'జీబ్రా' సినిమా అద్భుతంగా వచ్చింది. చాలా కొత్త కంటెంట్. ఇందులో థ్రిల్, ఫన్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా సినిమా పెద్ద విజయం సాధిస్తుంది: ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో సత్యదేవ్


టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ హ్యుజ్ క్రియేట్ చేశాయి. జీబ్రా నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో సత్య దేవ్ మాట్లాడుతూ.. జీబ్రా వెరీ యూనిక్ ఎంటర్ టైనర్. ఇందులో బ్యాంకర్ రోల్ ప్లే చేస్తున్నాను. నా గత సినిమాలకి భిన్నంగా వుండే పాత్ర. ఓ కామన్ మ్యాన్ గ్యాంగ్ స్టర్ వరల్డ్ లో పడే హార్డిల్స్ ని చాలా ఫన్ ఫుల్ గా డీల్ చేయడం జరిగింది. ఇందులో థ్రిల్లర్, ఫన్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. థ్రిల్, కామెడీ అద్భుతంగా బ్లెండ్ అయ్యింది. సిట్యువేషల్ కామెడీ అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యింది. మా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అన్నయ్య చిరంజీవి గారు రావడంతో సినిమా మరో స్థాయికి వెళ్ళింది. ఇది నాకు చాలా గొప్ప ఫీలింగ్. దాన్ని మాటల్లో చెప్పలేను. ఈ సినియాని తెలుగు తమిళ్ కన్నడ హిందీలో ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నాం. నా కెరీర్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్. ఇందులో కొత్త సత్యదేవ్ ని చూస్తారు. ఇకపై ఇంకా బిగ్ కాన్వాస్ లో సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను. జీబ్రా సినిమాకి కథ కోసం రావాలి. ఈశ్వర్ రాసిన కథ ఆడియన్స్ అద్భుతంగా అలరిస్తుంది. సినిమాని ఇంత గ్రాండ్ గా నిర్మించిన నిర్మాతలకు ఋణపడి వుంటాను. వారి విజన్ ని వందశాతం ఎచీవ్ చేశారు. డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ గొప్ప దర్శకుడు అవుతాడు. ఇందులో సందేహం లేదు. టెర్రిఫిక్ గా సినిమా తీశాడు. సినిమా కోసం ఓ బ్యాంక్ సెట్ వేశాం. అందులో ప్రతిది డిటెయిలింగ్ గా వుంటుంది. జీబ్రాపై మాకు పూర్తి నమ్మకం వుంది. నవంబర్ 22న జీబ్రా సినిమాకి రండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు' అన్నారు.

డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ మాట్లాడుతూ.. ఫైనాన్సియల్ క్రైమ్ చుట్టూ నడిచే కథ ఇది. కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ కథ రాశాను. డిజిటల్ క్రైమ్ ని లైమ్ లో పెట్టి సినిమా చేయడం జరిగింది. ఇందులో బ్యాంకింగ్, గ్యాంగ్ స్టర్, మనీ లాండరింగ్ ఇలా మూడు వరల్డ్స్ వుంటాయి. సత్య, ధన చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ప్రియా భావానీ శంకర్, సునీల్, సత్యరాజ్ ఈ పాత్రలనీ కథలో కీలకంగా వుంటాయి. ఇది మ్యూజికల్ క్రైమ్ స్టోరీ. ఇందులో ఏడు పాటలు ఉన్నాయి. కథకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. రవి బస్రూర్ బిజిఎం అద్భుతం చేశారు. మూడు వరల్డ్స్ కి మూడు డిఫరెంట్ లేయర్ మ్యూజిక్ ఉంటుంది. జీబ్రా ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది' అన్నారు.

నిర్మాత ఎస్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. జీబ్రా కంటెంట్ చాలా కొత్తగా వుంటుంది. యూత్ తో పాటు అందరికీ నచ్చుతుంది. ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్స్ లో వస్తారని నమ్మకం వుంది. కథని నమ్మి చేసిన సినిమా ఇది. సత్యదేవ్, డాలీ పోటీపడి నటించారు. ప్రతి సీన్ కొత్తగా వుంటుంది. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు' అన్నారు

నిర్మాత బాల సుందరం మాట్లాడుతూ.. దర్శకుడు ఈ కథ చెప్పినపుడే కేవలం హిట్ కాదు బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అనే నమ్మకం వచ్చేస్తుంది. సినిమాలో సత్య, డాలీ అద్భుతంగా నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. సినిమా మ్యూజికల్ ట్రీట్ గా వుంటుంది. ఈ సినిమా రైటింగ్, డైరెక్షన్ ని సెలబ్రేట్ చేసుకునేలా వుంటుంది' అన్నారు.

ఎడిటర్ అనిల్ మాట్లాడుతూ...డైరెక్టర్ ఈశ్వర్ తో త్రీ ఇయర్స్ జర్నీ. తను అద్భుతమైన స్క్రీన్ ప్లే రాశారు. రాసినప్పుడు కట్స్ ని పేపర్ పై రాసుకున్నాం. దానికి తగ్గట్టుగానే పర్ఫెక్ట్ గా షూట్ చేశాడు. సినిమా అద్భుతంగా వచ్చింది. అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది' అన్నారు.

No comments