విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ 'మెకానిక్ రాకీ' యాక్షన్ ప్యాక్డ్ హ్యుమరస్ ట్రైలర్ 1.0 లాంచ్
- 'మెకానిక్ రాకీ' ఎడ్జ్ అఫ్ ది సీట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. రెండోసారి చూసే రేంజ్ లో ఉంటుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ 'మెకానిక్ రాకీ' ఫస్ట్ గేర్, సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈ రోజు 'మెకానిక్ రాకీ' ట్రైలర్ 1.0 లాంచ్ చేశారు. శ్రీరాములు థియేటర్లో భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
ట్రైలర్ మెయిన్ క్యారెక్టర్స్ పరిచయం చేస్తూ సినిమా యాక్షన్ ప్యాక్డ్ హ్యామరస్ గా వుంటుందని ప్రామిస్ చేసింది. రాకీ చదువులో ఫెయిల్ అయిన తర్వాత, తన తండ్రి మెకానిక్ షాప్ ని టేకోవర్ చేసుకొని, లేడిస్ కోసం డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభిస్తాడు. హీరోయిన్స్ పాత్రలు పోషించిన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ లని ఫ్లర్ట్ చేస్తాడు. పవర్ ఫుల్ మ్యాన్ సునీల్ తో తలపడటం క్యురియాసిటీని పెంచింది.
ట్రైలర్ లో యాక్షన్, హ్యుమర్, రొమాన్స్, మాస్ అన్నీ ఎలిమెంట్స్ అద్భుతంగా వున్నాయి. డైలాగులు ప్రేక్షకులను అలరించాయి. రవితేజ ముళ్లపూడి తన డైరెక్షన్‌తో ఆకట్టుకున్నాడు. విశ్వక్ సేన్ హ్యుమర్, చరిష్మా తో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేశాడు. మీనాక్షి చౌదరి క్లాసిక్, ట్రెడిషినల్ గా పాత్రలో మెరిసింది. శ్రద్ధా శ్రీనాథ్ మోడరన్ అమ్మాయి పాత్రను పోషించింది. నరేష్, వైవా హర్ష కామెడీ రిలీఫ్‌ను అందించగా, సునీల్ మెయిన్ విలన్ గా చిల్లింగ్ ఇంప్రెషన్‌ని కలిగించాడు.
మనోజ్ కటసాని స్టైలిష్ విజువల్స్, జేక్స్ బెజోయ్ ఎనర్జిటిక్ స్కోర్ ఎక్స్ పీరియన్స్ మరింతగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రానికి అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. ఈ ట్రైలర్ 1.0 రాకీ మాస్ అప్పీల్‌ను ఇంపాక్ట్ ఫుల్ గా ప్రజెంట్ చేసింది. నవంబర్ 22న విడుదల కానున్న సినిమాపై భారీ అంచనాలు పెంచింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితిలో ఏడాదికి మూడు సినిమాలు రిలీజ్ చేయడం చాలా తక్కువ మందికి కుదురుతుంది. ఇంతదూరం వచ్చానంటే ఈ జర్నీలో ఇద్దరే వున్నారు. ఒకటి నేను, రెండు మీరు. నన్ను ఇక్కడివరకూ తీసుకొచ్చింది మీ అభిమానమే. నవంబర్ 22 సినిమా రిలీజ్. సినిమా మొన్న చూసుకున్న . చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను. నవంబర్ 21, 7.30కి పెయిడ్ ప్రిమియర్స్ వేస్తాం. యూఎస్ షో కంటే ముందే చుసుకుకోండి. అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నా. సినిమా ఎడ్జ్ అఫ్ ది సీట్ ఎక్స్ పీరియన్స్ చేస్తారు. రెండోసారి సినిమా చూసే రేంజ్ లో వుంది.సెకండ్ హాఫ్ థియేటర్స్ అన్నీ అడిటోరియమ్ లా మారిపోతాయి. ఇది ట్రైలర్ 1.0. రిలీజ్ దగ్గరలో మరో ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఆ ట్రైలర్ కి ట్రైలర్ అనుకోండి. నిర్మాత రామ్ గారు చాలా సపోర్ట్ గా నిలిచారు. ఈ సినిమాలో ఆయనకి చాలా డబ్బులు రావాలి. శ్రద్ధ వండర్ ఫుల్ కో స్టార్. మీనాక్షి కి థాంక్ యూ సో మచ్. మా కెమిస్ట్రీని చాలా ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్ రవి థాంక్ యూ సో మచ్. జేమ్స్ బిజోయ్ బీజీఎం ఇరగదీశాడు. టీంలో పని చేసిన అందరికీ థాంక్ యూ. ఫ్యాన్స్ అందరికీ లవ్ యూ సో మచ్. నవంబర్ 22న థియేటర్స్ లో కలుద్దాం' అన్నారు.
హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ మాట్లాడుతూ.. అందరికీ థాంక్ యూ. మీ అందరీ ఎనర్జీ చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది. నవంబర్ 22న థియేటర్స్ లో కలుద్దాం.
డైరెక్టర్ రవితేజ మాట్లాడుతూ.. విశ్వక్ గారి అభిమానులకి, మీడియా వారికి అందరికీ థాంక్ యూ. ట్రైలర్ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా కంటెంట్ వుంది. ఒకొక్కటి అనౌన్స్ చేస్తూ వుంటాం. అవన్నీ మీకు చాలా ఎక్సయిటింగ్ గా ఉంటాయని ఆశిస్తున్నాను. నవంబర్ 22న సినిమా విడుదలౌతుంది. అందరూ చూసి పెద్ద హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను.' అన్నారు
నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. హలో ఎవ్రీ వన్. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. సినిమా కూడా మాస్ కా దాస్ రేంజ్ లో ఉటుంది. నవంబర్ 22 థియేటర్స్ లో మాస్ జాతర వుంటుంది. అందరూ థియేటర్స్ కి వచ్చి చూసి ఎంజాయ్ చేయండి' అన్నారు
నటీనటులు: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, సునీల్, వైవ హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
నిర్మాత: రామ్ తాళ్లూరి
ప్రొడక్షన్ బ్యానర్: SRT ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మనోజ్ కటసాని
ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం
ఎడిటర్: అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె
పీఆర్వో: వంశీ-శేఖర్
No comments