rating: 5
No comments