దక్షిణ మూవీ రివ్యూ & రేటింగ్

నటీనటులు:

సాయి ధన్సిక, రిషబ్ బసు, స్నేహ సింగ్, కరుణ,ఆర్నా ములెర్, మేఘన చౌదరి. మరియు నవీన్ తదితరులు  

సాంకేతిక నిపుణులు:

ఛాయాగ్రహణం : రామకృష్ణ (ఆర్.కె) సంగీతం : బాలాజీ
నిర్మాణ సంస్థ: కల్ట్ కాన్సెప్ట్స్
నిర్మాత : అశోక్ షిండే
 రచన - దర్శకత్వం : ఓషో తులసీరామ్.

తమిళ నటి.. ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక మంచి టాలెంటెడ్  కథనాయిక ముఖ్య పాత్రలో నటించిన సినిమా “దక్షిణ”. డైరెక్టర్ ఓషో తులసిరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

దక్షిణ (సాయి ధన్సిక) ఒక  పోలీస్ ఆఫీసర్. అయితే సిటీలో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఒకరి తర్వాత ఒకర్ని కిడ్నాప్ చేసి  అతి కిరాతకంగా తల నరికి చంపుతూ ఉంటాడు ఒక  సైకో. వాళ్ళ తలలను బ్యాగులో పెట్టుకుని తీసుకుపోతుంటాడు. అసలు ఆ సైకో ఎవరు ? అతను అతి దారుణంగా అమ్మాయిలను ఎందుకు చంపుతున్నాడు. , ఈ మధ్యలో ‘ఏసీపీ దక్షిణ’ జీవితంలో ఓ దారుణం జరుగుతుంది. ఆ దారుణం చేసిన సైకో పై దక్షిణ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది ?, ఈ క్రమంలో దక్షిణ ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ?, ఆ సైకో వాళ్ళ దక్షిణ జీవితంలో చోటు చేసుకున్న విషాదం ఏంటి? అసలు దక్షిణ ఎవరు? చివరికి ఆ సైకో దొరికాడా? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ క్రైమ్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించింది. ప్రధానంగా కొన్ని కీలక సన్నివేశాల్లో తన తన పర్ఫార్మెన్స్‌తో సాయి ధన్సిక ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసింది. మరో ప్రధాన పాత్రలో నటించిన రిషవ్ బసు కూడా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రిషవ్ బసు నటన చాలా బాగుంది.

ఇక సాయి ధన్సిక క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే ఉంది. అదేవిధంగా దర్శకుడు ఓషో తులసీరామ్ అమ్మాయిల హత్యల చుట్టూ అనేక కోణాల్లో సినిమాని నడిపిన విధానం కొన్ని చోట్ల బాగుంది. సుభాష్, ఆనంద భారతి తదితరులతో పాటు ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అన్నట్టు ‘సినిమా మొదటి సన్నివేశం’ సినిమా పై ఆసక్తిని పెంచింది.

ఒక ఏసీపీ పై ఒక సైకో కిల్లర్ తేలిగ్గా అఘాయిత్యం ఎలా చేయగలడు ?, సినిమా మొత్తం ఈ పాయింట్ చుట్టే తిరిగింది, ప్రేక్షకులు నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఆత్రుతతో సినిమాను చూస్తారు.  ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది, ఊహించని మలుపులు సినిమాలో ఉన్నాయి,  ఇక సెకండాఫ్ ని డైరెక్టర్ ఎమోషనల్ గా నడిపించిన విధానం చాలా బాగుంది, దర్శకుడు ఓషో తులసీరామ్ మంచి ప్రయత్నం చేశాడు. తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుంది.

రేటింగ్: 3/5

No comments