మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ 'విశ్వంభర'- ప్రేక్షకులని మెగా మాస్ బియాండ్ యూనివర్స్ లోకి తీసుకెళ్ళిన విజువల్లీ స్టన్నింగ్ టీజర్

మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ 'విశ్వంభర'. తన డెబ్యు మూవీ బింబిసారతో బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు వశిష్ట 'విశ్వంభర' ను అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు. 

సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది. మేకర్స్ ప్రామిస్ చేసినట్లుగా, దసరా సందర్భంగా మోస్ట్ అవైటెడ్ విశ్వంభర టీజర్ లాంచ్ చేశారు.


విజువల్ స్టన్నింగ్ టీజర్, మూవీ ప్రిమైజ్ ని ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకులని మెగా మాస్ బియాండ్ యూనివర్స్ లోకి తీసుకెళ్ళింది. మిస్టికల్ ల్యాండ్ స్కేప్ లో చేపల ఆకారంలో ఉన్న పక్షులు ఆకాశంలో ఎగురుతూ, గర్జించే ఖడ్గమృగాలు, ఎగిరే గుర్రాలని విజువల్ వండర్ గా ప్రజెంట్ చేస్తూ టీజర్ ఓపెన్ అయింది. ఒక దుష్ట శక్తి ఈ రాజ్యంలో అరాచకం సృష్టిస్తుంది.  

''విశ్వాన్ని అలుముకొన్న ఈ చీక‌టి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాద‌ని కాదు..ప్రశ్నలు పుట్టించిన కాల‌మే స‌మాధానాన్ని కూడా సృష్టిస్తుంది. విర్రవీగుతున్న ఈ అరాచ‌కానికి ముగింపు ప‌లికే మ‌హాయుద్ధాన్ని తీసుకొస్తుంది” అనే పవర్ ఫుల్ వాయిస్ తో టీజ‌ర్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. 

ఈ చీకటిని అంతం చేయడానికి మునుపెన్నడూ లేనివిధంగా ఒక లెజెండ్ వస్తారు. మెగాస్టార్ చిరంజీవి ఎగిరే గుర్రాన్ని స్వారీ చేస్తూ సూపర్ హీరోలా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం అద్భుతమనిపించింది. టీజర్‌ చిరంజీవి బ్రెత్ టేకింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రజెంట్ చేసింది. హనుమంతుని విగ్రహం తనికి మార్గనిర్దేశం చేసే డివైన్ పవర్ ని సూచిచింది.  

డైరెక్టర్ వశిష్ట మునుపెన్నడూ చూడని అద్భుతమైన ప్రపంచాన్ని సృస్టించాడు. టీజర్ లో ప్రిమైజ్, నెరేటివ్ కట్టిపడేసింది. యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా వున్నాయి. చివరి పార్ట్స్, లార్డ్ హనుమాన్ విగ్రహం, చిరంజీవి పవర్ ఫుల్ యాక్షన్ గ్రిప్పింగ్‌గా కట్ చేసిన టీజర్‌కు పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చింది.

చిరంజీవి యంగ్ అండ్ చార్మింగ్ గా కనిపించారు. రీసెంట్ టైమ్స్ లో మెగాస్టార్‌ బెస్ట్ ట్రాన్స్ ఫర్మేషన్ ఇది. ఫాంటసీ అడ్వెంచర్‌కి తిరిగి వచ్చినప్పుడు స్త్రింగ్ స్క్రీన్ ప్రజెన్స్ కట్టిపడేసింది. యాక్షన్ సీక్వెన్స్‌లలో అదరగొట్టారు. 

యాంటీహీరో ముఖం చూపించనప్పటికీ, ఆ క్యారెక్టర్ బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్,ఆషికా రంగనాథ్ ప్రధాన కథానాయికలుగా నటిస్తుండగా, కునాల్ కపూర్ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. అయితే టీజర్‌లో ప్రధానంగా చిరంజీవి క్యారెక్టర్ ని పరిచయం చేశారు.

