హీరో సుహాస్ నటించిన గొర్రె పురాణం సినిమా ఇటీవల విడుదల అయి ప్రేక్షకులనుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దీనికి కారణం సుహాస్ ఈ సినిమా ప్రొమోషన్లో భాగం కానందున అని బయట టాక్ కూడా నడిచింది. ఇది అలా ఉండగా ఈ సినిమా లో కూడా సుహాస్ చాల సేపటివరకు కనిపించకపోవడం అని కూడా ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ రావడం కొంత ఆందోళనకరమైన విషయమే.
అయితే, సినిమా మొదటి రోజు టాక్ అంతగ రాకపోయినా రెండవరోజు నుండి థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడటం సినిమా యూనిట్ కి ఊరట కలిగించినట్టే. సాధారణంగా ఒక గొర్రె తో సినిమా తీయడం సాహసమనే చెపొచ్చు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి సన్నివేశం ప్రేక్షకులుని మెసమేరీజ్చేసే విష్యంలో మాత్రం డైరెక్టర్ బాబీ తన మార్క్ డైరెక్షన్ ని కనపర్చారు. ఇలాంటి కాన్సెప్ట్స్ బాలీవుడ్ లో ఎపుడు మనం చూస్తుంటాం. బాలీవుడ్ డైరెక్టర్ లు కంటెంట్ డ్రివెన్ సినిమాలు తీస్తూ ఎప్పుడు ప్రశంసలు అందుకుంటున్నట్లే మన తెలుగు సినీ పరిశ్రమ లో కూడా ఇలాంటి సినిమాలు రావడం చాల శుభసూచికం.
చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన గొర్రె పురాణం సినిమాకు సరైన పబ్లిసిటీ లేకపోయినా, హీరో సుహాస్ సపోర్ట్ ఇవ్వకపోయినా, ప్రేక్షకుల మౌత్ టాక్ తో దూసుకెళ్తుంది. త్వరలోనే బ్రేక్ ఈవెన్ మార్క్ ని క్రాస్ చేస్తుందని విమర్శకుల ఆశాభావం వ్యక్తం చేశారు.
గొర్రె పురాణం ఒక సోషల్ సెటైరికల్ మూవీ గా ప్రేక్షకులని అలరిస్తుంది. కచ్చితంగా ఇది థియేటర్ అందరు చూడదగ్గ సినిమా.
No comments