పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైన "పెన్ డ్రైవ్" మూవీ

శ్రీ కృష్ణ మూవీస్ బ్యానర్ పై కటకం వెంకటేశ్వర్లు సమర్పణలో విష్ణు వంశీ, రియా కపూర్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు ఎంఆర్ దీపక్ రూపొందిస్తున్న సినిమా "పెన్ డ్రైవ్". కె. రామకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బుజ్జి బొగ్గారపు సహ నిర్మాత. నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సమకాలీన కథా కథనాలతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ రోజు పలువురు సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సాయి కుమార్ క్లాప్ నివ్వగా...నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత కె రామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. 

ఈ సందర్భంగా

నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ:- అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. నిన్ననే కథ వినడం జరిగింది, చాలా బాగుంది. నా పాత్ర కూడా చాలా బాగా రాశారు. పేరు కూడా నాకు చాలా నచ్చింది. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, డైరెక్టర్ గారికి, హీరో హీరోయిన్‌లకు, నటించే మిగతా నటి నటులకు మంచి పేరు రావాలని, నిర్మాతకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను."

అతిథిగా వచ్చిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - దర్శకుడు ఎంఆర్ దీపక్ ఇండస్ట్రీలో అనుభవం ఉన్న వ్యక్తి. ఎన్నో సినిమాలకు అసోసియేట్, కో డైరెక్టర్ గా వర్క్ చేశారు. పెన్ డ్రైవ్ సినిమాను ఆయన ప్రేక్షకులు అందరికీ నచ్చేలా రూపొందిస్తారనే నమ్మకం ఉంది. ఇవాళ చిత్ర పరిశ్రమలో అయితే స్టార్స్ తో చేయాలి లేకుంటే కొత్త వాళ్లతో మూవీ చేయాలి. నూతన నటీనటులతో రూపొందిస్తున్న పెన్ డ్రైవ్ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఈ సినిమా రిలీజ్ టైమ్ లో మా వంతు సహకారం అందిస్తామని చెబుతున్నా. అన్నారు.

హీరో విష్ణు వంశీ మాట్లాడుతూ - దర్శకుడు ఎంఆర్ దీపక్ గారు చెప్పిన కథ విని చాలా ఇంప్రెస్ అయ్యాను. పెన్ డ్రైవ్ లాంటి మంచి మూవీలో హీరోగా నటించడం సంతోషంగా ఉంది. నేను లా చేశాను. సినిమాల మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చాను. పెన్ డ్రైవ్ మూవీతో హీరోగా నాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నా అన్నారు.

హీరోయిన్ రియా కపూర్ మాట్లాడుతూ - మాది కాన్పూర్. పలు హిందీ చిత్రాల్లో నటించాను. మోడలింగ్ చేస్తున్నాను. పెన్ డ్రైవ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుండటం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ దీపక్ గారికి, ప్రొడ్యూసర్ రామకృష్ణ గారికి థ్యాంక్స్ చెబుతున్నా అన్నారు.

నటుడు ఆజాద్ మాట్లాడుతూ - పెన్ డ్రైవ్ మూవీలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ లో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్స్. సినిమా చాలా బాగుంటుంది. మీ అందరి సపోర్ట్ దక్కాలని కోరుకుంటున్నా అన్నారు.

నిర్మాత కె రామకృష్ణ మాట్లాడుతూ - మా బ్యానర్ లో పెన్ డ్రైవ్ మూవీని ఈ రోజు లాంఛనంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. మా మూవీ ఓపెనింగ్ కు వచ్చిన గెస్ట్ లకు చాలా థ్యాంక్స్. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. మా బ్యానర్ లో మరిన్ని మంచి మూవీస్ నిర్మించాలని కోరుకుంటున్నాం అన్నారు.

దర్శకుడు ఎంఆర్ దీపక్ మాట్లాడుతూ - టెక్నాలజీ మనకు ఎంతగానో అందుబాటులోకి వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ కొందరు దుర్వినియోగం చేస్తూ క్రైమ్స్ కు పాల్పడుతున్నారు. టెక్నాలజీతో క్రైమ్స్ చేయడం సులువే కానీ తప్పించుకోవడం కష్టం. టెక్నాలజీని మంచికి ఉపయోగించాలనే మంచి సందేశాన్ని మా పెన్ డ్రైవ్ చిత్రంలో చెబుతున్నాం. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో ఉచితంగా వచ్చే దేనికీ ఆశపడకూడదు. అలా ఆశపడితే ఇబ్బందులు పడతారనే అంశాన్ని చూపిస్తున్నాం. ఈ నెల 22వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి నాలుగు షెడ్యూల్స్ లో సినిమా పూర్తి చేస్తాం. మా చిన్న చిత్రానికి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు.

నటీనటులు - విష్ణువంశీ, రియా కపూర్, రోషన్, ఆజాద్, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్స్ - కె సాదిక్
మేకప్ - బి. రాంబాబు
స్టిల్స్ - వెంకటేష్
పబ్లిసిటీ డిజైనర్ - శ్రీకాంత్
కాస్టింగ్ డైరెక్టర్ - రమేష్ బాబు దాసరి
కో డైరెక్టర్ - శ్రీనివాస్ రాయి
ప్రొడక్షన్ కంట్రోలర్ - రామ్ దగ్గుబాటి
ఆర్ట్ డైరెక్టర్ - సుమిత్ పటేల్
ఎడిటర్ - ప్రదీప్ జంబిగ
మ్యూజిక్ - వినోద్
సినిమాటోగ్రఫీ - విజయ్ టాగూర్
పీఆర్ఓ - సురేష్ కొండేటి
కో ప్రొడ్యూసర్ - బుజ్జి బొగ్గారపు
ప్రొడ్యూసర్ - కె రామకృష్ణ
రచన దర్శకత్వం - ఎంఆర్ దీపక్ (మర్కాపూర్)

No comments