పైలం పిలగా మూవీ రివ్యూ

కొత్త నటీనటులతో తెరకెక్కిస్తున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది.  హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ లో  మొదటి చిత్రం 'పైలం పిలగా' ను  రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. డబ్బింగ్  జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ ఆరు అద్భుతమైన పాటలతో మెలోడియస్ సంగీతాన్ని అందించారు. కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ, శైలేష్ దరేకర్, స్టైలిస్ట్ హారిక పొట్ట, లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ ఒడ్నాల పనిచేసిన ఈ చిత్రానికి రవి వాషింగ్టన్, కృష్ణ మసునూరి, విజయ్ గోపు సహా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న థియేటర్స్ లో విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:

సాయి తేజ కల్వకోట (శివ) దుబాయ్ వెళ్లి బాగా సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. అందుకోసం రెండు లక్షల రూపాయలు అవసరమవుతాయి, ఈ క్రమంలో శివ నాన్నమ్మ ఒక స్థలం ఉంది, ఇది అమ్మితే డబ్బు వస్తుంది, దుబాయ్ వెళ్ళవచ్చు అని చెబుతుంది. శివ తన స్నేహితుడు ప్రణవ్  సోను (శ్రీను) తో కలిసి స్థలం అమ్ముదామని అనుకుంటాడు. ఆ స్థలం లెటికేషన్ లో ఉంటుంది. ఈ క్రమంలో (పావని కారణం ) దేవిని శివ ప్రేమిస్తాడు, చివరికి శివ దేవిని వివాహం చేసుకున్నాడా ? శివ తాను దుబాయ్ వెళ్లాలనుకున్న ప్లాన్ ఏమయ్యింది ? వంటి విషయాలు తెలియాలంటే పైలం పిలగా సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

కొన్ని సినిమాలు పాయింట్ వైజ్ గా చూసుకుంటే భలే అనిపిస్తాయి కానీ.. సినిమాగా కొంచం బోర్ కొడతాయి. “పైలం పిలగా” కూడా ఆ జాబితా సినిమానే. సినిమాలో మంచి పాయింట్ ఉంది, మంచి మెసేజ్ ఉంది, మంచి పాత్రలున్నాయి. కానీ వాటిని ప్యాకేజ్ గా తీర్చిదిద్దన విధానం మాత్రం అలరించలేకపోయింది. అందువల్ల సినిమా ఎంత నిజాయితీగా ఉన్నా.. రెండు గంటలపాటు ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెట్టడంలో విఫలమైంది.


నటీనటులు విషయానికొస్తే..

కొత్త నటీనటులైన ఎక్కడా కొత్తవాళ్లలా కాకుండా.. పక్కంటి అమ్మాయి, కుర్రాడిలా నటించిన తీరు ఆకట్టుకుంటుంది. సహాయ పాత్రల్లో నటించిన నటీనటులు నటనకు ఈ సినిమాకు ప్లస్ అని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటి యూత్ తప్పక  చూడాల్సిన సినిమా పైలం పిలకా.

రేటింగ్.. 3/5

No comments