రెబల్ స్టార్ ప్రభాస్ ఎపిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్: పార్ట్1-సీజ్‌ఫైర్’కు ఏడాది పూర్తి
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ పాత్రలో నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్: పార్ట్1-సీజ్‌ఫైర్’ విడుదలై నేటితో (డిసెంబర్22) ఏడాదవుతుంది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
భారీ తారాగణం, కాన్వాస్, అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా యాక్షన్ జోనర్‌లో సరికొత్త పంథాను క్రియేట్ చేసింది. ప్రభాస్ మాస్ అప్పీల్, పృథ్వీరాజ్ సుకుమారన్ పెర్ఫామెన్స్ సహా అన్నీ ఎలిమెంట్స్ దీన్ని ఓ కల్ట్‌మూవీగా నిలబెట్టింది. ఓటీటీ మాధ్యమంలో ‘సలార్: పార్ట్1-సీజ్‌ఫైర్’ 300 రోజుల పాటు ట్రాప్ ట్రెండింగ్‌లో నిలవటం విశేషం. ఇది సినిమా ప్రేక్షకుల మనసుల్లో సంపాదించుకున్న స్థానం, తిరుగులేని విజయానికి తార్కాణంగా నిలిచింది. అలాగే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది.
‘సలార్: పార్ట్1-సీజ్‌ఫైర్’ అనేక ఊహించన మలుపులు తిరుగుతూ సీక్వెల్‌గా ‘సలార్ పార్ట్2: శౌర్యాంగ పర్వం’ రానుందని ఆశ్చర్యపరిచింది. ఈ రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించగా శ్రుతీ హాసన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో మెప్పించారు. ‘సలార్: పార్ట్1-సీజ్‌ఫైర్’ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ ‘సలార్ పార్ట్2: శౌర్యాంగ పర్వం’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలియజేసింది.
No comments