"100 క్రోర్స్" థ్రిల్లర్ జనవరి 11న ఆహా లో విడుదల
హ్యాపీ డేస్ లో నటించిన హీరో రాహుల్ టైసన్, చేతన్ కుమార్, సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ నటించిన "100 క్రోర్స్" చిత్రం ఆహా ఓటీటీ లో జనవరి 11న విడుదల కానుంది. ఎస్ ఎస్ స్టూడియోస్ పతాకంపై దివిజ కార్తీక్, సాయి కార్తీక్ నిర్మించిన ఈ చిత్రానికి విరాట్ చక్రవర్తి దర్శకత్వం వహించారు. 2024 సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఆహా లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
ఈ సినిమా స్క్రీన్ ప్లే ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోబెడుతుంది. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది, తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించలేరు. ఊహించని మలుపులతో, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సులతో, మరియు గుండెలు అరచేతిలో పెట్టుకునే సస్పెన్స్ తో కథ నడుస్తుంది.
హీరో చేతన్ కుమార్ తన అద్భుతమైన యాక్షన్ తో, రాహుల్ టైసన్ తన విలనిజంతో, సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ లు తమ గ్లామర్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. సాయి కార్తీక్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరింత రక్తి కట్టిస్తుంది.
నేనే నా, కాజల్ కార్తీక, కాళరాత్రి, లిటిల్ హార్ట్స్, టీనెజర్స్, శాకాహారి లాంటి మంచి చిత్రాలని ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించిన హనుమాన్ మీడియా ఇప్పుడు "100 క్రోర్స్" చిత్రం తో జనవరి 11 న మన ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా హనుమాన్ మీడియా అధినేత బాలు చరణ్ మాట్లాడుతూ "100 క్రోర్స్" ఒక అద్భుతమైన యాక్షన్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. జనవరి 11న ఆహా లో విడుదలయ్యే ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. అందరూ తప్పక చూడండి. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. "100 క్రోర్స్" ఆహా లో సూపర్ హిట్ అవుతుంది" అని తెలిపారు.
No comments