టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ నటించిన న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ 'జీబ్రా' బొమ్మ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్ గా నటించారు. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అన్ని చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
జీబ్రా బొమ్మ సూపర్ హిట్ సక్సెస్ మీట్ లో హీరో సత్య దేవ్ మాట్లాడుతూ.. ముందుగా డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ కి థాంక్యూ. ఈ సినిమాతో నన్ను రాటుతేలేలా చేశాడు. మనిషిగా ఈ సినిమాతో చాలా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యాను. అన్నయ్య చిరంజీవి గారు చెప్పినట్లు జీబ్రా బొమ్మ సూపర్ హిట్ అయింది. అన్నిటికీ అతీతంగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రీమియర్స్ నుంచి ఈ సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటికీ దాదాపు 25 షోలకి వెళ్లాను. ప్రతి చోట హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అన్నిటికీ అతీతంగా సినిమా ఆడుతుందని నమ్మకాన్ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు ఇచ్చారు. మా సినిమాకి 80% పాజిటివ్ ఉంది. 20% మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఈ 20% కి కూడా మరొకసారి చూడమని కోరుతున్నాను. సినిమాలో ప్రతి పాయింట్ కి ఒక లాజిక్ ఉంటది. ఒకవేళ మిస్ అయ్యింటే రెండోసారి చూసినప్పుడు కనెక్ట్ అవుతారని బావిస్తున్నాను. అయితే అన్నిటీకీ అతీతంగా హౌస్ ఫుల్ అవుతున్నాయి. అది నాకు గొప్ప కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈశ్వర్ కార్తీక్ ఐదేళ్లు కష్టపడి తెలుగు నేర్చుకుని తెలుగులో సినిమా చేయాలని ఈ సినిమా చేశారు. తమిళ్, కన్నడ లో కూడా సినిమా అద్భుతంగా ఆడుతుంది. ఈశ్వర్ భవిష్యత్తులో రజనీకాంత్, షారుక్ ఖాన్, అన్నయ్య చిరంజీవి గారి లాంటి పెద్ద హీరోలతో కూడా పనిచేస్తాడని నమ్మకం నాకుంది. తనకి ఆ కెపాసిటీ ఉంది. మా నిర్మాతలు బాల, దినేష్, ఎస్ ఎన్ రెడ్డి గారికి థాంక్ యూ. ఈ సినిమా సూపర్ హిట్ చేసి మమ్మల్ని గెలిపించిన ఆడియన్స్ కి థాంక్ యూ' అన్నారు.
డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. థియేటర్స్ లో ఆడియన్స్ రియాక్షన్స్ చూసాం. అందరూ సినిమాకి చాలా గొప్పగా కనెక్ట్ అవుతున్నారు. ఇంత సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. రవి బస్రూర్ ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాని ఎడిట్ చేయడం చాలా కష్టం. మా డైరెక్షన్ టీం తో పాటు ట్రావెల్ అవుతూ ఈ సినిమాని చాలా అద్భుతంగా ఎడిట్ చేశారు అనిల్. ఈ సినిమాలో పనిచేస్తున్న ప్రతి టెక్నికల్ టీం అందరికీ థాంక్యూ. జీబ్రా న్యూ ఏజ్ ఫిలిం. బ్యాంకింగ్ వరల్డ్ లో క్రై,మ్స్, అలాగే హ్యూమన్ ఎమోషన్ గురించి ఈ సినిమా ఉంటుంది. సినిమాని చాలా కొత్తగా ట్రై చేసాం. నేను తెలుగు నేర్చుకుని కథని ఎంత హానెస్ట్ గా చెప్పాలో అంత హానెస్ట్ గా ఈ సినిమాను తీయడం జరిగింది. ప్రతి క్యారెక్టర్ డైలాగ్ ని ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నాం. థియేటర్స్ లో జనాలు ప్రతి సీన్ ని ఎంజాయ్ చేస్తున్నారు . అది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాని థియేటర్లో చూడండి. చూసినవారు మిగతా వారికి చెప్పండి. రివ్యూ రైటర్స్ మాటలను కూడా పరిశీలనలోకి తీసుకుంటాను. ఈ సినిమాతో మా బ్రేవరీ ని చూపించామను. లక్ మీ దగ్గరే ఉంది. అది మాకు ఇవ్వాలి. సత్య ధనంజయ అద్భుతంగా నటించారు. సత్య లాంటి యాక్టర్ తమిళనాడులో ఉంటే ఇంకా సెలబ్రేట్ చేసుకుంటారు. క్యారెక్టర్ కి స్క్రిప్ట్ కి తగిన యాక్టర్. ఈ క్యారెక్టర్ ని కథని నమ్మి సినిమా చేశారు. అందులో పని చేసిన ప్రతి యాక్టర్ కి థాంక్యూ. ఇలాంటి న్యూ ఏజ్ కంటెంట్ ని సినిమాని నిర్మించిన నిర్మాతలకు థాంక్యూ సో మచ్. సినిమాకి న్యాయం చేశారు. ఆడియన్స్ అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా ఇది. కచ్చితంగా మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు.
నిర్మాత దినేష్ సుందరం మాట్లాడుతూ.. ఈ సినిమాని బిగ్ సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ సో మచ్. బాస్ చిరంజీవి గారు బొమ్మ సూపర్ హిట్ అని రాశారు. ఆయన చెప్పినట్లే ఈ సినిమా బొమ్మ సూపర్ హిట్ అయింది. కథకి న్యాయం చేసే హీరో సత్యదేవ్. చాలా అద్భుతంగా నటించారు . డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ ఈ సినిమా కోసం దాదాపు ఐదేళ్లు కష్టపడ్డారు. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా అద్భుతంగా కథలో భాగం చేసి ఒక న్యూ ఏజ్ ఫిల్మ్ ని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు.ఈ సినిమాకి ప్రేక్షకులు చాలా గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు. సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ కాంబినేషన్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం' అన్నారు.
'జీబ్రా' బొమ్మ సూపర్ హిట్ సక్సెస్ చేసి మమ్మల్ని గెలిపించిన ఆడియన్స్ కి థాంక్ యూ సో మచ్: సక్సెస్ మీట్ లో హీరో సత్యదేవ్
Reviewed by firstshowz
on
9:58 pm
Rating: 5
No comments