కర్రి బాలాజీ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘డర్టీ లవ్ ‘
సమాజంలో పేరుకుపోతున్న ‘డర్టీ లవ్‘ ముసుగులో ప్రైవేట్ రూముల్లో శృంగారంతో, రేవ్ పార్టీల్లో విలాసాలతో , పబ్బుల్లో జల్సాలతో యువత మత్తులో ఎలా తూగుతున్నారో తెలిపే చిత్ర కథతో A2B ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ‘డర్టీ లవ్ ‘ చిత్రం రూపొందించనుంది. ఇంతకుముందు ‘అన్ స్టాపబుల్’ అనే నాన్ స్టాప్ కామెడీ ఎంటర్టైనర్ తీసిన నిర్మాత రంజిత్ రావు , తన తదుపరి చిత్రాన్ని ‘బ్యాక్ డోర్’ అనే సందేశ్మాతక చిత్రాన్ని తీసిన దర్శకుడు, నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో ‘డర్టీ లవ్ ‘ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ చిత్రానికి కొత్త కథానాయకుడు, నాయికల కోసం అన్వేషిస్తున్నారు. ప్రముఖ నటీ నటులు, సాంకేతిక నిపుణులుతో తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ త్వరలో మొదలవుతుంది.
No comments