మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో 100% సక్సెస్ రేటుని సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్. ఈ ప్రొడక్షన్ నుంచి నుంచి రానున్న నాలుగో సినిమా ‘బ్రహ్మా ఆనందం’. హాస్య బ్రహ్మ పద్మశ్రీ అవార్డ్ గ్రహీత బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్‌గా నటించారు. శ్రీమతి సావిత్రి, శ్రీ ఉమేష్ కుమార్ సమర్పకులుగా డెబ్యూ డైరెక్టర్ ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు గురువారం నాడు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో..
‘పద్మశ్రీ’ బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘బ్రహ్మా ఆనందం చిత్రానికి నిర్మాత రాహుల్ మెయిన్ పిల్లర్. వరుసగా మూడు హిట్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. సెట్‌లో ప్రతీ పని దగ్గరుండి చేసుకుంటారు. నిఖిల్ వచ్చీ రావడంతోనే లెన్షన్ పడుతూ కాస్త తేడాగా కనిపించాడు. మీ కోసం, మీ పేరు మీదే సినిమా కథను రాసుకున్నాను అని, మీరు ఒప్పుకోకపోతే సినిమాను చేయను అని కాస్త తడబడుతూ చెప్పాడు. హీరో ఎవరు? అని అడిగా. రాజా గౌతమ్ అని చెప్పారు. ఆ తరువాత వెన్నెల కిషోర్ నుంచి ఫోన్ వచ్చింది. సరదాగా, నవ్వుతూ షూటింగ్ చేశాం. మితేష్ ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. శాండిల్య మ్యూజిక్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వెన్నెల కిషోర్ అద్భుతంగా నటించారు. సెట్‌లో యాక్టింగ్ చేసేటప్పుడే నాకు నవ్వొచ్చేది. ఈ చిత్రంలో అందరూ గొప్పగా నటించారు. నా లెగసీని కంటిన్యూ చేసే వారిలో కిషోర్ ఒకరు. దివిజ ఎంతో సహజంగా నటించింది. ఈ సినిమాకు ఓ రూపం రావడానికే ఎన్నెన్నో ట్విస్టులు వచ్చాయి. వాటిపైనే ఓ సినిమా చేయొచ్చు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. ‘బ్రహ్మా ఆనందం వంటి మంచి చిత్రంలో మంచి పాత్రను నాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. బ్రహ్మానందం గారు అంటేనే కింగ్ ఆఫ్ కామెడీ. గాడ్ ఆఫ్ కామెడీ. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు చూస్తే చాలన్నట్టు.. ఈ మూవీ ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ టైటిల్ చాలు. బ్రహ్మానందం గారితో షూటింగ్ అంటే.. ఎంతో సరదాగా ఉంటుంది. ఈ చిత్రంలో నా కామెడీ మీకు నచ్చితే ఆ క్రెడిట్ మాత్రం రాహుల్, నిఖిల్‌లకే చెందుతుంది. ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది. రాహుల్ రవీంద్రన్, రాజా గౌతమ్‌లు నన్ను ఎప్పుడూ ఇన్ స్పైర్ చేస్తుంటారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో వారిద్దరూ చాలా అద్భుతమైన వ్యక్తులు. రాహుల్ గారు ఇంకా ఇలాంటి మంచి చిత్రాలెన్నో నిర్మించాలి’
నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ.. ‘బ్రహ్మా ఆనందం అనే సినిమాను బ్రహ్మానందం గారితో చేయడం మామూలు విషయం కాదు. నిఖిల్ ఈ కథను చెప్పినప్పుడు.. చేస్తే బ్రహ్మానందం గారే చేయాలని అనుకున్నాం. రాజా గౌతమ్ చాలా సర్ ప్రైజింగ్‌గా అనిపిస్తారు. సినిమా చూస్తే అందరికీ ఆ విషయం అర్థం అవుతుంది. ముగ్గురు హీరోయిన్లు అద్భుతంగా నటించారు. మితేష్ కెమెరా వర్క్, ప్రణీత్ ఎడిటింగ్, శాండిల్య మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలం. మళ్లీ ఓ యంగ్ టీంతో రాబోతోన్నాను. నా సక్సెస్ మళ్లీ కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
రాజా గౌతమ్ మాట్లాడుతూ.. ‘బ్రహ్మా ఆనందం టీజర్‌లోని లాస్ట్ షాట్ ఒక్కటి చూస్తే ఈ సినిమా నాకు ఎందుకు అంత స్పెషల్ అన్నది అందరికీ అర్థం అవుతుంది. మా నాన్న గారితో ఇలా ఈ సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా నాన్న, వెన్నెల కిషోర్ గారితో చాలా కంఫర్టబుల్‌గా పని చేశాను. నేను ఈ పాత్రను చేయగలను అని నమ్మకంతో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. శాండిల్య మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. మితీష్ డీఓపీ చాలా కామ్‌గా ఉంటారు. కానీ మా అందరినీ అద్భుతంగా చూపించారు. ఎంతో సరదాగా, నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా షూటింగ్‌ను చేశామ’ని అన్నారు.
డైరెక్టర్ ఆర్వీఎస్ నిఖిల్ మాట్లాడుతూ.. ‘బ్రహ్మా ఆనందం కథను పట్టుకుని తిరుగుతున్న టైంలో రాహుల్ గారు దొరకడం నా అదృష్టం. నా డైరెక్షన్ టీం ఎంతో సపోర్ట్‌గా నిలిచింది. హీరోయిన్లంతా కూడా చక్కగా నటించారు. వెన్నెల కిషోర్ గారు ఈ చిత్రానికి బ్యాక్ బోన్‌లా నిలిచారు. హీరో రాజా గౌతమ్ గారు అద్భుతంగా నటించారు. ఆయన కోసమే ఈ సినిమాను నాలుగైదు సార్లు చూస్తారు. డీఓపీ మితేష, ఎడిటర్ ప్రణీత్, శాండిల్య మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. బ్రహ్మానందం గారి కోసమే ఈ కథను రాశాను. ఆయన లేకపోతే ఈ చిత్రం లేదు.. నేను లేను’ అని అన్నారు.
ప్రియా వడ్లమాని మాట్లాడుతూ.. ‘ఇంత మంచి చిత్రంలో నేను నటించినందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ మూవీ డెస్టినీ వల్లే నాకు వచ్చింది. ఈ చిత్రం మీ అందరి ఆశీస్సులతో పెద్ద విజయం సాధించాలి’ అని అన్నారు.
కెమెరామెన్ మితేష్ మాట్లాడుతూ.. ‘నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత రాహుల్ గారికి థాంక్స్. బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్, గౌతమ్ వంటి వారితో పని చేయడం ఆనందంగా ఉంది. నిఖిల్‌తో షూట్ చేయడం సరదాగా అనిపించింది. శాండిల్య మ్యూజిక్ బాగా వచ్చింది’ అని అన్నారు.
సంగీత దర్శకుడు శాండిల్య మాట్లాడుతూ.. ‘నాకు ఈ చిత్రం అవకాశం ఇచ్చిన రాహుల్ గారికి థాంక్స్. గౌతమ్ గారితో పని చేయడం చాలా సర్ ప్రైజింగ్‌గా అనిపించింది. నేను, మా అన్న బ్రహ్మానందం గారి మీమ్స్ పంచుకుంటూ ఉంటాం. ఫిబ్రవరి 14న రాబోతోన్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
‘బ్రహ్మా ఆనందం’ చిత్రంలో అందరూ గొప్పగా నటించారు.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పద్మశ్రీ బ్రహ్మానందం
Reviewed by firstshowz
on
7:51 pm
Rating: 5
No comments