ప్రేమిస్తే కి 19 ఏళ్ళు (12 Oct 2005)
అన్నం ఉడికింద లేదా అని చెప్పడానికి ఒక్క మెతుకు చాలు. నిర్మాతగా మనం ఏంటో చెప్పడానికి ఒక సినిమా చాలు. అభిరుచి గల నిర్మాత విలువలు కలిగిన నిర్మాత అని మొదటి సినిమాకే నాకు పేరు తెచ్చిన సినిమా... సినిమా ఆర్ధికంగా హిట్ అయితే మరొక సినిమా చేయడానికి బలం అవుతుంది, కానీ అదే సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటే, మరెన్నో సినిమాలు తీయడానికి బలం అవుతుంది. అలా డిస్ట్రిబ్యూటర్గా ఉన్న నన్ను నిర్మాత చేసిన సినిమా, నిర్మాతగా కొనసాగేలా చేసిన సినిమా ప్రేమిస్తే... సినిమా వచ్చి నేటికీ 19 సంవత్సరాలు అయిన సందర్బంగా సినిమాలో నటించిన నటీ, నటులకు, పని చేసిన సాంకేతిక నిపుణులకు, ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు....
మరీ ముఖ్యంగా నన్ను ఎంతగానో ప్రోత్సహించిన "శంకర్ గారికి," అలాగే ఈ సినిమాకి నాతో పాటు ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్న మారుతీ గారికి, తరవాతి కాలంలో ఆయన ఎంత గొప్ప దర్శకుడు అయ్యాడో మన అందరికి తెలిసిందే. ఈ సందర్భంలో ఆయనకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు.అలాగే నన్ను ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎంతగానో ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు...
No comments