మైత్రీ మూవీ మేకర్స్, ఫణీంద్ర నర్సెట్టి, అనంతిక సనీల్‌కుమార్ '8 వసంతాలు' నుంచి క్యారెక్టర్ టీజర్ రిలీజ్
మోస్ట్ సక్సెస్ ఫుల్ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ స్టార్లతో హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను నిర్మించడమే కాకుండా కంటెంట్-రిచ్ మూవీలను రూపొందిస్తోంది. గోవా, ఖాట్మండు మోఫిల్మ్ ఫెస్టివల్స్ లో రెండుసార్లు ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుని విమర్శకుల ప్రశంసలు పొంది 'మను'తో దర్శకుడిగా డెబ్యు చేసి దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో కాన్సెప్ట్ బేస్డ్ మూవీ '8 వసంతాలు'ను నిర్మిస్తున్నారు. MAD ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ ఈ మూవీలో హీరోయన్. ఇందులో ఆమె శుద్ధి అయోధ్య పాత్రలో కనిపించనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో క్యూరియాసిటీని పెంచిన మేకర్స్ ఈరోజు శుద్ధి అయోధ్య క్యారెక్టర్ టీజర్‌ను విడుదల చేశారు.
ట్రైనింగ్ సెంటర్‌లో ఒక అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్‌ని సవాలు చేయడంతో టీజర్ ప్రారంభమైంది. ఆమె శుద్ధి అయోధ్య మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాల గురించి కాన్ఫిడెంట్ గా చెబుతుంది. అతనికి ధైర్యం ఉంటే తనతో ఫైట్ చేయమని ఛాలెంజ్ చేస్తుంది. శుద్ధి అయోధ్య ఒక మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలుగా పరిచయం అయ్యింది. సంతోషాలు, కన్నీళ్లు, విలువైన పాఠాలతో నిండిన మహిళ యొక్క ఎనిమిదేళ్ల ప్రయాణాన్ని ప్రజెంట్ చేస్తూ ఈ కథ ఉండబోతోంది.
ఫణీంద్ర నర్సెట్టి ఈ పాత్రను అద్భుతంగా రూపొందించారు, ఆమె ఎనిమిదేళ్ల కీలక దశలను హైలైట్ చేస్తూ ఆమె ప్రయాణాన్ని హార్ట్ ఫుల్ గా అందించారు. 19 ఏళ్ల నుంచి 27 ఏళ్ల వరకు ట్రాన్స్ఫర్ చెందే జర్నీని క్యాప్చర్ చేస్తూ అనంతిక సనీల్‌కుమార్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ఈ జర్నీ వ్యక్తులు, భావోద్వేగాలు, అనుభవాలను ఎక్స్ ఫ్లోర్ చేస్తోంది. షీ ఈజ్ పొయెట్రి ఇన్ మోషన్ అనే ట్యాగ్‌లైన్ కు టీజర్ యాప్ట్ అనిపించింది.
విశ్వనాథ్ రెడ్డి తన అద్భుతమైన సినిమాటోగ్రఫీ ద్వారా సినిమా ఎసెన్స్ ని ప్రజెంట్ చేశారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సోల్ ని కదిలించే స్కోర్ నెరేటివ్ కి డెప్త్ ని యాడ్ చేసింది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణ విలువలు టాప్ క్లాస్ గా వున్నాయి. ఈ చిత్రానికి అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైనర్, శశాంక్ మాలి ఎడిటర్, బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
8 వసంతాలు షూటింగ్ పూర్తి కావస్తున్నందున మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లతో రాబోతున్నారు
తారాగణం: అనంతిక సనీల్‌కుమార్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సీఈవో: చెర్రీ
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
డీఓపీ: విశ్వనాథ్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మ్యూల్
ఎడిటర్: శశాంక్ మాలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబాసాయి కుమార్ మామిడిపల్లి
యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
No comments