మంచు లక్ష్మి “ఆదిపర్వం” చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి
రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటర్టైన్మెంట్స్ కలయికలో నిర్మించిన “ఆదిపర్వం” చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
1974 - 1990 మధ్య కాలంలో జరిగిన యధార్థ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అమ్మోరు అరుంధతి చిత్రాల తరహా ఈవిల్ పవర్ అండ్ డివోషనల్ పవర్ తో మధ్య జరిగే పవర్ ఫుల్ మూవీ ఈ మధ్యకాలంలో రాలేదని చెప్పాలి. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న ప్రేమకథ ఆదిపర్వం. గ్రాఫిక్స్ ప్రధానమైన చిత్రంగా మలిచారు దర్శకుడు సంజీవ్ మేగోటి. అలాగే హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా అలాగే ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ‘ఈ చిత్రం లో మంచులక్ష్మి ప్రసన్న ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బిగ్ బాస్ 8 లో తనదైన శైలిలో ఆట ఆడి, తెలుగు ప్రేక్షకులని అలరించిన ఆదిత్య ఓం గారు కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాతో ఆదిత్య ఓం గారు తన సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టారు.
మంచు లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని మంచు లక్ష్మి ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అలాగే ఇదే రోజున సినిమా ని నవంబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా 500 ధియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. అన్వికా ఆర్ట్స్ మరియు ఏఐ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థల సహకారంతో నేను అనుకున్న స్థాయిలో ఒక గొప్ప చిత్రాన్ని మలిచానన్న తృప్తి మిగులుతుందని, మంచులక్ష్మి, ఆదిత్య ఓం, శివ కంఠంనేని, అలాగే మరో మంచి పాత్రలో నటించిన ఎస్తేర్ పాత్రలకు జనం నీరాజనం పడతారని వాళ్ళ పెర్ఫామెన్స్ కూడా మెమొరబుల్గా ఉంటాయ’ని సంజీవ్ మేగోటి పేర్కోన్నారు.
ఈ చిత్రంలో మంచులక్ష్మి, ఆదిత్యఓం , ఎస్తేర్ , సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠంనేని, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్ , సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి, హ్యారీ జోష్, జబర్దస్త్ గడ్డం నవీన్, యోగి కాత్రి , మధు నంబియార్, బీఎన్.శర్మ, బృంద, స్నేహ అజిత్,అయేషా, జ్యోతి, దేవి శ్రీ ప్రభు, శ్రావణి, గూఢా రామకృష్ణ, రాధాకృష్ణ తేలు, రవి రెడ్డి, లీలావతి, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీరామ్ మొదలగువారు ప్రధాన పాత్రలు పోషించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ “రెట్రో ఫీల్ తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా మొదలై కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆద్యంతం అలరించే చిత్రంగా రూపుదిద్దారు దర్శకులు సంజీవ్ మేగోటి చెప్పారు. ఫైట్స్ మరియు గ్రాఫిక్స్ చాలా ప్రశంసలందుకుంటాయని సహనిర్మాత గోరెంట శ్రావణి చెప్పారు.
విడుదల తేదీ : November 8th ,2024
సాంకేతిక వర్గం :
DOP : ఎస్ ఎన్ హరీష్.
మ్యూజిక్ : మాధవి సైబ, ఓపెన్ బననా ప్రవీణ్, సంజీవ్, బీ. సుల్తాన్ వలి, లుబెక్ లీ, రామ్ సుధీ (సుధీంద్ర)
సాహిత్యం: సాగర నారాయణ, రాజాపురం శ్రీధర్ రెడ్డి, రాజ్ కుమార్ సిరా, ఊటుకూరు రంగారావు
ఎడిటింగ్ : పవన్ శేఖర్ పసుపులేటి
ఫైట్స్ : నటరాజ్
పి.ఆర్.ఓ : మూర్తి
డిజిటల్ పి.ఆర్ : కడలి రాంబాబు, దయ్యాల అశోక్
కోరియోగ్రఫీ : సన్ రేస్ మాస్టర్
ఆర్ట్ డైరెక్టర్ : కే. వీ. రమణ
ప్రొడక్షన్ మేనేజర్స్: బిజువేముల రాజశేఖర్ రెడ్డి, కొల్లా గంగాధర్, కంభం ప్రకాష్ రెడ్డి.
కో డైరెక్టర్ : సిరిమల్ల అక్షయ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఘంటా శ్రీనివాస్ రావు
సహ నిర్మాతలు: గోరెంట శ్రావణి, రవి మొదలవలస, ప్రదీప్ కాటకూటి, రవి దశిక, శ్రీ రామ్ వేగరాజు
నిర్మాణం: అన్వికా ఆర్ట్స్ మరియు AI (అమెరికా ఇండియా) ఎంటర్టైన్మెంట్స్
రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సంజీవ్ మేగోటి
No comments