'పాండురంగాపురం” చిత్రంతో హీరోగా పరిచయమవుతున్న శివకృష్ణ
ఎస్ ఎస్ కనెక్ట్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై షరీఫ్ షేక్ దర్శకత్వంలో షరీఫ్ ఎస్.కె. నిర్మిస్తున్న చిత్రం పాండు రంగాపురం”. 'పాతకథి” అనేది ట్యాగ్‌లైన్. తెలుగు, హిందీ, కన్చడ, తమిళ్, మలయాళం భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం సారధి స్టూడియోలో చిత్ర యూనిట్ సభ్యుల మధ్య ప్రారంభమైంది.
ఈ సందర్భంగా దర్శకులు షరీఫ్ షేక్ మాట్లాడుతూ.. “మా 'పాండురంగాపురం” చిత్రం హర్రర్, కామెడీ, లవ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.
అద్భుతమైన కథ, కథనాలతో అందరికీ నచ్చే పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నాము. మా నిర్మాత మంచి అభిరుచి వున్న నిర్మాత.. అద్భుతమైన చిత్రంగా మీ ముందుకు వస్తాము” అని అన్నారు.
హీరో శివకృష్ణ మాట్లాడుతూ.. “నా తొలి చిత్రంతోనే ఇలాంటి కాన్సెప్ట్‌తో మీ ముందుకు రావడం చాలా ఆనందంగా వుంది. కథ, కథనాలు చాలా అద్భుతంగా వున్నాయి. ఎన్నో రోజులు ఈ కథ మీద వర్క్ శ్రా క్రూ దర్శకులు అద్భుతమైన పాన్ ఇండియా చిత్రంగా.. అన్ని హంగులు ఈ చిత్రంలో వుండేవిధంగా కథను తయారు చేశాడు. ఈ చిత్రంతో మా యూనిట్‌తో పాటు హీరోగా నాకు కూడా మంచి లైఫ్ ఇచ్చే చిత్రంగా నిలుస్తుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం” అని అన్నారు.
ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ : కుమార్, మేనేజర్ : గోపి, అసోసియేట్ డైరెక్టర్స్ : యం.సూర్య, సి.హెచ్. చరణ్, కె. వడ్డేటి, పి.ఆర్.ఒ. : బాబు నాయక్, ఎడిటర్ : సామ్రాట్, పబ్లిసిటీ డిజైనర్ : బి. ప్రసాద్, కొ-డైరెక్టర్ : గోవింద్, సంగీతం : పద్మనాభ్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ : క్రిష్
బొంగోని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పబ్బిలేటి శివ, కొ-ప్రొడ్యూసర్ : గడ్డం వేణుగోపాల్, నిర్మాత : షరీఫ్ ఎస్‌కె, కధ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం : షరీఫ్ షేక్.
No comments