‘అబద్ధమేవ జయతే’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన యంగ్ హీరో సుధీర్ బాబు

సుశాంత్ యష్కీ, ప్రవణ్యా రెడ్డి, మాస్టర్ వికాస్, మాస్టర్ భాను, విజయ కృష్ణా, వెంకీ లింగం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అబద్ధమేవ జయతే’. ఈ చిత్రానికి కె. కార్తికేయన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. పర్పుల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై బాల శివుడు, రాకేష్, సృజన గోపాల్ సహ నిర్మాతలుగా కొండా సందీప్, అభిరామ్ అలుగంటి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

‘అబద్ధమేవ జయతే’ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను యంగ్ హీరో కార్తికేయ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. టైటిల్ చాలా వెరైటీగా ఉందని అభినందిస్తూ కార్తికేయ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యంగ్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో హీరో హీరోయిన్ల గెటప్ బాగుంది. చూస్తుంటే ఇదేదో కొత్త కాన్సెప్ట్ అన్నట్టుగా కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన అనంతరం సుధీర్ బాబు చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. వికాస్ చిక్‌బల్లాపూర్ కెమెరామెన్‌గా, షాడో ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

సూరారం, వేములవాడ, వికారాబాద్, రాజమండ్రి, కాకినాడ ఇలా చాలా గ్రామీణ వాతావరణంలోనే సినిమాను షూట్ చేశారు. చిత్రయూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

నటీనటులు: సుశాంత్ యష్కీ, ప్రవణ్యా రెడ్డి, మాస్టర్ వికాస్, మాస్టర్ భాను, విజయ కృష్ణా, వెంకీ లింగం, బలగం సుధాకర్, రాజశేఖర్ అనింగి, శరత్ బగిరాల, సతీష్ సారిపల్లి, సుజాత, మాయానంద్ ఠాకూర్, అర్రున్ సవ్వనా, నటుడు ప్రదీప్ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ :పర్పుల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
నిర్మాత : కొండా సందీప్, అభిరామ్ అలుగంటి
సహ నిర్మాతలు : బాల శివుడు, రాకేష్, సృజన గోపాల్
దర్శకత్వం :కె. కార్తికేయన్ సంతోష్
సంగీతం :పవన్
కెమెరామెన్ :వికాస్ చిక్‌బల్లాపూర్
ఎడిటర్ :షాడో
పీఆర్వో : సాయి సతీష్

No comments