'రహస్యం ఇదం జగత్‌' నుంచి జగమే విధిగా అనే లిరికల్‌ సాంగ్‌ విడుదల

ఇటీవల తమ ప్రమోషన్‌ కంటెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్స్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నేటి తరం ప్రేక్షకులను అలరించే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వున్నాయని ఈ చిత్రం ప్రమోషన్‌ కంటెంట్‌ చూస్తే అర్థమవుతోంది. మన పురాణాలు, ఇతిహాసాల గురించి... శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించడానికి రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. నవంబరు 8న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను అమెరికాలోని డల్లాస్‌లో విడుదల చేశారు. 

ఆ టీజర్‌కు అందరి నుంచి మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఈ జగమే విధిగా అనే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్‌. గ్యాని సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటను హారిక నారాయణ్‌ అండ్‌ గ్యానీ ఆలపించారు. రమేష్‌ కుమార్‌ వక్కచర్ల సాహిత్యం అందించారు. చూడగానే ఆకట్టుకునే విజువల్స్‌తో, క్యాచీ లిరిక్స్‌, ట్యూన్‌తో అందర్ని ఈ పాట అలరిస్తోంది. నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ సైన్స్‌ ఫిక్షన్‌కు మైథాలాజికల్‌ అంశాలు జోడించి నేటి తరం ప్రేక్షకులను మెప్పు పొందే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ప్రమోషన్‌ల్‌ కంటెంట్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ గ్లింప్స్‌కు, టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా మన శ్రీచక్రం, శ్రీ యంత్రం, మన చారిత్రాత్మక చరిత్ర గురించి చెబుతున్న పాయింట్‌ ఈ చిత్రం పట్ల అందరిలోనూ ఆసక్తిని పెంచింది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఆడియన్స్‌ ఇంట్రెస్ట్‌ కలిగించే అంశాలతో పాటు స్టనింగ్‌ వుండే విజువల్స్‌ కూడా ఈ చిత్రంలో వుంటాయి. తప్పకుండా ఈ చిత్రం అందర్ని సర్‌ఫ్రైజ్‌ చేస్తుంది. నవంబరు 8న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అన్నారు. 

తారాగణం: రాకేష్ గలేభే, స్రవంతి ప్రత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ కందాల, శివ కుమార్ జూటూరి, ఆది నాయుడు, ఏబెల్ కోసెంటినో, టామ్ అవిలా, లాస్య రవినూతుల. 

కోమల్ ఆర్ భరద్వాజ్: రచన & దర్శకత్వం 
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: టేలర్ బ్లూమెల్ 
సంగీతం: గ్యాని 
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్ 
రచయిత: రవితేజ నిట్ట 
డైరెక్షన్ టీమ్: వరుణ్ వేగినాటి, రవితేజ నిట్టా, భార్గవ్ గోపీనాథం, నవ్య దీపికా భత్తుల, ఆశిష్ చైతన్య, అనీషా క్రోతపల్లి
బ్యానర్: సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్ 
నిర్మాతలు: పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల 
ప్రొడక్షన్ డిజైనర్: జెఫ్రీ స్టిల్వెల్ 
సినిమాటోగ్రఫీ బృందం: టేలర్ స్టంప్, మైఖేల్ వీస్, డామియన్ బైంగ్టన్, జెస్సీ బర్రిల్, నిక్ గ్రిల్, , పాట్రిక్ బ్లెవిన్స్, లోగాన్ రేనాల్డ్స్. 
హెయిర్ & మేకప్: ఎరిన్ లియోన్, ట్రిస్టా కెల్లీ, ఎలెన్ మక్ర్ట్చ్యాన్
సౌండ్ రికార్డింగ్: నికోలస్ డెకర్, ట్రాయ్ మిచెయు 
కాస్ట్యూమ్ డిజైనర్: అనురాధ సాగి 
VFX కంపెనీ/సూపర్‌వైజర్: హ్యూ పిక్చర్స్/హేమంత్ వుండేమొదలు 
యానిమేషన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్: డి స్క్వేర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్/విజయ్ సాగర్ అన్నారపు 
లేబుల్: డివో మ్యూజిక్
పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు

No comments