దుబాయ్ లో యాంకరింగ్ చేసి అందరి ప్రశంసలు పొందిన యాంకర్ "స్వప్న చౌదరి అమ్మినేని"

ఈ నెల 5వ తేదీన దుబాయ్ గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ కల్చరల్ అసోసియేషన్ & లెవెల్ నెక్స్ట్ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబరాలలో తెలంగాణ బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత, సంస్కృతి ని తెలియ జెప్పి యాంకరింగ్ చేసింది స్వప్న చౌదరి అమ్మినేని.

అలానే మహిళలను ఉత్తేజ పరిచి, అక్కడ ఉన్న ఆడబిడ్డ లతో ఆడించి, బతుకమ్మ చప్పట్ల అక్కడున్న తెలుగు ప్రేక్షకులను ఉత్తేజ పరిచింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అథితి పర్యాటక శాఖ మాత్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మరియు అక్కడున్న తెలంగాణ వెల్ఫేర్ అధ్యక్షుడు జువ్వడి శ్రీనివాస్,డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ, ఆర్గనైజర్ ఉపాసన లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

యాంకర్ స్వప్న చౌదరి తిరిగి 9 తేదీ ఉదయం ఇండియాకు రానుంది. దుబాయ్ లో ప్రోగ్రాం విజయవంతం చేసి పలువురి ప్రశంసలు పొందినందుకు ఆమె అభిమానులు మరియు కళాకారులు ఖమ్మం జిల్లా ప్రజలు మరియు తన సొంత గ్రామమైన జగ్గారం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

No comments