వెన్నెల కిషోర్, రైటర్ మోహన్, వెన్నపూస రమణా రెడ్డి, శ్రీ గణపతి సినిమాస్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో నటించిన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ థ్రిల్లర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఈ సినిమాకి రైటర్ మోహన్ దర్శకత్వం వహించరు. శ్రీ గణపతి సినిమాస్ పతాకంపై వెన్నపూస రమణా రెడ్డి నిర్మించారు. లాస్యారెడ్డి సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 25 న క్రిస్మస్ సందర్భంగా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్ సినిమా యొక్క  థ్రిల్లింగ్ ప్రిమైజ్ ని సూచిస్తోంది. వెన్నెల కిషోర్ షార్ఫ్ డిటెక్టివ్‌గా కనిపించారు.

2018, పొలిమేర, కమిటీ కుర్రాళ్ళు, క లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలని సక్సెస్ ఫుల్ గా రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

సీయా గౌతమ్‌ మరో హీరోయిన్ గా నటిస్తుండగా, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్‌, మురళీధర్‌ గౌడ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. మల్లికార్జున్ సినిమాటోగ్రఫీ, అవినాష్ గుర్లింక్ ఎడిటర్. రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, బేబీ ఫేం సురేష్ బిమగాని ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. రాజేష్ రామ్ బాల్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, అనీష్ కురివెళ్ల, నాగ్ మహేష్, మచ్చ రవి, ప్రభావతి, సంగీత, శుభోదయం సుబ్బారావు, శివమ్ మల్హోత్రా, వాజ్‌పేయి ఇద్రీమా నాగరాజు, MVN కశ్యప్.

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: రైటర్ మోహన్
బ్యానర్: శ్రీ గణపతి సినిమాస్
నిర్మాత: వెన్నపూస రమణారెడ్డి
సమర్పణ: లాస్య రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజేష్ రామ్ బాల్
సంగీతం: సునీల్ కశ్యప్
డీవోపీ: మల్లికార్జున్ ఎన్
ఎడిటర్: అవినాష్ గుర్లింక్
ఆర్ట్ డైరెక్టర్: బేబీ సురేష్
స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్
పీఆర్వో: వంశీ-శేఖర్

No comments