Home/News/31 సిటీల్లో ANR 100 ఫిల్మ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. నాన్నగారి మాస్టర్ పీస్ మూవీస్ ప్రింట్‌లు అద్భుతంగా వున్నాయి. ఆడియన్స్ కి ఇది వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్: ప్రెస్ మీట్ లో కింగ్ అక్కినేని నాగార్జున
31 సిటీల్లో ANR 100 ఫిల్మ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. నాన్నగారి మాస్టర్ పీస్ మూవీస్ ప్రింట్‌లు అద్భుతంగా వున్నాయి. ఆడియన్స్ కి ఇది వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్: ప్రెస్ మీట్ లో కింగ్ అక్కినేని నాగార్జున
-నటసామ్రాట్, పద్మవిభూషణ్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు గారి పోస్టల్ స్టాంప్ రిలీజ్
-మెగాస్టార్ చిరంజీవి గారికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారి చేతులు మీదగా ANR అవార్డ్- అక్టోబర్ 28న అవార్డు ప్రదానోత్సవం
- అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా 600 వందల మంది అభిమానులకు బట్టలు బహుకరించిన అక్కినేని ఫ్యామిలీ
నటసామ్రాట్, పద్మవిభూషణ్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ NFDC-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది. అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ANR ఐకానిక్ ఫిలిం 'దేవదాసు' స్క్రీనింగ్ తో ఈ ఫెస్టివల్ గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'దేవదాసు' (1953), 'మిస్సమ్మ' (1955) 'మాయాబజార్' (1957), 'భార్య భర్తలు' (1961), 'గుండమ్మ కథ' (1962), 'డాక్టర్ చక్రవర్తి' (1964), 'సుడిగుండాలు' (1968), 'ప్రేమ్ నగర్' (1971), 'ప్రేమాభిషేకం' (1981) 'మనం' (2014) సహా ANR ల్యాండ్‌మార్క్ మూవీస్ దేశవ్యాప్తంగా ప్రదర్శించనున్నారు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ 10 మాస్టర్ పీస్ మూవీ ప్రింట్‌లను 4Kలో పునరుద్ధరించడానికి చొరవ తీసుకున్నాయి. అద్భుతమైన క్యాలిటీలో ఈ క్లాసిక్స్ ని ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలని అక్కినేని కుటుంబం ఘనంగా నిర్వహించింది. అన్నపూర్ణ స్టూడియోస్ లోని అక్కినేని విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఇరు రాష్ట్రాలలోని అక్కినేని అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ కి తరలివచ్చి అక్కినేనికి అంజలి ఘటించారు. అక్కినేని కుటుంబ సభ్యులు అభిమానులతో కలిసి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా 600 వందల మంది అభిమానులకు బట్టలు బహుకరించారు.
ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాన్నగారు నవ్వుతూ మాకు జీవితాన్ని నేర్పించారు. అందుకే ఆయన పేరు తలచుకుంటే నవ్వుతూనే వుంటాం. శివేంద్ర గారికి థాంక్. దేవదాస్ తో పాటు మరికొన్ని సినిమాలు చూడబోతున్నారు. వాళ్ళు చేసిన బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అద్భుతంగా వున్నాయి. ఆడియన్స్ కి వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ వుంటుంది. 31 సిటీల్లో ఈ ఫెస్టివల్ చేస్తున్నారు. నార్త్ లో ఫాంటాస్టిక్ రెస్పాన్స్ వస్తుందని శివేంద్ర చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. గోవా ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నాన్న గారి పేరు మీద ఒక చాప్టర్ చేస్తున్నారు. ఈ విషయంలో చాలా హ్యాపీగా వుంది. పోస్ట్ మాస్టర్ జనరల్ బీఎస్ రెడ్డి గారికి థాంక్ యూ. ఈ శత జయంతి రోజున నాన్న గారి స్టాంప్ రిలీజ్ చేయడం చాలా అనందంగా వుంది. ఈ వేడుకకు వచ్చిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ సో మచ్. శత జయంతిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో ని నాన్న గారి సీనియర్ అభిమానులు రక్తదానం, అన్నదానం లాంటి మంచి కార్యక్రమలు చేశారు. వారందరికీ థాంక్ యు వెరీ మచ్. మీ ప్రేమ అభిమానం మర్చిపోలేనేది. ప్రతి రెండేళ్ళకు ఏఎన్ఆర్ అవార్డ్ ఇస్తున్నాం. ఈ ఏడాది ఏఎన్ఆర్ అవార్డ్ చిరంజీవి గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం చెప్పగానే చిరంజీవి గారు చాలా ఎమోషనల్ హాగ్ చేసుకొని ఏఎన్ఆర్ గారి శత జయంతి ఏడాదిలో ఇవ్వడం చాలా ఆనందంగా వుందని చెప్పారు. దీనికి కంటే పెద్ద అవార్డ్ లేదని అన్నారు. అమితాబ్ బచ్చన్ గారు ఆవార్డ్ ప్రధానం చేస్తారు. అక్టోబర్ 28 ఈ ఫంక్షన్ చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు' తెలిపారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ... అక్కినేని గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం కల్పించిన అక్కినేని కుటుంబం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి అక్కినేని గారి అభిమానిని. ఆయనతో కలసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. నాగేశ్వరరావు గారు గొప్ప అంకిత భావం కలిగిన నటులు. వారి బ్యానర్ లో నిర్మించిన తొలి సినిమాలో నేను నటించడం గొప్ప అదృష్టం. హైదరాబాద్ కి ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది. ఆయన మనతోనే వుంటారు. అందరికీ ధన్యవాదాలు' అన్నారు.
