కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మ్యాక్స్'. వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రల్లో నటించారు. వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలపై కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు.
డిసెంబర్ 27న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన 'మ్యాక్స్'లో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు. ఆల్రెడీ విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. తెలుగులో సుదీప్ అభిమానులు, ప్రేక్షకులు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.
డిసెంబర్ 27న కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' విడుదల... తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
Reviewed by firstshowz
on
6:32 pm
Rating: 5
No comments