'శంబాల' ఒక సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్
ప్రస్తుతం వాస్తవానికి దూరంగా మరో ప్రపంచంలో జరిగే కథలకు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి ఓ మిస్టిక్ వరల్డ్‌లో రూపొందుతున్న సినిమా 'శంబాల'. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు . తొలి పోస్టర్‌తోనే గతంలో ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయని ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి ఆడియన్స్‌ను తీసుకువెళ్లబోతున్నామన్న హింట్ ఇచ్చారు.
టైటిల్ పోస్టర్‌లో ఒక్క మనిషి కూడా లేని గ్రామం, ప్రళయానికి ముందు భీకరంగా ఉన్న ఆకాశం, మబ్బుల్లో ఓ రాక్షస ముఖం ఇవన్నీ చూస్తుంటే 'శంబాల' కథ లో వెన్నులో వణుకుపుట్టించే థ్రిల్స్ చాలానే ఉన్నట్టుగా అనిపిస్తోంది.
డిసిప్లిన్, డెడికేషన్ కు కేరాఫ్ గా నిలిచిన ఆది సాయికుమార్ ఈసారి జియో సైంటిస్ట్ గా ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో లక్కీ గర్ల్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్న ఆనంది ఈ సినిమా లో ఆదీకి జోడీగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా అతి త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది.
'ఏ' యాడ్ ఇన్‌ఫినిటిమ్ అనే డిఫరెంట్ మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యుగంధర్ ముని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తన తొలి సినిమా తరహాలోనే 'శంబాల'ను కూడా ఓ డిఫరెంట్ వరల్డ్‌లో డిఫరెంట్ టోన్‌లో రూపొందిస్తున్నారు యుగంధర్.
సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇండియన్ స్క్రీన్ మీద ఇంత వరకు టచ్ చేయని డిఫరెంట్ స్టోరీ లైన్‌ను చూపించబోతున్నారు. అమెరికాలోని న్యూయార్క్ ఫిలిం అకాడమీలో ఫిలిం మేకింగ్ ట్రైనింగ్ తీసుకున్న యుగంధర్, 'శంబాల' సినిమాను హాలీవుడ్ స్థాయిలో హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందిస్తున్నారు. ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనుకాడకుండా విజువల్స్ పరంగా, టెక్నికల్ గా సినిమాను "టాప్ క్లాస్"అనే రేంజ్‌లో తెరకెక్కించేందుకు అన్ని రకాలుగా సహకరింస్తున్నారు నిర్మాతలు రాజశేఖర్ అన్నభీమోజు , మహిధర్ రెడ్డి.
టెక్నికల్ సపోర్ట్ విషయంలోనూ హాలీవుడ్ రేంజ్ టెక్నీషియన్స్‌నే తీసుకున్నారు యుగంధర్. డ్యూన్, ఇన్సెప్షన్, బ్యాట్ మ్యాన్, డన్ కిర్క్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ అయిన హాన్స్ జిమ్మర్ లాంటి లెజెండరీ హాలీవుడ్ కంపోజర్స్‌తో కలిసి వర్క్ చేసిన ఇండియన్ మ్యూజీషియన్ శ్రీరామ్ మద్దూరి ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్స్ స్కోర్స్ విషయంలోనూ ఇంతకు ముందు ఏ సినిమాలో ఎక్స్‌పీరియన్స్ చేయని కొత్త సౌండింగ్‌ను ఈ సినిమాలో వినిపించబోతున్నారు.
No comments