వెంకట్ అక్కినేని మాట్లాడుతూ.. నాన్న గారి శత జయంతి రోజున ప్రభుత్వం పోస్టల్ స్టాప్ రిలీజ్ చేసింది. బాపు గారు ఆ ఫోటో గీశారు. దాంట్లో నాన్నగారి లక్షణాలు అన్నీ కలగలిపి వుంటాయి. ఈ స్టాప్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు. క్యాబినెట్ మ ఇనిస్తర్ జ్యోతిరాదిత్య సింధియా, చంద్రశేఖర్ గారు ఈ రోజు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసి చేశారు. వారికి చాలా ధన్యవాదాలు' తెలిపారు.
శివేంద్ర సింగ్ దుంగార్పూర్ మాట్లాడుతూ.. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి, అక్కినేని కుటుంబానికి ధన్యవాదాలు. ఈ ఫెస్టివల్ ని దేశంలోని 31 సిటీస్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదొక హిస్టారికల్ డే. ఈ మూడు రోజుల్లో అక్కినేని గారి పది క్లాసిక్ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చూడబోతున్నారు. ఈ హెరిటేజ్ ని కాపాడుకుకోవడం మనందరి భాద్యత' అన్నారు
దర్శకుడు కె రాఘవేందర్ రావు మాట్లాడుతూ.. అక్కినేని, కోవెలమూడి కుటుంబాలు రెండు వేరువేరు కాదు. నాగేశ్వరరావు గారు, మా నాన్నగారు, నేను, నాగార్జున కలిసే ప్రయాణం చేశాం. నాగేశ్వరరావు గారు హైదరాబాద్ కి అన్నపూర్ణ స్టూడియోని తలమానికంగా ఇచ్చి వెళ్లారు. ఎంతోమందికి ఉపాధి కల్పించారు. దేవదాస్, కాళిదాస్, విప్రనారాయణ ఇలా ఎన్నో క్లాసిక్ సినిమాలు ఇచ్చారు. అలాంటి నటన, సినిమాలు మళ్ళీ చూడగలమా అన్నంత గొప్పగా చేసిన ఘటన నాగేశ్వరరావు గారిది. నాగేశ్వరరావు గారు ఎప్పుడూ మనతోనే వుంటారు. తండ్రి కొడుకులతో సినిమాలు చేసిన అదృష్టం నాకు దొరికింది. నాగేశ్వరరావు గారు ఎక్కడున్నా మనతోనే వుంటారు' అన్నారు.
జాయింట్ కలెక్టర్ సంజయ్ మాట్లాడుతూ..ఇండియన్ సినిమా లెజెండ్ ANR గారి ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం ఆనందంగా వుంది. ANR గారు జనరేషన్స్ కి స్ఫూర్తి. ఈ ఏడాది ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ANR గారి శత జయంతిని భారత ప్రభుత్వం తరపున సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ANR దీవెనలు అందరిపై వుంటాయి. ఈ వేడుకలో భాగం కావడం ఆనందంగా వుంది. అందరికీ ధన్యవాదాలు' అన్నారు.
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ.. అక్కినేని కుటుంబ సభ్యులకు, అభిమానులకు కృతజ్ఞతలు. నాగేశ్వరరావు గారు 1955లో లక్ష రూపాయిలు విరాళం ఇచ్చి గుడివాడలో కళాశాల కట్టించారు. అప్పుడు ఎకరం పొలం గుడివాడలో రెండు వేలు. అటువంటి రోజుల్లో ఆయన దగ్గర పాతిక వేలే వుంటే 75వేలు అప్పుతీసుకొని మొత్తం లక్ష ఇచ్చారు. 70 ఏళ్ల క్రితమే ఆయన జన్మభూమి కాన్సెప్ట్ అనుకుకొని ఊర్లో స్కూల్ కట్టించారు. అనేక విద్యాలయాలకు విరాళాలు ఇచ్చారు. ఎంతోమంది పేద విద్యార్ధులకు ఆర్ధిక సాయం చేశారు. బుడమేరు పై వంతెన కట్టించిన ఘనత ఆయనది. తను చేసిన సాయం గురించి ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు. అక్కినేని గారు మహా మనిషి' అన్నారు. అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్, సుమంత్, సుశాంత్, అమల అక్కినేని, నాగ సుశీల, సుప్రియా యార్లగడ్డతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగింది.
31 సిటీల్లో ANR 100 ఫిల్మ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. నాన్నగారి మాస్టర్ పీస్ మూవీస్ ప్రింట్‌లు అద్భుతంగా వున్నాయి. ఆడియన్స్ కి ఇది వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్: ప్రెస్ మీట్ లో కింగ్ అక్కినేని నాగార్జున
Reviewed by firstshowz
on
8:49 pm
Rating: 5
No comments