70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం(తెలుగు)గా 'కార్తికేయ 2' జాతీయ అవార్డ్ గెలుపొందిన సంగతి తెలిసిందే.
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'కార్తికేయ2' ఎపిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 2022కి గానూ ఉత్తమ ప్రాంతీయ చిత్రం(తెలుగు)గా నేషనల్ అవార్డ్ గెలుచుకుంది.
నేడు ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కార్తికేయ 2 డైరెక్టర్ చందూమొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డును స్వీకరించారు.
ఉత్తమ ప్రాంతీయ చిత్రం కార్తికేయ 2: నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ చందూమొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్
Reviewed by firstshowz
on
9:48 pm
Rating: 5
Post Comment
No comments