అమ్మ రాజశేఖర్ ‘తల’ రిలీజ్ కు రెడీ !!!
దర్శకుడు అమ్మ రాజశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తల’. ఈ చిత్రంతో ఆయన తన కుమారుడు అమ్మ రాగిన్‌రాజ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్ సమర్పణలో ఎన్‌వీ ప్రసాద్, వాకాడ అంజన్‌కుమార్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో అమ్మ రాగిన్ రాజ్, రోహిత్, ఎస్తేర్ నొరొన్హ, ముక్కు అవినాష్, సత్యం రాజేశ్, అజయ్, రాజీవ్ కనకాల, ఇంద్రజ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న థియేటర్స్ లో విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి స్పందన లభించింది. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు తమన్, ఎస్.అస్లాం కేయి ధర్మతేజ సంగీతం అందించారు కథ, కొరియోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అమ్మ రాజశేఖర్.
No comments