కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్

బ్లూ హారిజన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు హారిక జెట్టి, బొట్టు మల్లేష్ గౌడ్, పిట్ల విజయలక్ష్మి నిర్మాణ సారధ్యంలో ప్రవీణ్ జెట్టి గారి దర్శకత్వంలో కల్లు కాంపౌండ్ 1995 చిత్రం తాజాగా విడులైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో చూద్దాం.

క‌థ‌:

కథానాయకుడు రాజు (గణేష్) గ్రామంలో జన్మించి విద్యావంతుడై గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటాడు. అయితే, గ్రామాన్ని ఆర్థిక, రాజకీయ శక్తులతో కబళిస్తున్న ప్రతాప్ గౌడ్ (ప్రవీణ్) అనే క‌ల్లు తాగుబోతుల నాయకుడి అరాచకాలను తట్టుకోలేక, రాజు శాంతి మార్గం వదిలి హింసను ఎంచుకోవాలనుకుంటాడు. అయితే, కథానాయిక మల్లేశ్వరి (అయేషీ పటేల్) సలహా మేరకు సామాజిక సేవతో గ్రామ ప్రజలలో నమ్మకం కల్పించడం, వారి ఆత్మనిర్భరత పెంపొందించడం ద్వారా మార్గం చూపాలనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే సినిమా క‌థ‌. 

1995 సంవత్సరంలో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది ఈ సినిమా. ప్రస్తుతం తెలంగాణగా ఉన్న ఈ ప్రాంతంలో అప్పట్లో మద్య నిషేధం ఉండేది. క‌ల్లు తాగుబోతులు మాత్రమే నాటి గ్రామాల్లో ఎక్కువగా ఉండేవారు, అలాగే నక్సలిజం కూడా విస్తరించింది. ఆ నేప‌థ్యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు.

సినిమాలోని ప్రధాన అంశాలు:

- గ్రామీణ సమస్యలు, మద్య నిషేధం, రాజకీయ జోక్యం, సామాజిక మార్పు.

- ఇంద్రజాలంలా ఆకట్టుకునే పోరాట సన్నివేశాలు, భావోద్వేగ పాట‌లు.

నటీనటుల ప్ర‌తిభ‌:

-గణేష్: కథానాయకుడు రాజుగా నటించి మెప్పించాడు. ఇది అతని 10వ సినిమా. 

-అయేషీ పటేల్: కథానాయిక మల్లేశ్వరి పాత్రలో ఆకట్టుకుంది.

-ప్రవీణ్: ప్రతాప్ గౌడ్ పాత్రలో ప్రతినాయకుడిగా అద్భుతంగా నటించాడు.

- జీవా, పోసాని కృష్ణ మురళి వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు.

మొత్తం 5 మెలోడీ పాటలు, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు, ఫ్యామిలీ, యాక్షన్ అంశాలతో మిళితమై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

విశ్లేష‌ణ‌: 

ఇది సెంటిమెంట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఈ సినిమాలో తల్లి కూతురు, తల్లి కొడుకు, అన్నా చెల్లెలు, భార్య భర్త వీళ్ళ రిలేషన్ గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రవీణ్ జెట్టి మంచి సీన్స్ క్రియేట్ చేశారు. సొసైటీ బాగుపడటం కోసం ఈ సినిమాలో యూత్ కి ఓ మెసేజ్ ఒక మంచి మెసేజ్ ఉంది. సినిమాలో కుల వివక్ష మీద చక్కటి సన్నివేశాలు దర్శకులు ప్రవీణ్ జెట్టి చిత్రీకరించారు. ఈ సినిమాలో నాలుగు పాటలు ఉండగా దాంట్లో ఒక ఐటెం సాంగ్ ఒక టైటిల్ సాంగ్ హీరోయిన్ మీద రెండు సాంగ్స్ ఉన్నాయి. వీటికి సంగీతం శ్రీ సాయి శ్రీనివాస్ అందించగా డాన్స్ మాస్టర్ గా కరియానందా, అలాగే ఫైట్ మాస్టర్ గా వైలెంట్ వేలు వర్క్ చేశారు. రైతులు ఏవిధంగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని కూడా చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టుగా ప్రవీణ్ చూపించాడు. ఈ చిత్రంలో కొన్ని సీన్స్ చూస్తుంటే కళ్ళు చెమ‌ర్చుతాయి. చక్కటి సెంటిమెంట్ సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అన్ని వయసులో వారు చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.

రేటింగ్: 3/5

No comments