చోటా కె నాయుడు బ్రెత్ టేకింగ్ సినిమాటోగ్రఫీ ఒక కొత్త స్టాండర్డ్ ని సెట్ చేసింది, ఇమాజనరీ యూనివర్స్ ని విజువల్ వండర్ గా చూపించారు. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి అద్భుతమైన స్కోర్‌తో విజువల్స్‌ను ఎలివేట్ చేశారు. UV క్రియేషన్స్‌ నిర్మాతలు వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ప్రొడక్షన్ వాల్యూస్ గ్లోబల్ సినిమాని మ్యాచ్ చేశాయి. విక్రమ్‌రెడ్డి సమర్పిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్స్ కాగ, సుస్మిత కొణిదెల స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ అద్భుతమైన టీజర్‌ని చూసిన తర్వాత, విశ్వంభరను చూడాలనే ఎక్సయిట్మెంట్ ఆకాశాన్ని తాకింది. 

టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మెగా ఫ్యాన్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక సాంగ్ బ్యాలెన్స్ వుంది. అది త్వరలోనే చేస్తాం. చాలా బిగ్ స్కేల్ ఉన్న సినిమా ఇది. ప్రీప్రొడక్షన్ చాలా సమయం తీసుకొని చేశాం. చిరంజీవి గారితో వర్క్ చేయడం చాలా ఎక్సైటింగ్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ తోనే వర్క్ చేశాను. విశ్వంభర ప్రేక్షకులు, అభిమానులు అంచనాలు మించేలా ఉంటుంది'అన్నారు.   

నిర్మాత విక్రమ్ మాట్లాడుతూ.. అందరికీ హ్యాపీ దసరా. విశ్వంభర ఎప్పుడు వస్తే అప్పుడే పండగ. రామ్ చరణ్ కోసం దిల్ రాజు గారు అడగడంతో 'విశ్వంభర' విడుదల వాయిదా వేశాం. సినిమా షూటింగ్‌ కూడా అనుకున్న ప్రకారమే పూర్తయింది' అన్నారు.  

డిఓపి చోటా కె నాయుడు మాట్లాడుతూ.. మెగా బ్రదర్స్ అందరికీ హ్యాపీ విజయదశమి. ఈ టీజర్ గురించి వశిష్ట 10, 15 రోజులు నిద్రపోలేదు. గతంలో చిరంజీవిగారితో పని చేశాను. అప్పటికంటే ఇప్పుడు చాలా అందంగా వున్నారు. ఆయన లార్జర్ దెన్ లైఫ్ లో వున్నారు. టెక్నికల్ గా చాలా అడ్వాన్స్ గా వున్నారు. ఈ సినిమా గురించి చాలా అద్భుతమైన విషయాలు మీ అందరికీ చెప్పాలి. నెక్స్ట్ ఈవెంట్లో ఆ విషయాలన్నీ చెప్తాను'అన్నారు  

ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ మాట్లాడుతూ... అందరికీ హ్యాపీ దసరా. ఈ జోనర్ సినిమా చేయడం ఇదే నాకు ఫస్ట్ టైం. డైరెక్టర్ గారు స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పటి నుంచి చాలా హోం వర్క్ చేశాను. చాలా లార్జ్ స్కేల్ ఉన్న సినిమా ఇది. నెంబర్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి. చాలా కోసం చాలా ఎఫెర్ట్, హార్డ్ వర్క్ చేశాం'అన్నారు 

డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నేను చిరంజీవి అభిమానినని ఎప్పుడూ గర్వంగా చెప్పుకుంటాను. ఈ సినిమా టీజర్ అదిరిపోయింది. సినిమా ఎప్పుడు వస్తదా అని వెయిట్ చేస్తున్నా. ఈ సినిమా చిరంజీవి గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను' అన్నారు. 

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
సమర్పణ: విక్రమ్ రెడ్డి
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
డీవోపీ: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్స్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి
స్టైలిస్ట్: సుస్మిత కొణిదెల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

No comments