పవర్ ఫుల్ స్టొరీ, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకుల మనసులని గెలిచి సక్సెస్ ఫుల్ గా 25 రోజులు పూర్తి చేసుకున్న అమరన్

ఉలగనాయకన్ కమల్ హాసన్ ప్రజెంట్ చేసిన 'అమరన్' సంచలన విజయం సాధించింది. విడుదలైన 25 రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుకుంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మేజర్ ముకుంద్ వరదరాజన్ పవర్ ఫుల్ కథను ప్రేమ, త్యాగం, దేశభక్తి ఎలిమెంట్స్ బ్లెండ్ చేస్తూ ప్రేక్షకులుకు గొప్ప అనుభూతిని పంచింది. ఎమోషనల్ కనెక్షన్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లతో ఈ సంవత్సరం అద్భుతమైన విజయాలలో ఒకటిగా నిలిచేలా చేసింది.

శివకార్తికేయన్, సాయి పల్లవి ల నటన అమరన్ విజయంలో కీలక పాత్ర పోషించింది, అన్ని వర్గాల నుండి అద్భుతమైన ప్రశంసలను పొందింది. ప్రేమగల కొడుకు, భర్త, తండ్రితో పాటు యుద్ధభూమిలో నాయకుడిగా ఉన్న సైనికుడు ముకుంద్‌ గా శివకార్తికేయన్ అద్భుతమైన నటన కనబరిచారు. ఈ పాత్రకు జీవం పోయడంలో అతని సామర్థ్యాన్ని ప్రేక్షకులు ప్రశంసించారు. అతని కెరీర్‌లో అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ లో ఒకటిగా నిలిచింది. మరోవైపు ముకుంద్ భార్య ఇంధు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి మరపురాని పాత్రను తెరపైకి తెచ్చారు. ఆమె స్త్రీ యొక్క నిశ్శబ్ద శక్తిని ప్రజెంట్ చేసింది. ఇందుకు పాత్రకు ప్రాణం పోసే సాయి పల్లవి అత్యుత్తమ నటన అందరినీ మెస్మరైజ్ చేసింది.  

అమరన్‌ ఎమోషనల్ స్టొరీ, హై-స్టేక్స్ యాక్షన్‌ను బ్యాలెన్స్ చేయగల అద్భుతమైన బిలిలిటీని విమర్శకులు, ప్రేక్షకులు అద్భుతమైన సమీక్షలతో ముంచెత్తారు. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి డైరెక్షన్ ని అప్రిషియేట్ చేశారు.  అద్భుతమైన సినిమాటోగ్రఫీ, జివి ప్రకాష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కథకు డెప్త్ జోడించి, ప్రేక్షకులకు నిజంగా మరపురాని సినిమాటిక్ అనుభూతిని కలిగించింది.

ఆర్మీ బయోపిక్‌లకు ఇది బెంచ్‌మార్క్‌ను ఎలా సెట్ చేస్తుందనేది అమరన్‌ని చూడటానికి ప్రత్యేకమైన కారణాలలో ఒకటి. ఈ చిత్రం ఒక సైనికుడి జీవితం త్యాగాలను అచంచలమైన నిజాయితీతో చిత్రీకరించడమే కాకుండా అతని కుటుంబం యొక్క భావోద్వేగ ప్రయాణాన్ని కూడా చిత్రీకరిస్తుంది. ఎమోషనల్ కోర్‌తో హై-ఆక్టేన్ యాక్షన్‌ని బ్యాలెన్స్ చేయడం ద్వారా, అమరన్ అలాంటి కథలను తెరపై ఎలా చెప్పవచ్చనే దాని కోసం ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది.  కశ్మీర్‌లోని రాష్ట్రీయ రైఫిల్స్‌లోని వాస్తవ స్థానాల్లో చిత్రీకరించాలనే టీం నిర్ణయాన్ని అభినందించాలి. ఇది కథకు సహజత్వాన్ని తీసుకొచ్చింది. వాస్తవికతను తీసుకురావడానికి టీం చాలా సవాళ్ళని ఎదురుకున్నారు. ఇది ఈ కథకు ప్రాణం పోయడంలో అమరన్ టీం అంకితభావం, కృషిని రిఫ్లెక్ట్ చేసింది.  

అమరన్ చిత్రాన్ని  తమిళనాడు ముఖ్యమంత్రి M.K స్టాలిన్ ప్రశంసించారు. రజనీకాంత్, సూర్య , జ్యోతిక అందరూ దాని టీంని మెచ్చుకున్నారు. దీని ప్రభావం దక్షిణ భారతదేశంలోని పాఠశాలలకు కూడా చేరుకుంది, ఇక్కడ NCC విద్యార్థుల కోసం ప్రత్యేక స్క్రీనింగ్‌లు నిర్వహించబడ్డాయి, దాని సాంస్కృతిక, విద్యా ప్రాముఖ్యతను మరింత నొక్కిచెబుతున్నాయి.

కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ మరియు సోనీ పిక్చర్స్ నిర్మించిన అమరన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించడమే కాకుండా థియేటర్ యజమానుల నుండి హై డిమాండ్ కారణంగా OTT విడుదల విండోను పొడిగించిన మొదటి తమిళ చిత్రంగా అరుదైన మైలురాయిని సాధించింది. ఇది అమరన్ కి వున్న అద్భుతమైన ప్రేక్షకాదరణని తెలియజేస్తోంది.

No comments