చేతిలో చెయ్యేసి చెప్పు బావ మూవీ రివ్యూ
రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో రేణు కెమెరామెన్ గా బండారు దానయ్య కవి సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా చేతిలో చెయ్యేసి చెప్పు బావ. రైటర్ జోసెఫ్ ఈ కథను అందించగా వేణు ఈ చిత్రాన్ని తన కెమెరాలు బంధించడం జరిగింది. లవ్ అండ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రానికి వెంకటేశ్వరరావు, ఆరిఫ్ ఎడిటర్ గా పని చేశారు. సి సి భవ మూవీస్ పై జోసెఫ్ నిర్మాతగా వచ్చిన ఈ చిత్రంలోని పాటలను పార్ధు అందించగా నూతన సంవత్సర సందర్భంగా ఒకటవ తేదీన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో సుమారు 65 థియేటర్లలో ఈ చిత్రం విడుదల కావడం జరిగింది. ఈ చిత్రంలో ఆదిత్య ఓం, రాహుల్, అంజన, రోహిణి, జయప్రకాశ్ రెడ్డి, సుమన్, పోసాని కృష్ణ మురళి కవిత, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే...
కథ:
ప్రేమించుకున్న ఓ ప్రేమ జంటను ఆ ఊరిలోని వారి తల్లిదండ్రులు ఇంకా ఊరి జనాలు ఒప్పుకోకపోవడంతో లేచిపోతారు. ఆ సమయంలో వారికి ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి? ఆ ప్రేమ జంట అనుకున్నట్లు ఊరి జనం నుండి తప్పించుకో గలిగారా లేదా? ఆదిత్య ఓంకు, వీరికి సంబంధమేంటి? వీడి కథలోకి ఆదిత్య ఓం ఎలా వస్తాడు? ఈ సినిమాలో గ్రామ పెద్ద వల్ల ఆ ప్రేమ జంటకు జరిగిన అన్యాయం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
నటీనటులు నటన :
చిత్రంలో ముందుగా మాట్లాడుకోవాల్సింది ప్రతి సీన్ లోను తగ్గట్లు నటిస్తూ ఎమోషన్‌ను క్యారీ చేసిన విధానం. సినిమాలో భయం దగ్గరి నుండి బాధపడటం వరకు, సంతోషం దగ్గర నుండి ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడం వరకు ఎటువంటి ఎక్స్ప్రెషన్ అయినా క్యారీ చేయడంలో చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు. ఆదిత్య ఓం హీరోగా చిత్రం నటిస్తూనే పూర్తిగా ఆ క్యారెక్టర్ లో జీవించడం జరిగింది. అదేవిధంగా నెగిటివ్ పాత్ర పోషించిన చలపతి రాజు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయడం జరిగింది. అలాగే చిన్న నటించిన మిగతా కొత్త, పాత నటీనటులు అంతా కూడా తమ పాత్రకు తగ్గట్లు నటనను పండిస్తూ రావడం జరిగింది. సినిమా చూసినంతసేపు ఎక్కడా కూడా వాడు నటిస్తున్నారు అని ఆలోచన అనేది మన మెదడులోకి రాకుండా అంత సహజంగా నటించారు నటీనటులు.
సాంకేతిక విశ్లేషణ :
ఈ చిత్రంలో ముఖ్యంగా కథ గురించి చెప్పుకోవాలి. అదేవిధంగా ఆ కథను కచ్చితంగా దర్శకుడు గురించి చెప్పుకోవాలి. ఈ రెండింటిలోనూ ఎంతో జాగ్రత్త వహిస్తూ రైటర్ జోసెఫ్, దర్శకుడు రాజేంద్రప్రసాద్ ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా కెమెరా కూడా ఎటువంటి పొజిషన్ లో పెడితే ఎటువంటి చిత్రీకరణ చేయొచ్చు అనే విషయంలో ఎంతో టెక్నిక్స్ తెలిసిన వ్యక్తిగా కెమెరామెన్ వేణు పనితీరు కనిపించింది. అదేవిధంగా ప్రతి సీన్లను సీన్లకు తగ్గట్లు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రికార్డింగ్‌ను కచ్చితంగా ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉండేలా జాగ్రత్తగా దానయ్య కవి తన పని తీరును ప్రూవ్ చేసుకున్నారు. అలాగే సినిమాలో సిచువేషన్ కు తగ్గట్లు పాటలు, ఇంకా అదర సాంకేతిక విలువలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. కలరింగ్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లు అలాగే ఇతర చిన్న చిన్న విషయాలలో కూడా ఎక్కడ తగ్గకుండా మంచి నిర్మాణ విలువలు కలిగిన చిత్రంగా శిక్షకులు ముందుకు వచ్చింది చేతిలో చెయ్యేసి చెప్పు బావా చిత్రం.
ప్లస్ పాయింట్స్:
కథ, దర్శకత్వం, నటీనటుల నటన, సంగీతం.
సారాంశం :
కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి ఎమోషన్‌ను ఎంజాయ్ చేస్తూ చూడతగిన సినిమాగా చేతులు చెయ్యేసి బావ చిత్రం ఉంది.
No comments