రాంగోపాల్ వర్మ లేటెస్ట్ సెన్సషనల్ మూవీ 'శారీ' ఫాన్సీ రేట్ తో తెలుగు రాష్ట్రాలకు పంపిణీ హక్కులు పొందిన ప్రముఖ పంపిణీదారుడు ముత్యాల రాందాస్

                                  
రాంగోపాల్ వర్మ తాజా సినిమా 'శారీ' టైటిల్ కి  'టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ' అనే లాగ్ లైన్ తో పాన్ ఇండియా మూవీగా  తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్ లో విడుదల చేయనున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో అర్జీవి  ఆర్వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'శారీ'ని ప్రముఖ బిజినెస్ మాన్ రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం  ఆంధ్ర, తెలంగాణ రాష్టాలలో వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా తెలుగులో  విడుదల చేయడానికి ప్రముఖ పంపిణీ దారుడు ముత్యాల రాందాస్ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్నారు. పలు నిజజీవిత సంఘటనల మేళవింపుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ గా 'శారీ' చిత్రం రూపొందుతోంది.  చీరలో ఉన్న అమ్మాయిని చూసి పిచ్చివాడై ఆమెతో ప్రేమలోపడి ఎంతో హానికరంగా, డేంజరస్ గా...  ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఇందులోని ప్రధానాంశం. ఇందులో అబ్బాయిగా సత్య యాదు నటిస్తూండగా, అతనిలో సెగలు రేపే చీరలోని అమ్మాయి పాత్రలో ఆరాధ్య దేవి నటిస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత రవి వర్మ మాట్లాడుతూ : " 'శారీ' మూవీ ని  తెలుగు, హిందీ, తమిళ, మరియు  మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇటీవల మేము విడుదల చేసిన టీజర్ కి అద్భుతమైన స్పందన లభించింది. నిజజీవిత సంఘటనల మేళవింపుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ గా 'శారీ' చిత్రం ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ రాష్టాలలో వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా తెలుగులో విడుదల చేయడానికి ప్రముఖ పంపిణీ దారుడు ముత్యాల రాందాస్ మంచి ఫాన్సీ రేట్ తో    థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్నారు." అన్నారు. ప్రముఖ పంపిణిదారుడు ముత్యాల రాందాస్ మాట్లాడుతూ :"రాంగోపాల్ వర్మ గారి చిత్రాలు ఎన్నో చూసాను, నేటి సమాజం లో వాస్తవంగా జరిగే సంఘటనలను ప్రజలకు కళ్లెదుట జరిగిన విధంగ చూపిస్తారు. ఈ సారి   'శారీ' చిత్రం తో మరో మారు ఓ నిజజీవిత సంఘటనల సమాహారాన్ని చూపించబోతున్నారు. టీజర్ కాకుండా  సినిమా కూడా  చూసాను, ముఖ్యంగా ఈ చిత్రం యూత్ అండ్ ఫామిలీ ప్రేక్షకులు చూసే విధంగా మలిచారు రాంగోపాల్ వర్మ. మా వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా విడుదల కావడం ఆనందంగా వుంది " అన్నారు.      

బ్యానర్ : అర్జీవి  ఆర్వి ప్రొడక్షన్స్ 
నటీనటులు : సత్యా యాదు, ఆరాధ్య దేవి తదితరులు  
సినిమాటోగ్రఫీ : శబరి,
నిర్మాత : రవి వర్మ, 
దర్శకుడు : గిరి కృష్ణ కమల్

No comments