ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఫ్రీ హెల్త్ క్యాంప్

హైదరాబాదులోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...

ఆదివారం నాడు హైదరాబాద్ ఫిలింనగర్ సెంటర్లో మెంబర్లకు ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సిటీ న్యూరో సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అవసరమైన వారికి ఫ్రీ మెడికేషన్ కూడా అందించారు. ప్రముఖ న్యూరాలజిస్టులు, ఆర్థోపెడిషన్లు, పలమనాలజిస్టులు, గైనకాలజిస్ట్లు, కార్డియాలజిస్టులు, పర్మనాలజిస్టులతో పాటు డెంటల్, ఐ చెకప్స్ వంటివి కూడా నిర్వహించారు. 

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ మెంబర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ లో తమ ఆరోగ్య పరీక్షలు జరుపుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ సెక్రటరీ తుమ్మల రంగారావు, కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు.

No comments