అమెరికాలో ఘనంగా ప్రారంభమైన ట్రెండ్ సెట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ నంబర్ 2 మూవీ


ట్రెండ్ సెట్ ఫిల్మ్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నంబర్ 2 సినిమా ప్రారంభోత్సవం అమెరికా వర్జీనియాలోని సాయిబాబా టెంపుల్ లో ఘనంగా జరిగింది. యువ కథానాయకుడు శివకుమార్ హీరోగా నందిని రాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రవికుమార్ నాసు దర్శకుడు. ఇంతకుముందు “అన్లోడ్ 2023” అనే హాలీవుడ్ చిత్రాన్ని తెరకెక్కించారు రవికుమార్ నాసు. 

పూజాకార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ మొత్తం అమెరికాలో చేస్తాము అని నిర్మాతలు తెలిపారు. 

థిల్లర్ జోనర్ లో తెరకెక్కే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వివరాలను, నటి నటులు, టెక్నీషియన్స్ పూర్తి వివరాలను త్వరలో తెలియచేస్తాము అనీ దర్శకుడు రవికుమార్ నాసు తెలిపారు.


హీరో: శివకుమార్ 
హీరోయిన్: నందిని రాయ్

నిర్మాణం: ట్రెండ్ సెట్ ఫిల్మ్స్
దర్శకుడు: రవికుమార్ నాసు
డి ఓ పి: సాయికిరణ్ అయినంపూడి
ఎడిటర్: అనిల్ కుమార్ యాదగిరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శ్రావణి మాదిరాజ్,మాధవి నాసు
లైన్ ప్రొడ్యూసర్: పద్మ వాయువేగుల, చైతన్య వర్మ

No comments