ఘనంగా ''ది డీల్'' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 18న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన హను కోట్ల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ''ది డీల్''. ఈ చిత్రాన్ని సిటడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్ పై డాక్టర్ అనితరావు సమర్పణలో హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు. చందన, ధరణి ప్రియ హీరోయిన్స్ గా నటించారు. "ది డీల్ " సినిమా అక్టోబర్ 18న విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో

నిర్మాత బసిరెడ్డి మాట్లాడుతూ - "ది డీల్ " సినిమాను చూశాను. చాలా బాగుంది. నెక్ట్ సీన్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీతో మూవీ మొత్తం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా టీమ్ బాగా కష్టపడి పనిచేశారు. ఈ సినిమా విజయం సాధించి హనుకు, ఇతర టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ - ఈ మూవీ టీమ్ నాకు చాలా దగ్గరి వాళ్లు. "ది డీల్ " సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే ఆశిస్తున్నాను. నటీనటులు, టెక్నికల్ టీమ్ కష్టపడి వర్క్ చేశారు. సినిమా సక్సెస్ అయి అందరికీ మంచి గుర్తింపు తీసుకువస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.

సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ మాట్లాడుతూ - "ది డీల్ " సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. డైరెక్టర్ హను ఎంతో క్లారిటీతో సాంగ్స్ చేయించుకున్నారు. పాటలు బాగా కుదిరాయి. "ది డీల్ "మూవీలో మ్యూజిక్ ను బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

హీరోయిన్ చందన మాట్లాడుతూ - నాకు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని ఉండేది. కానీ హీరోయిన్ అవుతానని అనుకోలేదు. నా ఫస్ట్ మూవీలోనే ఇంత మంచి రోల్ ఇచ్చి హీరోయిన్ గా అడుగుపెట్టే అవకాశం కలిగించిన "ది డీల్ " టీమ్ కు, డైరెక్టర్ హను గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మా సినిమాకు మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నా. అన్నారు.

హీరోయిన్ ధరణి ప్రియ మాట్లాడుతూ - తీన్మార్ వార్తల్లో రాధగా మీ అందరి ఆదరణ పొందాను. నేను న్యూస్ ఛానెల్ లో ఉన్నప్పుడే "ది డీల్ " సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దువ్వాడ జగన్నాథం, నేల టిక్కెట్టు వంటి సినిమాల్లో నటించినా చిన్న చిన్న రోల్స్ చేశాను. ఇప్పుడీ మూవీలో హీరోయిన్ గా నటించడం హ్యాపీగా ఉంది. లక్ష్మీ క్యారెక్టర్ లో నటించాను. చాలా మంచి రోల్ ఇది. "ది డీల్ " సినిమాకు పెద్ద సక్సెస్ అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ - "ది డీల్ " సినిమా ఈ నెల 18న థియేటర్స్ లోకి వస్తోంది. మీ అందరి ఆదరణ పొందాలని కోరుకుంటున్నా. హను నాకు ఈశ్వర్ సినిమా నుంచి పరిచయం. ఇప్పటికి 22 ఏళ్లుగా మా ఫ్రెండ్షిప్ ఉంది. ఒక సినిమాను రూపొందించి రిలీజ్ కు తీసుకురావడం పెద్ద టాస్క్. ఆ విషయంలో టీమ్ సక్సెస్ అయ్యారు. థియేటర్ లో కూడా హనుతో పాటు మూవీ టీమ్ కు "ది డీల్ " సినిమా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

మూవీ ప్రెజెంటర్ డా.అనితారావు మాట్లాడుతూ - మా "ది డీల్ " సినిమాకు ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ బాగా సపోర్ట్ చేశారు. ఇది థ్రిల్లర్ సినిమా కాబట్టి వాళ్లతో షూటింగ్ కు ముందే బాగా డిస్కస్ చేసేవాళ్లం. మా టీమ్ లో ఏ ఒక్కరూ కూడా ఇంతగా చెబుతున్నారేంటి అని ఫీల్ కాలేదు. ఓపికగా విని వర్క్ చేశారు. హను గారికి హీరోగా, చందన, ధరణి కి హీరోయిన్స్ గా మంచి పేరొస్తుంది. "ది డీల్ " సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుంది. అన్నారు.

యాక్టర్ మహేశ్ పవన్ మాట్లాడుతూ - "ది డీల్ " సినిమాలో మంచి కంటెంట్ ఉంది. కంటెంట్ ఉన్న ప్రతి సినిమాను మన ప్రేక్షకులు ఆదరిస్తారు. స్టార్స్ ఉన్నారా లేరా అనేది చూడరు. స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్న "ది డీల్ " సినిమా కూడా మీ మెప్పు పొందుతుంది. హీరోగా హను కోట్ల కు మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో, దర్శకుడు హను కోట్ల మాట్లాడుతూ - ఈ రోజు మమ్మల్ని బ్లెస్ చేసేందుకు వచ్చిన బసి రెడ్డి గారికి, మిర్యాల రవీందర్ రెడ్డి గారికి థ్యాంక్స్. హీరో, దర్శకుడు కావాలనేది నా కల. ఆ కలను నెరవేర్చుకునే క్రమంలో "ది డీల్ " సినిమా రూపొందించి నటించాను. నేను ఈశ్వర్ సినిమాలో నటించాక మళ్లీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కోసమే అడిగారు. అయితే హీరో కావాలనే నా కల కోసమే ప్రయత్నించాను. మన జీవితం చిన్నది. అనుకున్నవి సాధించుకోవాలి. నాటకరంగంలో అనుభవం తెచ్చుకున్నాను. ఈటీవీ మాయాబజార్ సీరియల్ 150 ఎపిసోడ్స్ చేశాను. రిలయన్స్ కోసం, ఇతర ప్రముఖ కంపెనీలు, రేడియో కోసం ప్రోగ్రామ్స్ చేశాను. "ది డీల్ " సినిమాతో దర్శకుడిగా, హీరోగా మీ ముందుకు వస్తున్నాను. మంచి థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంటుంది. "ది డీల్ " సినిమాను మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు- డా.హను కోట్ల, చందన, ధరణి ప్రియ, రవి ప్రకాష్, మహేశ్ పవన్, గిరి, డా.వెంకట్ గొవడ, శ్రీ వాణి, సుజాత దీక్షిత్, సురభి లలిత, అంజి వల్గుమన్, సమీర్ దత్తా, తదితరులు

టెక్నికల్ టీమ్

డి. ఓ. పి - సురేంద్ర రెడ్డి 
సంగీత దర్శకుడు - ఆర్. ఆర్. ధృవన్: 
ఎడిటింగ్ - శ్రవణ్ కటికనేని, 
వి. ఎఫ్. ఎక్స్ - నవీన్
డి. ఐ - వినోద్ సాయి కుమార్ 
కొరియోగ్రఫీ - అనితారావు, 
అసిస్టెంట్ డైరెక్టర్ - వినయ్ కుమార్ కాటం, అదితి నాగ్ 
అసోసియేట్ డైరెక్టర్ - అరుణ్ / కిరంజీవి 
కో డైరెక్టర్ - శ్రీధర్ దీక్షిత్ 
పీఆర్వో - కృష్ణప్రసాద్
నిర్మాతలు - హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి 
దర్శకత్వం - డా. హను కోట్ల

No comments