ప్రకాష్ రాజ్ స్వార్ధపరుడు,పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర కోణం :ప్రకాష్ రాజ్ పై నిర్మాత నట్టి కుమార్ ఘాటు వ్యాఖ్యలు

గతంలో ఎన్నో సందర్భాలలో ఎన్నో ఘటనలలో స్పందించని నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు అనవసరంగా పవన్ కళ్యాణ్ తో ట్వీట్ల యుద్ధం చేస్తుండటం వెనుక స్వార్ధపూరిత ఎత్తుగడ గా కనిపిస్తోందని సీనియర్ నిర్మాత నట్టి కుమార్ .వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. 

"ఏ రోజు అయినా చిత్ర పరిశ్రమ కోసం, ప్రజల కోసం ప్రకాష్ రాజ్..ఏమన్నా చేశాడా!. కర్ణాటకకు చెందిన ప్రజ్వల్ రేవన్న అమానవీయ ఘటనల పైన ప్రకాష్ రాజ్ ఎందుకు స్పందించలేదు. రజనీకాంత్, విషయంలో ట్రోల్ల్స్ చేసినపుడు స్పందించని ప్రకాష్ రాజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ, ట్వీట్ల పైన ట్వీట్లు పెడుతూ, స్పందించడంలో ఏదో రాజకీయ కుట్రకోణం దాగివున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ పేరు చెప్పి ప్రకాష్ రాజ్ దేవుడిని అవమానిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం‌ మాట్లాడుతుంటే..అప్పటి నుంచే ఆయనంటే కొందరికి పడటం లేదు..పవన్ కల్యాణ్ కాలి గోటికి ప్రకాష్ రాజ్ సరిపోడు..

ఇదంతా డైవర్షన్ కోసం ప్రకాష్ రాజ్ చేస్తున్నట్టుంది. చిరంజీవి గారిని అవమానించినప్పుడు, ఐదు రూపాయల టికెట్ పెట్టినపుడు, ప్రకాష్ రాజ్ ఎందుకు జగన్ పై ట్వీట్ చేయలేదు. కేసీఆర్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిలను డ్రగ్స్ పేరుతో నిలబెట్టినపుడు ప్రకాష్ రాజ్ ఎందుకు ట్వీట్ చేయలేదు. అలాగే రేణు దేశాయ్ గారు ట్రోలింగ్ కు గురైనపుడు ఇండస్ట్రీ ఏమైంది, భువనేశ్వరి గారిపై అసభ్యంగా మాట్లాడినపుడు ఇండస్ట్రీ కానీ ప్రకాష్ రాజ్ కానీ ఏమయ్యారు. రజినీకాంత్ పై నీచంగా మాట్లాడితే ఇండస్ట్రీ ఖండన లేదే? అప్పుడంతా ప్రకాష్ రాజ్ ఏమి చేస్తున్నారు? జగన్, కేసిఆర్ అంటే మీకు భయమా. చిరంజీవి తల్లి అంజనా దేవి గారి పై పోసాని అసభ్యంగా మాట్లాడితే ఖండన ఏది. అప్పుడు ఉన్నది మీ ప్రభుత్వాలే అనే ఖండించలేదా! టీడీపీ, పవన్ కల్యాణ్ అధికారంలో ఉంటేనే ప్రకాష్ రాజ్ ట్వీట్ లు చేస్తారా. దీనిని బట్టి..ప్రకాష్ రాజ్ ఎంత స్వార్దపరుడో ఎవరికైనా ఇట్లే అర్ధమవుతుంది. ప్రకాష్ రాజ్ పొలిటికల్ గా వచ్చి పవన్ కల్యాణ్ ను ఎదుర్కోవాలి..అంతెకానీ ఇండస్ట్రీ ముసుగులో ట్వీట్స్ కరెక్ట్ కాదు." అని నట్టి కుమార్ అన్నారు.

మంత్రి కొండా సురేఖ గారి విషయంపై స్పందిస్తూ, "సమంత గురించి ఆమె మాట్లాడింది తప్పే‌‌ ..అందుకు ఆవిడ క్షమాపణ చెప్పారు అని అన్నారు. 

"జానీ మాస్టర్ పై పొక్సో కేసు ఉందని ఇండస్ట్రీ వాళ్లే మెయిల్ పెట్టడం వల్లే, జాతీయ అవార్డును ఆయనకు ఇవ్వకుండా రద్దు చేసినట్లు తెలుస్తోంది. నేషనల్ అవార్డ్ అనేది డాన్సర్స్ యూనియన్ కే గర్వకారణం. జానీ మాస్టర్ వ్యవహారంలో అసలు నిజాలు బయటకు వస్తాయి. అతనికి జరిగిన అన్యాయం పై డాన్సర్స్ యూనియన్ గట్టిగా మాట్లాడాలి..జానీతో పాటు ఆ అమ్మాయి కార్డ్ కూడా క్యాన్సిల్ చేయాలి. జానీ అవకాశాలు అమ్మాయి కి తరలించే ప్రయత్నం జరుగుతోంది. జానీ కుటుంబాన్ని రోడ్డున పడేయవద్దు..

నేషనల్ కమిటీకి డాన్సర్స్ మెయిల్ పెట్టండి. జానీ అవార్డ్ క్యాన్సిల్ అవ్వగానే.. బెయిల్ ను అతనే నిజాయితీగా క్యాన్సిల్ చేసుకున్నాడు.. జానీ విషయంలో సత్యమే గెలుస్తుంది" అని ఆయన అన్నారు.

"తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు అన్నీ సాక్షాలతో ప్రెస్ మీట్ పెట్టారు. గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వ హాయంలో అన్యాయం జరిగిందనేది వాస్తవం. దర్శనం టికెట్ లు సైతం బాహాటంగా బ్లాక్ లో అమ్ముకున్నారు. 

శేషాచలం అడవులను కొట్టెయటం వల్ల అడవి జంతువులు బయటకు వచ్చి, భక్తులపై దాడి చేశాయి.

చంద్రబాబు గారు ఇంకా వైసీపీ వారిపై ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవటం లేదని నేను అడుగుతున్నాను. 

జగన్ ను తిట్టండి.కానీ ఏసుప్రభువుపై కొందరు వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. పని చేసె వారికి నిజాయితీ పరులకు పదువులు ఇవ్వండి.. కాకా పట్టే వారికే ఇంకా పదువులు ఇస్తున్నారు.. ‌దీనికి గత ప్రభుత్వానికి మీకు తేడా ఏంటి.? అనే ప్రశ్న వస్తుంది. 

మరలా ఇసుక దందా లు మొదలవుతాయి. అందుకే లోకేష్ గారు దీనిపై దృష్టి పెట్టాలి. 

నారా లోకేష్ గారు ఫోన్ అందుబాటులో ఉన్నా..‌కొందరు ఎంఎల్ఎలు మాత్రం ఫోన్ లకు కూడా దొరకటం లేదు..
ప్రజల ప్రయోజనాల కోసం వెంటనే లోకేష్ రివ్యూలు చేస్తుంటే... కొందరు ఎంఎల్ఎ లు, అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు.

వీటిని చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ గారు సరిదిద్దాలి. 2029 లో లోకేష్ గారు సీఎం కావాలన్నది నా అభిప్రాయం" అని నట్టి కుమార్ అన్నారు.

No comments