'వీరాంజనేయులు విహారయాత్ర'కు పాత్ బ్రేకింగ్ సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కు థాంక్ యూ: సక్సెస్ మీట్ లో డా. నరేశ్ వికె &టీం
నవరసరాయ డా. నరేశ్ వికె, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ నటించిన బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’. అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు.బి, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించారు. ఆగస్ట్ 14న ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అయిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకొని, రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్, వాచ్ టైంతో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
సక్సెస్ మీట్ లో డా. నరేష్ వికె మాట్లాడుతూ..ఈ సినిమా విషయంలో రెండు పెద్ద వాఖ్యలు చేశాను. ఉషాకిరణ్ కి శ్రీవారికి ప్రేమలేఖ ఎంతో ఈటీవీ విన్ కి 'వీరాంజనేయులు విహారయాత్ర' అంత పెద్ద సినిమా అన్నాను. అనురాగ్ వన్ అఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అని చెప్పాను. ఈ రోజు ఈ రెండు మాటలు ఈ రోజు ఫ్రూవ్ అయ్యాయి. 200మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో సినిమా దూసుకుపోతోంది. బిగ్గెస్ట్ హిట్ ఇది. ఒక గౌరవాన్ని తెచ్చిన సినిమా. ఒక్క ప్రోడక్ట్ జీవితాన్ని మార్చేస్తుంది. ఇది అలాంటి సినిమానే. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి థాంక్ యూ. ఇది ప్రేక్షకుల విజయం. ఈ సినిమాలో కీలక నా అదృష్టం. ఇది కెరియర్ కి టర్నింగ్ పాయింట్. అనురాగ్ పలుట్ల బ్యూటీఫుల్ గా తీశారు. అనుకుర్ చాలా బ్రిలియంట్ వర్క్ ఇచ్చాడు. ఎవ్రీ ఫ్రేం ఏ పోయెమ్. ప్రొడక్షన్ టీం నితిన్, సాయి, సతీష్ అందరికీ థాంక్ యూ. చాలా చక్కగా చూసుకున్నారు. రాగ్ మయూర్, ప్రియా అందరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమా ఓటీటీని రీడిఫైన్ చేస్తుంది. పాత్ బ్రేకింగ్ మూవీ ఇది. ఇదొక ఎమోషనల్ ట్రావెల్. ఈ సినిమా మెమరీ నా లైఫ్ టైంలో మర్చిపోలేను. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థాంక్ యూ' అన్నారు.
డైరెక్టర్ అనురాగ్ మాట్లాడుతూ.. ఈ సినిమానికి ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్స్. నా డైరెక్షన్ టీంకి థాంక్ యూ. ఈటీవి విన్ వారికి థాంక్ యూ. డీవోపీ అంకూర్, ఎడిటర్ నరేష్, మ్యూజిక్ డైరెక్టర్ విక్రం అందరూ వోన్ చేసుకొని పని చేశారు. రవి ఈ సినిమాకి స్టార్టింగ్ పాయింట్. రాగ్ అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ప్రియ అద్భుతంగా నటించింది. నరేష్ గారు పాజిటివ్ పర్శన్. నేను పది సినిమాలు చేస్తే ఆ సినిమాలన్నిటిలో నరేష్ గారు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాకి వచ్చిన ప్రసంశలని మర్చిపోలేను' అన్నారు.
యాక్టర్ రాగ్ మయూర్ మాట్లాడుతూ.. ఈ సినిమాని అందరూ వోన్ చేసుకున్నారు. మామూలు ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం రివ్యూలు రాశారు. ఇది ఆర్గానిక్ సక్సెస్. ఈ ఇది నాకు పర్శనల్ గా చాలా కనెక్షన్ వున్న సినిమా. వీరు లాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చిన అనురాగ్ కి థాంక్ యూ. మాకు సపోర్ట్ చేసిన నిర్మాతలకు, ఈటీవీ విన్ వారికి థాంక్ యూ. నరేష్ గారు నా ఐడెల్. ఆయనకి ఏకలవ్య శిష్యుడిని. ఆయనతో వర్క్ చేయడం మెమరబుల్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ యాత్ర వెళ్తూనే వుంటుంది' అన్నారు.
డైరెక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ.. టీం అందరికీ అభినందనలు. ఇలాంటి మంచి సినిమాలు వస్తున్నపుడు ఇంకా మంచి కంటెంట్ చేయాలని స్ఫూర్తి వస్తుంది. అనురాగ్ కి కంగ్రాట్స్. తను మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు.
డైరెక్టర్ సతీష్ వేగ్నేశ మాట్లాడుతూ..ఈ సినిమా మానవ సంబంధాల అనుబంధాల యాత్ర. ఇంతమంచి సినిమాని సపోర్ట్ చేసిన ఈటీవిన్ వారికి థాంక్ యూ. ఇలా సపోర్ట్ చేస్తే ఇలాంటి సినిమాలో ఇంకెన్నో వస్తాయి. నరేష్ గారు నవ్విస్తూ ఎమోషన్ పండించే యాక్టర్. ఆయన సవాల్ తో కూడిన పాత్రలని అద్భుతంగా చేస్తారని మరోసారి ప్రూఫ్ చేశారు. ఈ సినిమా యూనిట్ అందరికీ అభినందనలు' తెలిపారు.
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. ఆన్ పేపర్ ఇది బోల్డ్ సినిమా. ఇలాంటి సినిమా చేయడం చాలా కష్టం. ఈ సినిమాని అనురాగ్ నమ్మాడు. స్క్రిప్ట్ చదవి ఎలాగైనా చేయాలనిపించింది. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ కి థాంక్ యూ' అన్నారు.
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమా రిలీజైన దాదాపు నెల రోజుల తర్వాత సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే.. ఇది ఆర్గానిక్ సక్సెస్. ఈ సినిమా విజయం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పటికీ గుర్తుంటుంది. ఈ సినిమాకి సీక్వెల్ రాయాలని అనురాగ్ ని కోరుకుంటున్నాను. మాకు గౌరవం తెచ్చిన సినిమా ఇది. నరేశ్ గారికి స్పెషల్ థాంక్ యూ. ఈ సినిమాని విజయం చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' తెలిపారు.
ప్రియా వడ్లమాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. మా సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ థాంక్ యు. ఇందులో చేసిన సరయు క్యారెక్టర్ నాకు చాలా స్పెషల్' అన్నారు. యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
తారాగణం: నరేష్, శ్రీ లక్ష్మి, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని, ప్రియదర్శిని, తరుణ, రవితేజ మహాదాస్యం.
సాంకేతిక సిబ్బంది
నిర్మాత: బాపినీడు - బి, సుధీర్ ఈదర
రచన, దర్శకత్వం: అనురాగ్ పాలుట్ల
డీవోపీ - అంకుర్ సి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -సతీష్ గుడే
ఎడిట్ - నరేష్ అడుప , హరి శంకర్ TN
సంగీతం -RH విక్రమ్
ప్రొడక్షన్ డిజైన్ - ఎల్లో డిజైన్ స్టూడియో
పీఆర్వో: వంశీ- శేఖర్
No comments